Tomato: టమాటా వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

By manavaradhi.com

Published on:

Follow Us

ట‌మాట‌.. వంట‌ల రారాజు.. ఎలా వండినా.. దేనితో క‌లిపి వండినా.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. అందించే ఏకైక కూర‌గాయ‌. రుచిగా ఉంటుంద‌ని మ‌నం ట‌మాట‌ల‌ను విరివిగా వాడుతుంటాం. అయితే వీటిలో ఎన్నో ఆరోగ్య ర‌హస్యాలు దాగివున్నాయి. ఇవి రుచికే కాకుండా అందానికి, ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి.

కూరగాయల్లో టమాట స్థానం ప్రత్యేకం. టొమాటో మనందరికి అత్యంత పరిచయం అయిన వంటింటి వస్తువు. వంటలకి అద్భుత రుచిని అందిస్తుంది. అంతే కాదు, ఆరోగ్యానికి కూడా పలు విధాలుగా సహాయపడుతుంది. అందుకే ప్రతి ఒక్కరి వంటగదిలోనూ తప్పని సరిగా నిల్వ ఉంటుంది. మిగతా కూరగాయల మాదిరి టొమాటో లను ఎక్కువ కాలం నిల్వ చేయలేం. ఎన్నో ఔష‌ధ‌గుణాలున్న టొమాటోను తిన‌డం ఎసిడిటీతో బాధపడేవారికి, మధుమేహ రోగులకు, హృద్రోగులకు, కంటి జబ్బులకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. వీటిలో విట‌మిన్ ఏ, సీతో పాటు మేగ్నీషియం, ఫాస్పరస్, కాపర్‌లు కూడా ఉన్నాయి.

టొమాటోలలో బేటా కెరోటిన్ వుండి రక్తంలో వుండే మలినాలను తొలగిస్తాయి. వీటిలో లైకోపెన్ అనే యాంటీ ఆక్సిడెంట్ మనలోని కణాలు దెబ్బతినకుండా చేస్తుంది. టొమాటోల‌ను ఆహారంగా తీసుకోవ‌డం ద్వారా చెడు కొల్రెస్టాల్ ను తగ్గించుకోవచ్చు. వీటిని తరచూ తీసుకోవడం ద్వార గుండెపోటు వ్యాధులకు దూరంగా వుండొచ్చు. ఎన్నో ప్రత్యేక పోషకాలున్న టమాట కొన్ని రకాల క్యాన్సర్ల బారి నుంచి శరీరాన్ని కాపాడుతుంది. ముఖ్యంగా ప్రోస్టేట్, నోటి క్యాన్సర్లను నియంత్రిచగలదు. టమాటాలో విటమిన్ ఏ వుండటం చేత కంటి చూపు మెరుగుపడుతుంది. త్వరగా నైట్ బ్లైండ్ నెస్ లేదా రేచీకటి రాకుండా చేస్తుంది. అలాగే జుట్టును ఒత్తుగా, మెరిసేలా చేస్తుంది. వీటిలోని విట‌మిన్ కే .. పళ్ళకు, ఎముకలకు కూడా మంచి పోషణనిస్తుంది.

టొమాటోల్లోని అసిడిక్ యాసిడ్ చర్మం యొక్క పీహెచ్ స్థాయిలను బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే చర్మంలోని అదనపు నూనెను నివారిస్తుంది. టొమాటో జ్యూస్ వాడ‌టం వ‌ల్ల చ‌ర్మ‌రంధ్రాలు కుచించుకుపోవ‌డంలో, మొటిమ‌ల్ని త‌గ్గించ‌డంలో, స‌న్ టాన్‌ను నివారించ‌డంలో ఎంతో ఉప‌యోగ‌ప‌డుతాయి. వీటిలోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు శరీరంలో ఫ్రీరాడికల్స్ ను తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతాయి. టమోటలో విటమిన్ ఏ, సీతోపాటు అన్ని రెడ్ ఫ్రూట్స్ లోలాగే ఈ రెడ్ కలర్ టొమాటోలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ కారణం చేతనే ఈ టమోటోను బ్యూటీ ట్రీట్మెంట్స్ లో విరివిగా ఉపయోగిస్తుంటారు. మ‌నం ఎప్పుడూ యంగ్‌గా ఉంచ‌డంలో ఎంతో ఉప‌యోగ‌క‌రం.

అందానికి ఉపయోగపడే వస్తువుల్లో మనకు లభించే నేచురల్ బ్యూటీ ప్రొడక్ట్స్ లో టమోటో కూడా నేచురల్ గా అందుబాటులో ఉంటుంది. కాబట్టి, మీ బ్యూటీ కోసం టమోటోలను ఉపయోగించండి. నిత్యం వినియోగిస్తూ అందంగా ఉండ‌ట‌మే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉండండి.

Leave a Comment