Diabetes : మధుమేహానికి సహజమైన ఔషధం కాకరకాయ

By manavaradhi.com

Published on:

Follow Us

కాకరకాయను బిట్టర్ మిలాన్ గా కూడా వ్యవహరిస్తారు , మరియు అనేక రకాల రోగాలకు విరుగుడుగా కూడా దీనిని వినియోగిస్తారు. మధుమేహానికి సహజమైన ఔషధం కాకరకాయ. ప్రతి రోజు కాకరకాయను ఆహారంలో భాగం చుసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. మరియు బరువు పెరుగుట, అధిక కొలెస్ట్రాల్ వంటి మధుమేహ సంబంధిత ఆరోగ్య సమస్యలను సైతం తగ్గిస్తుంది. షుగర్ వ్యాధి ఉన్నవారు కాకరకాయను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు.

నేటి ఆధునిక జీవనశైలిలో మధుమేహం ఉన్న వారి సంఖ్య రోజు రోజుకీ గణనీయంగా పెరుగుతున్నది. మధుమేహం గతి తప్పిన ఆహారపు అలవాట్లు, కనుమరుగైన శారీరక శ్రమ, శృతి మించిన ఒత్తిళ్లు, ఆందోళనల వల్ల ఈ తీపి జబ్బు మనపై పంజా విసురుతోంది. ఏమాత్రం అజాగ్రత్త వహించినా ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే అవకాశాలున్నాయి. మనం జీవించడానికి, జీవక్రియలు సక్రమంగా జరగడానికి కావలసిన శక్తి ఆహారం ద్వారా లభిస్తుంది. అందుకే మనం తీసుకునే ఆహారం విషయంలో సరైన నియమాలు పాటించకపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనది మధుమేహం.

ఏటా లక్షలాది మంది ఈ వ్యాధిబారిన పడుతున్నారు. అందువల్ల చాపకింద నీరులా మనల్ని వెంటాడుతున్న ఈ డయాబెటిస్ ముప్పు నుంచి బయటపడాలంటే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మధుమేహాన్ని నియంత్రిచడంలో కాకరకాయ చాలా చక్కగా పని చేస్తుంది అంటున్నారు వైద్యనిపుణులు.

కాకరకాయలో ఐరన్ , మెగ్నీషియం, పొటాషియం, మరియు విటమిన్ సి వంటి పోషకాలు అధికంగా ఉంటాయి . కాకరకాయల్లో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి. ఆహార ప్రణాళికలో ఫైబర్ యొక్క అద్భుతమైన వనరుగా కూడా ఉంటుంది. మధుమేహానికి కాకరకాయ ఎలా సహాయం చేస్తుంది అంటే… కాకరకాయలో డయాబెటిక్ వ్యతిరేక లక్షణాలతో పనిచేసే చురుకైన పదార్ధాలు ఉన్నాయి. ఇవి రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తాయి.

కాకరకాయల్లో ఉండే క్యారంటిన్ అనే పదార్థం బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్‌ను కంట్రోల్ చేస్తుంది. దీంతోపాటు కాకరకాయలో ఉండే పాలీపప్టైడ్-పి అనే పదార్థం ఇన్సులిన్‌లా పనిచేస్తుంది. ఈ పదార్ధాలు డయాబెటిక్ రోగులలో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించటానికి సహాయం చేస్తాయి. ముఖ్యంగా టైప్ 2 మధుమేహ వ్యాధిగ్రస్తులకు చక్కటి ఔషదంగా పని చేస్తుంది. దీని ద్వారా కూడా షుగర్ స్థాయిలు తగ్గుతాయి. కనుక మధుమేహం ఉన్నవారు రోజూ ఉదయాన్నే పరగడుపున కాకరకాయ జ్యూస్ తాగితే మంచిది. మధుమేహం నియంత్రణలో ఉంటుంది.

డయాబెటిక్ రోగులలో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించటానికి సహాయం చేస్తాయి, ముఖ్యంగా టైప్ 2 మధుమేహ వ్యాధిగ్రస్తులకు చక్కటి ఔషదంగా పని చేస్తుంది.రోజు వారీ కూరగాయగానే చూసే కాకరలో షుగర్‌ నిలువల్ని అదుపుచేసే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇటీవలి ఒక అధ్యయనంలో రోజూ అరకప్పు కాకర రసంతాగిన 73 శాతం మందిలో షుగర్‌ నిలువలు ఘననీయంగా తగ్గినట్లు బయటపడింది. మరో అధ్యయనంలో రోజూ 15 గ్రాముల కాకర పొడి తీసుకున్న వారిలో షుగర్‌ నిలువలు 25 శాతం తగ్గినట్లు బయటపడింది.

మధుమేహ బాధితులు కచ్చితంగా వైద్యుల సూచన మేరకు మందులు వాడడంతోపాటు, నిత్యం వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం తప్పనిసరి. రక్తంలో గ్లూకోజు తీరుతెన్నులు ఎలా ఉంటున్నాయన్న విషయాన్ని తరచూ పరీక్షల సాయంతో తెలుసుకుంటూ ఉండాలి.అంతేకాదు బరువును తగ్గించడం ద్వారా కూడా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. ఆహార విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

కాకరకాయరసాన్ని అధికoగా సేవించడం మూలంగా కడుపు నొప్పి మరియు అతిసారం కలిగే అవకాశాలు ఉన్నాయి. కావున పరిమితిలోనే రసం తాగాలి. గర్భిణీ స్త్రీలు అధికంగా కాకరకాయ రసాన్ని తీసుకోవడాన్ని నివారించాలి, ఎందుకంటే ఇది గర్భాశయాన్ని ప్రేరేపించి, డెలివరీ డేట్ ను ముందుకు నడిపే సూచనలు ఉన్నాయి . ఏదైనా మితంగా తీసుకుంటే అమృతం, అతిగా తీసుకుంటే విషం అన్న విషయాన్ని మాత్రం మరవవద్దు.

మధుమేహం నియంత్రణలో ఉండడం అన్నది ఆహారంపైనే ఆధారపడి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతుంటారు. తీసుకునే ఆహారంలో ఉండే కాంపోనెంట్లు రక్తంలో చక్కెరలు పెరగడం, తరగడాన్ని నిర్దేశిస్తాయి. అందుకే మధుమేహం బారిన పడిన వారు మందుల కంటే ముందు ఏ తరహా ఆహారం తీసుకోవాలి, దేన్ని తీసుకోరాదన్న అవగాహన పెంచుకోవాలి. అప్పుడే ఈ చక్కెర వ్యాధి అదుపులో ఉంటుంది.

Leave a Comment