Pneumonia : న్యుమోనియా వచ్చే ప్రమాదం ఎవరికి ఎక్కువ? వ్యాధి లక్షణాలు ఏంటి..?

By manavaradhi.com

Published on:

Follow Us
Pneumonia

సాధారణంగా ఎవరికైనా దగ్గు, కఫం వస్తుంటే నిమ్ము చేసిందని అంటూ ఉంటాము. ఇలా నిమ్ము చేయడాన్నే వైద్యపరిభాషలో న్యుమోనియా అంటారు. ధూమపానం , మద్యం తీసుకునే వారిలో, సమతులాహారం తీసుకోని వారిలో, మధుమేహం, హెచ్ఐవి, కేన్సర్, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న వారిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల న్యుమోనియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

న్యూమోనియా.. శ్వాసకోశాలకు వచ్చే ఒక ఇన్ ఫెక్షన్. ఇది వైరస్, బాక్టీరియా, ఫంగస్, ప్రోటోజోవాల వలన వస్తుంది. మనం శ్వాస తీసుకుంటున్నప్పుడు గాలితో పాటుగా సూక్ష్మజీవులు మన శరీరంలోకి చేరడం వల్ల శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని ఇచ్చే యాంటిబాడీస్, తెల్ల రక్త కణాలను నిర్వీర్యం చేసి శరీరానికి రక్షణ కలిగిస్తుంటాయి. కొంతమందిలో సహజంగానే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటం, లేదా కొన్ని రకాల వ్యాధుల వలన ఈ వ్యాధి నిరోధక శక్తి సన్నగిల్లుతుంది.

ధూమపానం, మద్యం తీసుకునే వారిలో, సమతులాహారం తీసుకోని వారిలో, మధుమేహం, హెచ్ఐవి, క్యాన్సర్ , గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న వారిలో కూడా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల వీరికి న్యూమోనియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా రెండేళ్ల లోపు పిల్లలలో.. 60 ఏళ్ళు దాటిన వృద్ధులలో న్యూమోనియా రావడానికి కారణమవుతాయి. కొన్నిసార్లు ఆరోగ్యంగా ఉన్న వారిలో కూడా ఈ వ్యాధి రావచ్చు.

న్యూమోనియా సోకిన తరువాత ఒకటి రెండు వారాలు బాధిస్తుంది. ఆ సమయంలో తీవ్రంగా ఉన్న సూక్ష్మజీవులతోపాటు, తీవ్రత తక్కువగా ఉన్న సూక్ష్మజీవులు కూడా తమ ప్రతాపాన్నిచూపించి పిల్లల్లో రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ , పెద్దవారిలో ఇన్‌ఫ్లూయెంజా వైరస్ వలన వచ్చే జలుబు, దగ్గు తరువాత న్యూమోనియా తరచుగా వస్తుంటుంది. సహజంగా ప్రతివారికి ముక్కు, గొంతు, నోటిలో ఉండే సూక్ష్మజీవులు ఎలాంటి వ్యాధి కలుగజేయవు. న్యూమోనియాను కలిగించే కారణాలను బట్టి దీనిని వైరల్ న్యుమోనియా, బాక్టీరియల్ న్యుమోనియా, ఫంగల్ న్యుమోనియా అని వ్యవహరిస్తారు. వీటిలో సాధారణంగా కనిపించే ప్రమాదకరమైనది బాక్టీరియల్ న్యూమోనియా.

న్యూమోనియా సోకిన రోగుల్లో చలితో కూడిన జ్వరం, దగ్గు, కఫం, ఛాతీలో నొప్పి ఉంటాయి. కొందరిలో దగ్గుతోపాటు రక్తం కూడా పడవచ్చు. వ్యాధి తీవ్రంగా ఉన్నప్పుడు రక్తం ద్వారా ఇతర అవయవాలకు పాకే అవకాశం ఉంది. దీనిని బాక్టీరీమియా, సెప్టిసీమియా అంటారు. వీటి వలన గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయం, మెదడు తదితర అవయవాల్లోకి ఇన్‌ఫెక్షన్ పాకే అవకాశం ఉంది. కాబట్టి సకాలంలో ఈ వ్యాధిని నిర్ధారించి తగిన చికిత్స తీసుకోవాలి.

రక్త పరీక్షల్లో తెల్ల రక్త కణాల సంఖ్య, ఇఎస్ఆర్ వలన వ్యాధి ఉన్నదీ లేనిదీ తెలుసుకోవచ్చు. బ్లడ్‌కల్చర్, కళ్లె పరీక్ష, ఛాతి ఎక్స్‌రే, సిటి స్కాన్, బ్రాంకోస్కోపీ వంటి పరీక్షలలో వ్యాధి కారకాలైన సూక్ష్మజీవులను గుర్తించడమే కాకుండా వ్యాధి తీవ్రతను కూడా వైద్యులు అంచనా వేయగలుగుతారు. కాబట్టి తొలిదశలోనే వ్యాధిని గుర్తించి వైద్య సలహాను పాటిస్తే రాబోయే దుష్పరిణామాలను నివారించవచ్చు.

శ్వాసకోశాల్లోని న్యుమోనియా చీముగా మారడం అది చాతిలో.. మెదడులో చేరడం వల్ల మరియు సెప్సిస్ వల్ల అవయవాలు దెబ్బతింటాయి. కొన్నిసార్లు అక్యూట్ లంగ్ ఇంజ్యూరీ (ఎఎల్ఐ) కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి తొలిదశలోనే ఈ వ్యాధిని గుర్తిస్తే ఈ వ్యాధికి చెక్ పెట్టవచ్చు.

Leave a Comment