Weight loss:బరువు తగ్గాలంటే ఏం చేయాలి? వ్యాయామం చేయాలా.. లేక డైట్ చేయాలా..!

By manavaradhi.com

Published on:

Follow Us

ప్రస్తుత కాలంలో అధిక బరువు ఒక సాధారణ సమస్యగా చెప్పవచ్చు. స్థూలకాయం అనేది చాలా రకాల ఆరోగ్య సమస్యలకు ఒక మూలంగా చెప్పవచ్చు. ప్రతి ఒక్కరు సన్నగా, నాజుకుగా మరియు శారీరక పరంగా ఫిట్’గా ఉండాలి అనుకుంటారు. అందుకు కొందరు డైట్ చేస్తే సరిపోతుంది అంటారు …. మరికొందరు వ్యాయామం చేస్తేనే బరువు తగ్గుతారు అంటారు. ఇంతకీ ఏది మంచిది …బరువు తగ్గటానికి డైట్ మంచిదా లేక వ్యాయామం మంచిదా..?

అధిక బరువు బరువు తగ్గించుకొవడానికి చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. వ్యాయామాలను చేయటం లేదా ఆహార ప్రణాలికలను పాటించటం. సరైన బరువు కలిగి ఉండడమే ఆరోగ్యానికి మూల సూత్రం. ఆరోగ్యకరమైన బరువు అనారోగ్య సమస్యల నుంచి వచ్చే ప్రమాదాన్ని బాగా తగ్గిస్తుంది. ఎక్కువ మందిలో బాడీ మాస్ ఇండెక్స్ ద్వారా వారి బరువు ఆరోగ్యకరమైనదా, కాదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. సరైన BMI కలిగి ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు… వ్యాయామం చేయడం చాలా అవసరం.

అధిక బరువు కలిగిన వారు తగ్గాలంటే డైటింగ్ చేయడం కంటే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కలిగి ఉండడం మంచి ప్రయోజనాలు ఇస్తుంది. అందుకే ఎక్కువ తక్కువలు కాకుండా, సరైన స్థాయిలో ఆహారాన్ని తీసుకోవడం వల్ల సరైన బరువును సంపాదించుకోగలుగుతారు. బరువు ఎక్కువ ఉన్నారని కడుపు కాల్చుకోవడం మంచి పద్ధతికాదు. అలాగే చాలా మంది తెగ కష్టపడి వ్యాయామాలు చేస్తుంటారు. దీని వల్ల బరువు తగ్గడం ఏమోగానీ కానీ బలహీనంగా తయారవుతున్న వాళ్లు చాలా మంది ఉంటారు. అందుకే బరువు తగ్గడం కోసం ఆరోగ్యకరమైన విధానాన్ని పాటించడం చాలా ముఖ్యం.

  • చాలా మంది డైటింగ్ పేరుతో ఆరోగ్యకరమైన ఆహారానికి దూరం అవుతారు. దీని వల్ల వారు సరైన ఫలితాలు సాధించలేరు.
  • పోషకాలు లేని ఆహారానికి దూరం కావడం వల్ల సరైన బరువును పొందలేరు, దానికి తగ్గట్టు పని చేసే ఓపికను కూడా కోల్పోతారు. అందుకే బరువు ఎక్కువ ఉన్న వారికి డైటింగ్ కంటే ఆహారం విషయంలో మార్పులే ఎక్కువ ప్రయోజనాలు అందిస్తాయి.
  • ఇందులో ప్రధానమైనది ఫైబర్ తో కూడిన ఆహారాన్ని తీసుకోవడమే. సరైన ఫైబర్ లేని ఆహారం తీసుకోవడం వల్ల ఆహారం సరిగా జీర్ణం కాదు. దీని వల్ల పూర్తి పోషకాలు శరీరానికి అందవు.
  • అంతే కాకుండా జంక్ ఫుడ్స్ లాంటివి తీసుకోవడం వల్ల, మనం తీసుకున్న ఇతర ఆహారంలో ఉండే పోషకాలు కూడా సరైన స్థాయిలో శరీరానికి అందవు. దీంతో పాటుగా ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. మంచి ఆహారం అని మరీ ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు.
  • అలాగే ప్రతి రోజు ఎంతో కొంత వ్యాయామం చేయాలి ఎందుకంటే రక్త ప్రసరణ వ్యావస్థ అనేది చురుకుగా పని చేయాలంటే తప్పని సరిగా వ్యాయామం చేయాలసిందే, వ్యాయామంతో వంట్లో ఉండే కొవ్వు కరుగుతుంది,రక్త ప్రసరణ వ్యవస్థ కూడా సక్రమంగా జరుగుతుంది.
  • రోజూ వ్యాయామం చేస్తున్నాం, సరైన పోషకాహారం తీసుకుంటున్నాం కదా అని చెప్పి వేగంగా ఫలితాన్ని ఆశిస్తారు. బరువు తగ్గడం అనేది నిజానికి కొందరిలో నెమ్మదిగా ప్రారంభమవుతుంది.

