Osteoporosis : ఆస్టియోపోరోసిస్ ఉంటే ఈ లక్షణాలు ఉంటాయి

By manavaradhi.com

Published on:

Follow Us
Osteoporosis and Bone fractures

వయసు పెరిగే కొద్ది ఎముకలు గుల్లబారి సులువుగా విరిగిపోవడాన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు. ఒకప్పుడు ఇది వయసు పైబడినవారికి మాత్రమే వచ్చేది. కానీ మారిన జీవనశైలి విధానంవల్ల యుక్తవయసులోనే వస్తుంది. సాధారణంగా ఆస్టియోపోరోసిస్ పురుషులకంటే స్త్రీలపైనే ఎక్కువగా ప్రభావం చూపుతుంది. అసలు ఆస్టియోపోరోసిస్ వ్యాధి రాకుండా ఏంచేయాలి…? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ వ్యాధి మన దరి చేరకుండా కాపాడుకోవచ్చు.

వయసు పైబడుతున్న కొద్ది మనల్ని చుట్టు ముట్టే వ్యాధుల్లో ఆస్టియోపొరోసిస్‌ ఒకటి. వృద్ధుల్లో ఎముక సాంద్రత తగ్గిపోవడంతో ఈ సమస్య రావడం దీంతో ఫ్రాక్చర్‌లు తొందరగా అయ్యే అవకాశాలుంటాయి. వయస్సు పెరుగుతున్న కొద్దీ సరిపడినంతగా క్యాల్షియం తీసుకోకపోతే క్యాల్షియం లవణం క్రమంగా తగ్గిపోతుంది. ఎముకలు చిన్నగా ఉండటం వల్ల సాంద్రత తక్కువై ఆస్టియో పోరోసిస్ వస్తుంది.

ఎముకలలో ఉండే ద్రవ్యరాశి తగ్గిపోవడం వల్ల వస్తుంది. 35 ఏండ్ల వయస్సు వచ్చే వరకు ఎముక ద్రవ్యరాశి స్థిరమైన అభివద్ధితో ఉంటుంది. పూర్తి రూపాన్ని పొందేటంత వరకు, తిరిగి నిర్మితమయ్యే వరకు విరిగినప్పుడు అతుక్కుంటుంది. అభివృద్ధి చెందుతుంది. 40 ఏండ్లు వచ్చేటప్పటికి ఎంత వరకైతే ఆభివద్ధి చెందిందో అంతకన్నా మించిపోతే ఎముక చిట్లి పోతుంది. ఎముకలో ద్రవ్యరాశితో పాటు క్యాల్షియం తగ్గుతుంది.

ఆస్టియోపోరోసిస్ వల్ల ఎముకలు పెళుసుగా తయారై.. ఫలితంగా ఎముకలు విరిగిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. చాలా మందికి ఎముకలు విరిగే వరకు ఆస్టియోపొరోసిస్ తో బాధపడుతున్నారనే విషయం తెలియదు. స్త్రీలలో ఎముకలను ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ సంరక్షిస్తుంది. ఎముకలు బలహీనానికి కారణమయ్యే మేనోపాజ్‌కి చేరినప్పుడు ఈస్ట్రోజెన్ గణనీయంగా తగ్గుతుంది. ఫలితంగా స్త్రీలలో ఈ వ్యాధి రావడానికి ఆస్కారమెక్కువగా ఉంటుంది.

క్యాల్షియం మరియు విటమిన్ D ల లోపం కూడా, ఎముకలు బలహీనపడడానికి ఒక కారణం కావచ్చు. హైపర్ పారాథైరాయిడిజం ఉన్నప్పుడు, రుమటాయిడ్ ఆర్థరైటిస్, సీఓపీడీ వ్యాధికి గురైనప్పుడు, అధిక మద్యపానం, సిగరెట్లు తాగడం, కొన్ని రకాల మందుల వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రారంభ దాశలో గుర్తించడం చాలా వరకు జరగదు. ఈలోపు ఎముకలకు జారగాల్సిన నష్టం జరిగిపోవడం, చిన్నపాటి ప్రమాదాలకే ఎముకలు విరిగే పరిస్థితి తలెత్తుతుంది. ఆస్టియోపోరోసిస్ ఉన్నవారికి ఎముకల్లో నొప్పి ఎక్కువగా ఉంటే మణికట్టు, వెన్నెముక, తుంటి ఎముక భాగాలను ఈ బోన్ డెన్సిటో మీటర్ ద్వారా పరీక్షిస్తారు.

ఆస్టియోపొరోసిస్ కు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
ఆస్టియోపొరోసిస్ రాకుండా ఉండాలంటే జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. బలమైన, దట్టమైన ఎముకల అభివృద్ధికి తగినంత క్యాల్షియం, విటమిన్ D అవసరం. రోజూ నడక వంటి వ్యాయామాలు చేయటంతో పాటు తగినంత క్యాల్షియం, విటమిన్‌ డి తీసుకుంటే ఎముక పుష్టిని కాపాడుకోవచ్చు.క్యాల్షియం ఎక్కువగా లభించే పండ్లు, కూరగాయలు ఆహారంలో భాగం చేసుకోవాలి. నిత్యం 1200 మిల్లీగ్రాముల క్యాల్షియం అందేలా చూసుకోవాలి.

రోజూ కాసేపు ఎండలో గడిపడం ద్వారా విటమిన్ డి పొందవచ్చు. ప్రోటీన్ అధిక శాతం కలిగి ఉండే పాలు, పెరుగు, చీజ్ వంటి పాల పదార్ధాలు తీసుకోవాలి.క్యాల్షియం, విటమిన్ B6, B12, ఫోలేట్ అధికంగా ఉండే గుడ్డును రోజువారి మెనూలో చేర్చుకోవాలి. క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయించు కోవటంతోపాటు ప్రతినిత్యం మందులు వాడుతూ ఫిజియోథెరపిస్టు సలహాపై వ్యాయామం చేయాలి.

క్యాల్షియం ఎక్కువగా లభించే ఆహారం తీసుకోవాలి. చికిత్సలో భాగంగా ఆహార, వ్యాయామ నియమాలను కచ్చితంగా పాటించాలి. క్యాల్షియం ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడంతోపాటు నడక సరైన వ్యాయామాలు క్రమంతప్పకుండా చేస్తే ఎముకు దృఢంగా తయారవుతుంది.

Leave a Comment