Daily salt intake : మనం రోజుకు ఎంత ఉప్పు తినొచ్చు? ఎక్కువైతే ఏమవుతుంది?

By manavaradhi.com

Updated on:

Follow Us

మన ఆరోగ్యానికి అధిక ఉప్పు పెద్ద ముప్పుఅన్న విషయం తెలిసిందే. కానీ ఉప్పును పూర్తిగా మానెయ్యటం మంచిది కాదు. ఉప్పు కూడా మన శరీరానికి, జీవక్రియలకు అవసరమైన వనరు. ఆరోగ్యవంతులు రోజుకు కాస్త అటూ ఇటూగా 5 గ్రాముల ఉప్పు తీసుకోవటం మంచిది. చాలామంది మన శరీరానికి కావాల్సిన సోడియం అంతా కూడా కూరగాయలు, మన ఆహార పదార్థాల నుంచి సహజంగానే వచ్చేస్తుందనీ, ఇంక అదనంగా ఉప్పు వేయటం వల్ల దాని పరిమితి పెరిగిపోతుందని చెబుతుంటారు. కానీ నిజానికి ఆహారం కాకుండానే 5 గ్రాములు యాడెడ్‌ సాల్ట్‌ తీసుకోవాలన్నది శాస్త్రరంగం చేస్తున్న సిఫార్సు. కొన్ని రకాల జీవక్రియల్లో సోడియం క్లోరైడ్‌ చాలా అవసరం. ఒంట్లో నీరు, ఖనిజ లవణాల సమతుల్యత సజావుగా ఉండటానికి. మనం ‘డీహైడ్రేషన్‌’ లోకి వెళ్లకుండా ఇది చాలా కీలకం. అయితే ఉప్పు ఎక్కువెక్కువగా వాడమని కాదు. హైబీపీ ఉన్నవాళ్లు, కిడ్నీ జబ్బులున్న వాళ్లు ఉప్పు తగ్గించుకోవటం అసవరం. అంతేగానీ ఆరోగ్యవంతులు అసలు ఉప్పును పెద్ద శత్రువులా అభిప్రాయపడుతూ, అస్సలు ఉప్పు లేకుండా తినటం సరికాదు.

ఉప్పు నాడీ ప్రేరేపణ ప్రసారానికి తోడ్పడుతుంది. సరైన మోతాదులో శరీరంలో ద్రవాలు నిల్వ ఉంచడానికి సహకరిస్తుంది. కండరాలు సంకోచించడానికి, వ్యాకోచించడానికి సహాయపడుతుంది. ఉప్పులో ఉండే అయోడిన్‌ ఎదుగుదలకు తోడ్పడుతుంది. అయోడిన్‌ లోపం వల్ల థైరాయిడ్‌ సమస్యలు వస్తాయి. శరీరంలో సోడియం బాగా తగ్గితే ‘లో బ్లడ్‌ ప్రెజర్‌ ‘ కలుగుతుంది. ఇది రక్తప్రసరణను తగ్గిస్తుంది. సోడియం ఎక్కువైతే శరీరానికి హానికరం. పాల ఉత్పత్తులు, కూరగాయలు, చేపలు, రొయ్యలు, గుడ్లలో సహజసిద్ధంగా సోడియం ఉంటుంది. శరీరంలో ఎక్కువ సోడియం నిల్వ ఉంటే ద్రవాలు ఎక్కువైతాయి. రక్తనాళాలు సంకోచించినప్పుడు బిపి అధికమవుతుంది. ఉప్పుకు బుదులు రుచికలిగించేవి, సుగంధద్రవ్యాలు, నిమ్మరసం, వెనిగర్‌, మిరియాలపొడి, ఉల్లిపాయలు వాడాలి. పొటాషియం ఎక్కువుండే అరటిపళ్లను అధికంగా తీసుకోవాలి. ఇవి శరీరంలో సోడియం స్థాయిని సమతుల్యం చేస్తాయి. బియ్యంలో ఉప్పు ఎక్కువగా ఉంటుందని చాలా మంది అనుకుంటుంటారు. అది నిజం కాదు. బియ్యంలో సోడియం ఉంటుంది. కానీ చాలా తక్కువగా ఉంటుంది. దాంతో కలిగే నష్టమేమీ ఉండదు.

శరీరంలో ఉండే అదనపు ఉప్పును తొలగించుటకు పొటాషియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినాలి. ఇవి శరీరంలో ఎలక్ట్రోలైట్ మరియు ద్రావణాల స్థాయిలను నిర్వహిస్తాయి. గింజలలో, పొటాషియం స్థాయిలు అధికంగా ఉండటం వలన వీటిని పొటాషియపు మూలాధారంగా పేర్కొంటారు. అధిక మొత్తంలో పొటాషియంలను కలిగి ఉండి, శరీరంలో ఉండే అదనపు సోడియంలను శరీరం నుండి భయటకు పంపుతాయి. ఉప్పు అధికంగా గల ఆహార పదార్థాలను తినటం వలన పొట్ట ఉబ్బరంగా అనిపించి, నీరసానికి గురవుతారు. సోడియం శరీరంలో నీటిని నిల్వ చేసేలా ప్రోత్సహిస్తుంది, కావున ఆహారంలో సోడియం స్థాయిలను తగ్గించటం వలన పొట్ట సంబంధిత సమస్యలకు దూరంగా ఉండవచ్చు. ఒక గ్లాసు నారింజ పండు రసం పొటాషియం ఎక్కువగా కలిగి ఉండి, శరీరంలో ఉండే అదనపు సోడియం భయటకు పంపుతుంది. అరటిపండు వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అరటిపండు పొటాషియంను అధికంగా మరియు సోడియంను తక్కువ స్థాయిలో కలిగి ఉండి, శరీరంలో ఎలక్ట్రోలైట్ మరియు ద్రావణాలను ఆరోగ్యకర స్థాయిలో నిర్వహిస్తాయి. ఆరోగ్యాన్ని పెంపొందించే ఆహారాల్లో పాలకూర కూడా అని చెప్పవచ్చు. ఈ పచ్చని ఆకుకూరలలో అధికంగా పొటాషియంను కలిగి ఉండి మరియు సోడియం వలన కలిగే దుష్ప్రభావాలకు దూరంగా ఉంచుతుంది. డ్రై ఫ్రూట్స్ అధికంగా పోషకాలను కలిగి ఉండి, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని మనందరికీ తెలిసిందే. ఎండుద్రాక్ష, ఆప్రికాట్లు వంటి డ్రై ఫ్రూట్స్ పొటాషియంను కూడా అధిక మొత్తంలో కలిగి ఉంటాయి. ఒక పిడికెడు డ్రై ఫ్రూట్స్ లను తినటం వలన శరీరంలో ఉండే అదనపు సోడియం స్థాయిలు భయటకి పంపబడతాయి.

మన దైనందిన ఆహారంలో ఉప్పు 5 గ్రాములకు మించకపోవటం ఉత్తమమని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. గరిష్ఠంగా 6 గ్రాములు దాటితే నష్టం మొదలవుతుందని జాతీయ పోషకాహార సంస్థ హెచ్చరిస్తోంది. కాబట్టి ఉప్పు తక్కువగా తీసుకుంటూ.. తాజాపండ్లు, కూరగాయలు ఎక్కువగా తినటం ద్వారా మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకుందాం.

Leave a Comment