HEALTH TIPS : ఫ్రిజ్ లో ఆహార పదార్థాలు … ఏ ఆహారాన్ని ఎంత కాలం లోపు తినాలి.

By manavaradhi.com

Published on:

Follow Us

మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది కదా అని ఎడాపెడా.. దొరికిన పదార్థాలన్నీ అందులో తోసేస్తున్నారా.. ఏ వస్తువు తీసుకొచ్చినా.. ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే.. ఫ్రెష్ గా ఉంటుందని భావించడం చాలా తప్పు. ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన వస్తువులు ఫ్రిడ్జ్ లో పెట్టాలి. మరికొన్ని ఆహార పదార్థాలు ఏ మాత్రం ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. ఎందుకంటే.. వాటివల్ల హానికలిగే అవకాశం ఉంది. ఫ్రిడ్జ్ లో ఆహారాలు, కూరగాయలు, పండ్లు పెట్టడం వల్ల తాజాగా ఉంటాయని అందరూ భావిస్తాం. ఏ మాత్రం ఫుడ్ మిగిలినా.. వెంటనే ఫ్రిడ్జ్ లో తోసేయడం అందరికి అలవాటు. అలాగే ఫ్రూట్స్, బ్రెడ్, వెజిటబుల్స్, సాస్, సరుకులు కూడా కొంతమంది పెట్టేస్తుంటారు. ఇంట్లో ఉండే ఆహార పదార్థాలన్నింటినీ ఫ్రిడ్జ్ లో చేర్చడం చాలామందికి అలవాటుగా మారిపోయింటుంది.అయితే కొన్ని ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల వాటి ఫ్లేవర్ మారిపోతాయి. న్యూట్రీషన్స్ తగ్గిపోతాయి. అలాగే అవి చెడిపోయే ప్రమాదం కూడా ఉంది. ఎలాంటి ఆహారాలు, ఆహార పదార్థాలు ఎంత కాలం నిల్వ ఉంటాయో తెలుసుకోవాలి.

పాల్లో లాక్టోబాసిల్లస్ అని పిలువబడు బ్యాక్టీరియా చాలా చురుకుగా మరియు బహువిధాలుగా త్వరగా ఆహారాలను పెరుగుగా మార్చేస్తుంది . ఈ కారణం చేతనే పాలుచాలా త్వరగా పాడవుతాయి. చాలా త్వరగా పాడయ్యే మరో ఆహారం బటర్ . మీరు కనుక బటర్ ను చల్లని వాతావరణంలో ఉంచకపోతే త్వరగా పాడైపోతుంది. త్వరగా పాడైయ్యే ఆహారాల్లో రోటీలు కూడా ఒకటి. రోటీలను తయారుచేసి వెంటనే హాట్ బాక్స్ లో వేయడానికి ముందే వాటిని చల్లారబెట్టి తర్వాత స్టోర్ చేయండి. సమ్మర్ ఫ్రూట్ గా పిలుచుకొనే పండు పుచ్చకాయ. నీటిశాతం ఎక్కువగా ఉండే ఈ పుచ్చకాయను సరిగా భద్రపరచుకోకపోతే త్వరగా పాడవుతుంది. ఉదయం అల్పాహారం దోసె మరియు ఇడ్లీలకు కాంబినేషన్ గా తయారుచేసుకొనే చట్నీలు త్వరగా పాడవుతాయి. వీటిలో కూడా కొబ్బరిని ఉపయోగించడం వల్ల త్వరగా పాడవుతాయి. కూరగాయల్లో నీటిశాతం ఎక్కువగా ఉన్నవి చాలానే ఉన్నాయి . వీని చల్లని వాతావరణంలో స్టోర్ చేసుకోవాలి. టమోటో, గార్డ్స్, గుమ్మడి వంటివి త్వరగా పాడవుతాయి. శరీరం చల్లగా ఉండాలంటే పెరుగును తప్పని సరిగా తీసుకోవాలి. అయితే పెరుగును సరిగా నిల్వచేయకపోతే త్వరగా పడావుతుంది. గుడ్లు ముద్రించిన తేదీ నుండి ఐదు వారాల వరకు నిల్వ ఉంటాయి. అయితే బాగా ఉడికించిన గుడ్లు ఎక్కువ కాలం నిల్వ ఉండవు. పౌల్ట్రీ చికెన్ ఫ్రిజ్ లో రెండు రోజులు మరియు ఫ్రీజింగ్చే దాదాపు ఒక సంవత్సరం నిల్వ ఉంటుంది. సముద్ర ఆహారం తాజా చేపలను రెండు రోజుల్లో వాడుకోవాలి. రొయ్యలు ఫ్రిజ్లో ఐదు రోజులు మరియు ఫ్రీజింగ్ అయితే మూడు నెలల వరకు ఉపయోగించవచ్చు. పండ్లు సిట్రస్ పండ్లు మరియు ఆపిల్ వంటి వాటిని సరిగ్గా శీతలీకరించిన చేస్తే రెండు వారాలు మరియు మొత్తం నెల వరకు నిల్వ ఉంటాయి. బెర్రీలు మరియు చెర్రీస్ తియ్యగా మరియు బలహీనమైన ఉన్నప్పుడు మూడు రోజుల పాటు ఉంటాయి.

