Carpal Tunnel Syndrome – అరచేయి, మణికట్టులో, వేళ్లలో నొప్పి ఉందా.. అయితే! జాగ్రత్త

By manavaradhi.com

Published on:

Follow Us
Carpal Tunnel Syndrome

మణికట్టులో ఉండే మీడియన్ నెర్వ్ దగ్గర ఇబ్బందిగా అనిపించడమే కార్పల్ టన్నెల్ సిండ్రోమ్. ఈ సమస్య అనేక విధాలుగా కనిపిస్తుంది. కొన్ని మార్లు నిస్సత్తువుగా మారుతుంది. కొన్ని సార్లు నొప్పిగా ఉంటుంది. నిజానికి చేతి మణికట్టు నుంచి నరాలు చేతిలోని వివిధ భాగాలకు వెళతాయి. ఈ చిన్న భాగాన్నే కార్పల్ టన్నెల్ గా వ్యవహరిస్తారు. ఈ మణికట్టులో ఉండే మీడియన్ నెర్వ్ బొటన వేలితో పాటు… మిగిలిన మూడు వేళ్ళ కదలికలను నియంత్రిస్తూ ఉంటుంది. చిటికెన వేలు మీద దీని ప్రభావం ఉండదు. కేవలం కదలికలనే కాదు, దానికి కలిగే నొప్పి లాంటి వాటిని కూడా ఇదే స్వీకరిస్తూ ఉంటుంది. ఈ సమయంలో ఆ నరం నొప్పిగా ఉన్నప్పుడు చేతిలో పని చేయడం సాధ్యం కాదు. ఏ చిన్న పని చేసినా నిస్సత్తువుగా లేదా నొప్పిగా అనిపిస్తుంది. దీనినే కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ గా చెబుతారు.

మీడియన్ నెర్వ్ ను ఒత్తిడికి గురి చేయడం కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ కు ప్రధాన కారణం. వాపు వల్ల ఈ ఒత్తిడి కలిగినా లాంటివి మొదలైనా, కార్పల్ టన్నెల్ చిన్నది అవుతుంది. దీని వల్ల కూడా సిండ్రోమ్ ప్రారంభం అవుతుంది. ఇలా వాపునకు కూడా అనేక కారణాలు ఉండవచ్చు. హైపోథైరాయిడిజమ్, రుమటాయిండ్ ఆర్థరైటిస్, డయాబెటిస్ లాంటి ఆరోగ్య సమస్యల వల్ల ఈ ఇబ్బందులు ఎదురు కావచ్చు. కొన్ని రకాలైన చేతి కదలికలు ముఖ్యంగా మణికట్టును కిందకు వంచడం లాంటివి, ఒకే విధమైన చేతి కదలికలు ఎక్కువగా ఉండడం లాంటివి కూడా ఈ సమస్యకు కారణం కావచ్చు. ఒ:క్క సారి మణికట్టు మీద ఒత్తిడి మొదలైందంటే వెంటనే కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ సమస్య బాధిస్తుంది.

కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ వల్ల నొప్పి, నిస్తత్తువ, బలం లేకపోవడం, ఎక్కువ సేపు నిలబెట్ట లేకపోవడం లాంటి సమస్యలు చేతులు మరియు వేళ్ళలో ఎదురౌతాయి. కొంత మందిలో అరచేయి మరియు మోచేతి మధ్యలో కూడా నొప్పి కనిపిస్తుంది. దీని తాలూకూ లక్షణాలు ఎక్కువగా బొటనవేలిలో కనిపిస్తాయి. చూపుడు వేలు, మధ్య వేలు మీద కూడా దీని ప్రభావం అధికంగా ఉంటుంది. మిగిలిన వేళ్ళలో సమస్య ఉండి, చిటికెన వేలుకు సమస్య రాలేదంటే ఇది కచ్చితంగా కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ గానే భావించాలి. చిటికెన వేలు మీద వేరే నరం ప్రభావం చూపుతుంది.

తొలుత ఈ సమస్యకు సంబంధించిన లక్షణాలు రాత్రులు కనిపిస్తాయి. చేతిని ఊపడం ద్వారా కాస్తంత విశ్రాంతి పొందవచ్చు. కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ సమస్య ను గురించి వైద్యుని సంప్రదించినప్పుడు నొప్పి ఏయే ప్రాంతాల్లో ఉంది, చేయి బలం ఎంత ఉంది, మెడ ఎలా కనిపిస్తోంది, భుజాల తీరు ఎలా ఉంది, చేతుల కదలికల పరిస్థితి ఏమిటి లాంటి విషయాలు తెలుసుకుని రక్తపరీక్ష, నరాల పరీక్షను సూచిస్తారు. పరీక్షల ఆధారంగా సమస్యను నిర్థారించి చికిత్సను అందిస్తారు. ఈ సమస్య సాధారణ స్థాయిలో ఉన్నప్పుడు కాసేపు విశ్రాంతి ఇవ్వడం, 10 నుంచి 15 నిముషాలు మణికట్టు మీద ఐస్ ఉంచడం లాంటివి చేయవచ్చు.

నొప్పి, వాపు తగ్గేందుకు కొన్ని రకాల మందులు కూడా వాడవచ్చు. రాత్రిళ్ళు మణికట్టుకు కట్టు లాంటిది కట్టుకోవచ్చు. మనం తీసుకునే ఇలాంటి జాగ్రత్తలు ఈ సమస్య లక్షణాలను ఆపుతుంది. సమస్య మరింత తీవ్రం అయితే శస్త్ర చికిత్స అవసరం అవుతుంది. చేయి కదపలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాత్రమే శస్త్ర చికిత్స చేయించుకోవలసి ఉంటుంది.

కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ బాధిస్తున్నప్పుడు ముఖ్యంగా మన ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. బరువు విషయంలో మరిన్ని జాగ్రత్తలు పాటించాలి. ప్రతి రోజూ వ్యాయామం చేయడం వల్ల ఈ సమస్య నుంచి పరిష్కారం పొందవచ్చు. అసలు ఈ సమస్యే రాకుండా కాపాడుకోవచ్చు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉండే వారు అంటే ఆర్థరైటిస్, డయాబెటిస్ లాంటి సమస్యలు ఉన్న వారు వైద్యుని సలహాలు పాటిస్తూ ఈ సమస్య రాకుండా చూసుకోవచ్చు. అంతే కాకుండా చేతులు మణికట్టును సరైన విధానంలో ఉంచుకోవడం కూడా ఈ సమస్య రాకుండా కాపాడుతుంది.

ఎప్పుడూ మణికట్టును న్యూట్రల్ పొజిషన్ లో ఉంచాలి. ఎవైనా ఎత్తడానికి చాలా మంది వేళ్ళను మాత్రమే వాడతారు. అలా కాకుండా చేతిని వాడాలి. కంప్యూటర్ మీద టైప్ చేస్తున్నప్పుడు చేతిని నేరుగా ఉంచడానికి ప్రయత్నించాలి. వంపుగా ఉంచడం వల్ల సమస్య పెరుగుతుంది. చేతిని మణికట్టు కంటే ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. మోచేతులు మీ వైపు ఉన్నప్పుడు మీ భుజాలకు విశ్రాంతి ఇవ్వాలి. చేతుల మీద ఒకే దిశలో ఒత్తిడి ఉంచకుండా మార్పులు చేస్తూ ఉండాలి. దాని వల్ల సమస్యను తగ్గించుకోవచ్చు, రాకుండా కాపాడుకోవచ్చు.

Leave a Comment