Fast Food Effects: ఇష్టమని ఫాస్ట్ ఫుడ్‌ని తెగ తినేస్తున్నారా..అయితే మీకోసమే ఒక సారి చదవండి..!

By manavaradhi.com

Published on:

Follow Us
Fast Food Effects

యాంత్రిక జీవనంలో తీరిక లేని పనులు, ఒత్తిడితో సతమతమవుతున్నారు. సమతుల పోషకాహారంపై దృష్టిసారించడం లేదు. ఆకలి అయిన‌ప్పుడు ఫాస్ట్ ఫుడ్‌తో కడుపు నింపుకొంటూ అనారోగ్యాలను ఆహ్వానిస్తున్నారు. నగరాలకు, పట్టణాల్లోనే ఉండే ఈ సంస్కృతి.. ఇప్పుడు పల్లెల్లోనూ విస్తరించింది. ఇంటి వద్ద లభించే ఆకు, కాయగూరలను పక్కన పడేసి ఫాస్ట్‌ఫుడ్స్ వైపు పరుగులు తీస్తున్నారు. నిత్యం ఒకే రకమైన ఆహార పదార్థాలు తినీతినీ విసుగుపుట్టి ఫాస్ట్‌ ఫుడ్స్‌పై కొంద‌రు మక్కువ చూపిస్తుంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఇలాంటి ఆహారం కోసం మారాం చేస్తుంటారు. ఫాస్ట్‌ ఫుడ్స్‌ తినేటప్పుడు బాగానే ఉంటాయి కానీ, వీటికి అలవాటు పడితే మాత్రం సాధారణ ఆహారం తీసుకొనేందుకు ఏమాత్రం ఇష్టం ఉండ‌ద‌నేది ప‌చ్చినిజం

ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ‌గా తిన‌డం వ‌ల్ల అనేక అనర్థాలు ఉన్నాయి. ముఖ్యంగా పేగు క్యాన్సర్ వ‌చ్చే అవకాశం ఎక్కువ‌గా ఉంటుంది.హైబీపీ సమస్యకు గురవుతారు. టైప్‌2 డయాబెటిస్ బారిన పడే ప్రమాదం ఉంది. ప్రధానంగా మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. గుండె పనీతీరు బాగా మందగిస్తుంది. ఒబేసిటీ బారిన పడే ప్రమాదం ఉంది.

ఫాస్ట్‌ఫుడ్స్ అయిన బర్గర్‌, పిజ్జా, వేపుడు ప‌దార్థాలు, కోలా పానీయాలు.. శరీరానికి ఎక్కువ కేలరీలు కొవ్వును అందించి ప్రమాదం తెచ్చిపెడుతున్నాయి. హామ్‌బర్గ్‌ర్‌లో 300 కేలరీలు, కొవ్వు 10 గ్రాములు వుంటుంది. మిరియం కలిపిన పిజ్జాలో 180 కేలరీలు, 7 గ్రాముల కొవ్వు వుంటుంది. 340 మిల్లీలీటర్ల కోకోకోలాలో 158 కేలరీలు, మేక్‌ డోనాల్డ్‌ సారాలో 210 కేలరీలు వుంటాయి. ఇది చాలా ప్రమాదకరం.

ఫాస్ట్ ఫుడ్ తయారు, ప్యాకింగ్ లలో థాలెట్స్‌ అనే రసాయనాలు ఉపయోగిస్తారని, అది మానవ హార్మోన్లను దెబ్బతీసి దీర్ఘకాలంలో అరోగ్య సమస్యలకు కారణం అవుతుందని ఎన్విరాన్‌మెంటల్‌ ఇంటర్నేషనల్‌ అనే జర్నల్‌లో ప్రచురించిన సర్వేలో వెల్లడించారు. అంతేగాక అదేపనిగా ఫాస్ట్‌ఫుడ్‌ తినే యువతలో హార్మోన్ల బ్యాలెన్స్‌ తప్పుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

నూనెలో వేయించే బజ్జీలు, మిర్చి, వడాలు, అలాగే ఎగ్‌ఫ్రైడ్‌ రైస్‌, చైనా ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో లభించే నూడుల్స్‌ వంటి వాటికి అలవాటు పడ‌టం మంచిది కాదు. వీటిలో వినియోగించే మసాలాలు, నూనె అనారోగ్యానికి గురి చేస్తాయని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు.

రంగు రుచీ బాగుండి మ‌న‌ల్ని ఇట్టే ఆక‌ర్శించే ఫాస్ట్‌ఫుడ్స్ త‌రుచూ తీసుకోవ‌డం వ‌లన కావాల్సిన దానిక‌న్నా ఎక్కువ కేల‌రీలు శ‌రీరానికి అంది కొవ్వు త‌యార‌య్యేందుకు దోహ‌ద‌ప‌డుతున్నందున వీటిని దూరంగా పెట్టాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని పోష‌కాహార నిపుణులు సెల‌విస్తున్నారు. సో.. ఫాస్ట్‌ఫుడ్స్ దూరంగా పెట్టండి.. ఆరోగ్యంగా జీవించండి.

Leave a Comment