మనం నిత్యం అనేక రకాల ఆహారాలను తింటూ ఉంటాం. అయితే వాటిలో చాలా వరకు పదార్థాలకు ఎక్స్‌పైరీ తేదీ ఉంటుంది. కొన్ని ఆహారాలకు మాత్రం గడువు తేదీ ఉండదు. వాటిని ఎన్ని రోజుల పాటైనా అలాగే నిల్వ ఉంచితే పాడవ్వవు.పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకునేందుకు చాలా మంది తేనెను రోజూ వివిధ రకాలుగా తీసుకుంటారు. అయితే తేనెకు మాత్రం ఎక్స్‌పైరీ ఉండదు. దీన్ని ఎన్ని రోజుల పాటు అయినా వాడవచ్చు. కానీ ప్యాక్ చేసిన తేనె అలా ఉండదు. స్వచ్ఛమైన, సహజ సిద్ధమైన తేనెను అప్పటికప్పుడు సేకరించి నిల్వ చేస్తే ఎన్ని నెలలు, సంవత్సరాలు అయినా అది అలాగే ఉంటుంది. ముడి బియ్యం కొన్ని రోజుల పాటు మాత్రమే నిల్వ ఉంటుంది. కానీ పాలిష్ చేసిన తెల్ల బియ్యం అలా కాదు. ఎన్ని రోజుల పాటు అయినా నిల్వ ఉంటుంది. కాకపోతే ఆ బియ్యాన్ని గాలి చొరబడని పాత్రలు, సంచుల్లో ఉంచాల్సి ఉంటుంది. ఉప్పు కూడా ఎన్ని సంవత్సరాల పాటు అయినా నిల్వ ఉంటుంది. చక్కెరలో బాక్టీరియా పెరగదు. కనుక దాన్ని ఎంత కాలం ఉంచినా పాడవ్వదు. అయితే వాతావరణంలో ఉన్న తేమ‌ తగిలితే చక్కెర గట్టి పడుతుంది. అన్ని రకాల పప్పు దినుసులు, సోయా, బీన్స్ జాతులకు చెందిన గింజలు కూడా ఎన్ని రోజులైనా పాడవ్వవు. వాటిల్లో పోషకాలు అలాగే ఉంటాయి. వీటిని ఎన్ని రోజుల పాటు అయినా నిల్వ చేయవచ్చు. అయితే పురుగులు పట్టకుండా చూసుకోవాల్సి ఉంటుంది. బయటకానీ, ఇంట్లో కానీ మనం తీసుకొనే ఆహారం భాగోలేకపోతే అది మన ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఆహారాలను ఎక్కువ నిల్వ చేయకుండా మరియు అప్పటికప్పుడు ఖాలీ చేయడం లేదా వాటిని తినకుండా నివారించడం ఉత్తమం.

Leave a Comment