Cauliflower: క్యాలీఫ్లవర్ లో వల్ల కలిగే అమోఘమైన ఆరోగ్య ప్రయోజనాలు

By manavaradhi.com

Published on:

Follow Us
cauliflower health benefits

క్యాలీఫ్లవర్లో ఆరోగ్యాన్ని పెంచే ఎన్నో గుణాలున్నాయి. ఇందులో విటమిన్ బి సమృద్ధిగా లభిస్తుంది. పోషకాలు ఎక్కువ గానూ, క్యాలరీలు తక్కువగానూ గోబీలో ఉంటాయి. అలాగే ఇందులో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లూ, క్యాన్సర్‌ నుంచి రక్షించే ఫైటో న్యూట్రియంట్లూ కూడా ఎక్కువగా ఉంటాయి. చక్కటి పూవు ఆకారంలో ఉండే క్యాలీఫ్లవర్ లో చాలానే ఆరోగ్య ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి.

క్యాలీఫ్లవర్ లో పీచుతోపాటు నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ రెండూ జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచేలా చేయడంలో సహాయపడతాయి. ఊబకాయం, మధుమేహం, హృద్రోగాల బారిన పడకుండా రక్షించడంలో క్యాలీఫ్లవర్ తోడ్పడుతుంది. క్యాలీఫ్లవర్‌ లో పోషకాలు ఎక్కువగానూ, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి రెగ్యులర్ డైట్ లో క్యాలీఫ్లవర్ ను చేర్చుకోవడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

కూరల ద్వారా లేదా సలాడ్ ల రూపంలో వీటిని తీసుకుంటూ ఉంటే.. త్వరగా బరువు తగ్గవచ్చు. ఇందులోని విటమిన్ కె ఎముకల దృఢత్వానికీ దోహదపడుతుంది. కిడ్నీ సంబంధిత రోగాలకు క్యాలీఫ్లవర్ దివ్యౌషధంగా పని చేస్తుంది. క్యాలీఫ్లవర్‌లో విటమిన్ సి, పీచు అధికంగా ఉండటంతో కిడ్నీ వ్యాధులు దరిచేరవు.

చిన్నారుల్లో జ్ఞాపకశక్తిని పెంపొందించ‌డంలో సహాయపడుతుంది. కంటి చూపుని మెరుగుపరచడంలో చక్కని ఔషధంగా పనిచేస్తుంది. గుండె వ్యాధులు ఉన్నవారు నిర్భయంగా దీనిని తీసుకోవచ్చును. స్థూలకాయం, కొలెస్ట్రాల్ వంటి సమస్యలను నియంత్రిస్తుంది.

యూరినరీ ఇన్ఫెక్షన్ల నుంచి బయటపడటానికి క్యాలిఫ్లవర్ చక్కటి పరిష్కారం. యూరినరీ ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవాలంటే వారానికి రెండు లేదా మూడు సార్లు క్యాలీఫ్లవర్‌ను డైట్‌లో చేర్చుకోవాలి. శరీరంలోని మలినాలను యూరిన్ ద్వారా బయటకు పంపించడంలో క్యాలీఫ్లవర్‌ సహాయపడుతుంది. ఉడికించిన క్యాలీఫ్లవర్ ని వ్యాయామానికి ముందే లేదా తర్వాత తీసుకుంటే వ్యాయామం కారణంగా వచ్చే కండరాల నొప్పులు ఉండవు.

క్యాలీఫ్లవర్ తినటం వలన శరీరంలో వేడి తగ్గుతుంది. అజీర్ణం,మలబద్దకం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. క్యాలీఫ్లవర్ తినటం వలన జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా బలంగా పొడవుగా పెరుగుతుంది. ఒకవేళ కాలిఫ్లవర్‌ని నేరుగా తినలేకపోతే. గోబీమంచూరియా వంటివి తయారుచేసుకొని తినవచ్చు.

క్యాలీఫ్లవర్ ను పచ్చిగా తినకూడదు… ఉడికించి కూరలు లేదా సలాడ్స్ రూపంలో తీసుకోవడం ఉత్తమం. అలాగని హద్దుమీరి తినకూడదు. వైద్యులు సూచించిన పరిమితిలో తీసుకుంటే మంచిది.

Leave a Comment