Plastic Surgery : పుట్టుకతో వచ్చిన సమస్యలకు ప్లాస్టిక్ సర్జరీ తో చెక్

By manavaradhi.com

Updated on:

Follow Us
Plastic Surgery

కోన్ని సంవత్సరాల క్రితం ప్లాస్టిక్ సర్జరీ అంటే చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన విషయం. నేడు ఇది ప్రపంచ వ్యాప్తంగా మనుషుల జీవితంలో భాగమైపోయింది. దీని గురించి సాధారణ ప్రజలలో కూడా అవగాహన పెరిగిపోతుంది. వయస్సు పెరిగే కోద్ది, లేదా మానసిక ఒత్తిడి వలన ముఖంలో ముడతలు అనేవి కనిపిస్తుంటాయి. వీటికి గురించి మహిళలు ఎక్కువగా ఆందోళన చెందుతుంటాయి. ఈ విధమైన ముడతలను సర్జరీ చేసి తోలగించడాన్ని పేస్ లిఫ్టింగ్ అంటారు. ఇంకా కొన్ని సమయాలలో అనుకోకుండా ముఖానికి గాయాలైన ముఖం పై ఉండే చర్మం డ్యామేజ్ అయినా కూడా వారి ముఖానికి సర్జరీ చేసి కోంత వరకు వారకైనా గాయాన్ని నయం చేస్తుంటారు. ఇంకా అనేక కారణాల వలన ముఖానికి సంబందించిన సర్జరీలను వైద్యులు సిఫారస్సు చేస్తుంటారు.

1815 లో మొట్టమొదటి సారిగా పాశ్చాత్య దేశాలలో ప్లాస్టిక్ సర్జరీ ని చేయడం జరిగింది. సర్ వారోల్ గిల్లీ ని ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ అంటారు. ఎందుకంటే ముఖానికి సంబందించిన సౌందర్యాన్ని పెంచడంలో ఈయన ఎన్నో మెలకువలను కనుగొని ముఖం యొక్క ఆకృతిని అందంగా మలచడానికి ఎంతో ప్రయత్నం చేసాడు.

వైద్య విధానంలో ఈ ప్లాస్టిక్ సర్జరీ ని ప్రధానంగా 6 భాగాలుగా విభజించడం జరిగింది.

1.ఈస్థటిక్ సర్జరీ… ముఖం, శరీరం అందంగా ఉండేటట్లు చేయడానికి ఈ సర్జరీని ఉపయెగిస్తారు.
2.బర్నర్ సర్జరీ…. ఇది ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది..
A) కాలిన వెంటనే సర్జరీ చేయడం
B) తరువాత అందవికారంగా కనిపించే చర్మాన్ని, అవయవాలను సరిచేయడం.

  1. క్రేనియో ఫెసియల్ సర్జరీ… దీని ద్వారా ముఖంలోని కొన్ని భాగాలను పునర్నిర్మాణం చేస్తారు.దీని ద్వారా పుట్టుకతో వచ్చే ముఖానికి సంబందించిన లోపాలను సరిచేయవచ్చు. పిల్లలలో కనిపించే కెఫ్ట్ లిప్ మొదలైనవి… ఇంక పెద్దవారిలోనైతే, చెవికి, ముక్కుకు, గడ్డానికి బుగ్గలకు సంబందించిన వాటిని సర్జరీ ద్వారా సరిచేస్తారు.

ఆదునిక వైద్య పద్దతులను ఉపయోగించి అనుకోకుండా ప్రమాదాల లో తెగి పడిన చేతులను, చేతి వేళ్ళను కూడా సర్జరీ ద్వారా కలిపే వైద్య విధానం అందుబాటులోకి వస్తుంది. ఇలాంటి విధానాన్నే హ్యాండ్ సర్జరీ అంటారు. ఇంకా శరీరంలో తెగిన అవయవాలను తిరిగి అతికించేప్పుడు నరాలు, రక్త నాళాలు వంటి సూక్ష్మమైన వాటిని మైక్రోస్కోప్ ద్వారా చూస్తూ అతికేస్తారు అందుకే ఈ విధానాన్ని మైక్రోసర్జరీ అంటారు.

వందశాతం అందంగా ఉన్నాం అని ఎవరూ అనుకోరు… వారిలో ఉన్న చిన్న లోపాన్ని గుర్తించి దానిని సరిచేయించుకోవడానికి వైద్యులను సంప్రదిస్తూ ఉంటారు. అనేక రకాల కారణాలతో సర్జరీలు చేయించుకోవడం ఈ రోజులలో సర్వసాధారణమైపోయింది. ఈ సర్జరీ లు ప్లాస్టిక్ సర్జరీ అని బేరయాట్రిక్ సర్జరీ అని రెండుకాలుగా నిపుణులైన వైద్యులు చేస్తారు. శరీరంలో కొన్ని ప్రాంతాలలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోయినపుడు, ఆ ప్రాంతాలలో కోవ్వును తీసి వేసి శరీరాకారాన్ని సరిగా చేయడంలో ఉపయోగించే విధానాన్ని లైపోసక్షన్ అంటారు. దీనిని ప్లాస్టిక్ సర్జరి చేస్తారు. అలాకాకుండా అధిక బరువున్నపుడు ఊబకాయంతో శరీరమంతా బాగాలావవుతుంది.ఈ లావుని తగ్గించడానికి బేరియాట్రిక్ సర్జరీ చేస్తారు. ఆహారం పట్టే పోట్టను తగ్గించడం, జీర్ణమైన ఆహారాన్ని రక్తంలో కలిపే చిన్న ప్రేగు పరిమాణాన్ని తగ్గించే సర్జరీలను బేరియాట్రిక్ సర్జరీ అంటారు.

చాలా మంది సర్జరీ అంటే కేవలం అందం కోసం చేయించుకునే కాస్మోటిక్ సర్జరీ అనుకుంటారు. కాని శరీరంలోని అవయవాలను సరిచేయడంలో ఆ కాస్మోటిక్ సర్జరీ కూడా ఓ బాగం…అనుకోకుండా శరీర అవయవాలను కోల్పోయిన వారికి ప్లాస్టిక్ సర్జరీ అనేది ఓ వరంలాంటిది..అందుకే దీనిపై ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం జరుగుతుంది.

Leave a Comment