Sweet Potato Health Benefits : చిలగడ దుంపలు తింటే ఈ సమస్య దూరమవుతుందట..

By manavaradhi.com

Published on:

Follow Us
Health Benefits of Sweet Potatoes

చిలగడ దుంపలను చాలామంది పెద్దగా పట్టించుకోరు కానీ వీటిల్లో పోషకాలు దండిగా ఉంటాయి. ఇందులో పీచూ, పొటాషియం ఎక్కువ మొత్తంలో ఉంటాయి. పిండిపదార్థాలు కూడా ఎక్కువగా ఉంటాయి. పైగా ఇది రుచికి తియ్యగా ఉంటుంది. కాబట్టి ఉడికించుకుని నేరుగా తీసుకోవచ్చు. వారానికి కనీసం రెండు సార్లయినా వీటిని తినటం మేలని పోష‌కాహార‌ నిపుణులు సూచిస్తున్నారు.

చిలగడదుంపలు బీటా-కెరోటిన్, విటమిన్ E, C, B-6, పొటాషియం, ఐరన్ తో నిండి ఉంటాయి. మామూలు దుంపల కంటే వీటిలో ఉండే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే ఇందులో ఉండే గ్లైకేమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల అది మధుమేహులకు ఎంతగానో తోడ్పడుతుంది. చిలగడ దుంపల్లో శక్తివంతమైన యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గల యాన్తోసయానిన్ ని కలిగి ఉంది. ఇది అవయవాల లో ఇన్ఫ్లమేషన్ ను తగ్గించి, దానివల్ల వచ్చే ప్రమాదాన్ని నివారిస్తుంది. ఇందులో ఉండే ఫైబ్రినోజేన్ కూడా రక్త గడ్డకట్ట కుండా సహాయపడుతుంది.

  • మధుమేహం కలవారికి చిలగడ దుంపలు ఒక వరం లాంటివి, ఇవి అధిక బ్లడ్ షుగర్ విరుగుడుకు కారణం కావు. కాబట్టి మధుమాహం కలవారు మామూలు దుంపలు తీసుకోవడానికి బదులుగా ఈ చిలగడ దుంపలకు తీసుకోవడం మంచిది.
  • ఇందులో అధికంగా ఉండే కెరోటినాయిడ్స్, బీటా-కెరోటిన్, శరీరంలో విటమిన్ A ని తయారుచేయడానికి సహాయపడతాయి. ఇది కంటిచూపును మెరుగుపరిచి, మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది శక్తివంతమైన యాంటీ-ఆక్సిడెంట్ గా కూడా పనిచేసి మన శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ని తగ్గించి, తద్వారా వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది.
  • చిలగడ దుంపల్లో ఉండే అధిక స్థాయి పొటాషియం హార్ట్ బీట్ ను క్రమబద్ధీకరించడానికి సహాయపడుతుంది. ఇవి మన శరీరంలోని కండరాలు, నరాల పనితీరును కూడా మెరుగుపరుస్తాయి. ఇవి అలసట నుండి కండరాలకు ఉపశమనాన్ని కలిగించడానికి సహాయపడి, ఏదైనా దెబ్బ నుండి త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే మెగ్నీషియం ఆరోగ్యకరమైన ధమనులకు, గుండె కండరాలకు చాలా మంచిది.

చిలగడదుంపల్లోని పిండిపదార్థాలు శరీరానికి పోషకాలను అందించడమే కాకుండా ఆరోగ్యానికి మేలు చేకూర్చుతుంది. వీటిలో ల‌భించే పొటాషియం హృదయ స్పందనలు, నరాల సంకేతాలను నియంత్రిస్తుంది. మూత్రపిండాల వ్యాధులు, వాపులు, కండరాల తిమ్మిర్ల నుంచి పొటాషియం ఉపశమనం కలిగిస్తుంది.

చిలగడదుంపలో విటమిన్‌ బీ6 ఎక్కువ‌గా ఉండి రక్తనాళాలు బలంగా ఉండేందుకు తోడ్పడే హోమోసిస్టీన్‌ను విడగొడుతుంది. ఫ‌లితంగా గుండె, రక్తనాళాల సమస్యలు దూరంగా ఉంటాయి. విటమిన్ D అధికంగా ఉండడం వల్ల చిలగడ దుంపలు ఆరోగ్యకరమైన, బలమైన ఎముకలను కూడా ప్రోత్సహిస్తాయి.

మన శరీరానికి విటమిన్ D అవసరం, ఇది ఆహరం నుండి అందే క్యాల్షియంని సమీకరిస్తుంది. చిలగడ దుంపలు మనశరీరానికి అవసరమైన మినరల్ ఐరన్ ని అధికంగా కలిగి ఉంటాయి. ఇవి కణాల సామర్ధ్యాన్ని పెంచి మన శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజెన్ ని సరఫరా చేస్తాయి. మన రోగనిరోధక వ్యవస్ధకు కు ముఖ్యభాగమైన తెల్ల రక్త కణాల ఉత్పత్తి లో కూడా సహాయపడతాయి.

సాధారణంగా చాలా రకాల దుంపలను డయాబెటిస్‌ రోగులు తీసుకోకూడదంటుంటారు. అయితే గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉండటం వల్ల చిలగడదుంపలను డయాబెటిస్‌ ఉన్నవారూ పరిమితంగా తీసుకోవచ్చని న్యూట్రిషన్‌ నిపుణులు స‌ల‌హా ఇస్తున్నారు. కాబట్టి మధుమేహాంతో భాదపడుతున్నవారు సైతం చిలగడదుంపలను ఆహారంలో భాగం చేసుకోవాచ్చు.

Leave a Comment