బరువు పెరగాలనుకునే వారికైనా, తగ్గాలనుకునే వారికైనా సరైన ఆహారం, సరైన వ్యాయామం చాలా అవసరం. కొవ్వులను తగ్గించడం, చక్కెర పదార్థాలను తగ్గించడం, కెలరీలు ఉండే ఆహారాన్ని తగ్గించడం చేయాలి. ఎంత రుచి కరంగా ఉన్నా, అనారోగ్యకరమైన ఆహారాన్ని దూరంగా ఉంచాలి. ఒకేసారి ఎక్కువగా తినకుండా రెండు గంటలకోసారి కాస్త కాస్తగా తినే విధంగా డైట్ ప్లాన్ చేసుకుంటే, సరైన ఆహారాన్ని సరైన విధంగా తీసుకోవచ్చు. అన్నిటి కంటే ముఖ్యంగా సమయానికి అహారం తీసుకోవడం చాలా అవసరం.

బరువు తగ్గాలనుకునేవారు కేవలం జిమ్ కు వెళ్లి కసరత్తులకే పరిమితం కాకుండా యోగా, డాన్స్, వాకింగ్ కూడా చేస్తుండాలి. అంతేకానీ బరువు తగ్గడానికి అధికంగా వ్యాయామాలు చేయడమో లేక కేవలం డైటింగ్ ఒక్కటే అదే పనిగా చేయకూడదు. అలా చేయడం వల్ల బరువు తగ్గడం ఏమోగానీ అనారోగ్యాలకు గురౌవుతారు. బరువు తగ్గడానికి అందరికీ ఒకే రకమైన డైట్, పద్ధతులు సూచించరు వైద్యులు. ముఖ్యంగా అన్నం మానేయండని అధిక బరువు ఉన్న ప్రతి ఒక్కరికీ చెప్పరు. బరువు తగ్గడానికి వైద్యుల సలహా మేరకు తగిన వ్యాయామం చేయాలి. క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని సంతరించుకోవాలి. సరైన ఆహారం, సరైన సమాయానికి తీసుకోవాలి. ప్రతి రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి అప్పుడె బరువు తగ్గడానికి సాధ్యపడుతుంది.

ఆహార నియంత్రణ ద్వారా మాత్రమే బరువు తగ్గవచ్చు అని అనుకుంటే పొరబడినట్లే. ఆహార నియంత్రణ పాటించడం వల్ల బరువు తగ్గుతారు. ఎప్పుడైతే ఆహార నియంత్రణ ఆపేస్తారో, ఇక అప్పటి నుండి విపరీతంగా బరువు పెరుగుతారు.కాబట్టి .. వ్యాయామాలు మరియు ఆరోగ్యకర ఆహర ప్రణాళిక జీవనశైలిలో ఒక భాగం మరియు ఆరోగ్యకరమైన బరువు నిర్వహణకు మార్గం అని చెప్పవచ్చు.

Leave a Comment