రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు కంటి సమస్యలను దూరం చేయడానికి విటమిన్ ఎ సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యానికి, మొటిమల సమస్యను దూరం చేయడానికి కూడా తోడ్పడుతుంది. విటమిన్ ఎ లోపంతో బాధపడేవారిలో ఎముకలు బలహీనంగా మారుతాయి. అందువల్ల ఈ పోషకం శరీరానికి అందేలా చూసుకోవాలి. విటమిన్ ఎ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు మన చుట్టూ ఎన్నో ఉన్నాయి.
శరీరానికి అవసరమైన కొన్ని విటమిన్లు ఉన్నాయి. వాటి స్థాయిలు తక్కువగా ఉన్నప్పటికీ, అవి తగినంత పరిమాణంలో అందుబాటులో లేనప్పటికీ శరీరంలో ఏ మార్పులు జరుగుతున్నాయో చాలా మందికి తెలియదు. శరీరం తన రోజువారీ కార్యకలాపాలను నమ్మశక్యంగా నిర్వహించడానికి అన్ని విటమిన్లు అవసరం. ముఖ్యంగా మంచి కంటి చూపు, ఆరోగ్యకరమైన చర్మానికి విటమిన్ ఎ అవసరం. కానీ శరీరంలో ఇది తక్కువగా ఉన్నప్పుడు తరచూ వివిధ ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా పని చేయటానికి విటమిన్ ఎ తోడ్పడుతుంది.
గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, ఇతర అవయవాలు సరిగా పనిచేసేలా చూస్తుంది. నిజానికి ఇది చేసే పని కణాలను వృద్ధి చేయటం. కొవ్వులో కరిగే విటమిన్ల తరగతికి చెందిన ఇది రోగనిరోధక వ్యవస్థలో భాగమైన టి కణాలు, బి కణాలు, సైటోకైన్లు, తెల్ల రక్తకణాల పనితీరును మెరుగు పరుస్తుంది. ఇలా వైరల్ ఇన్‌ఫెక్షన్లు, జలుబు, ఫ్లూ వంటి వాటి నుంచి కాపాడుతుంది. అంతేకాదు, చర్మ కణాలు దెబ్బతినకుండా కాపాడుతూ అసలు బ్యాక్టీరియా వంటి క్రిములు లోపలికి ప్రవేశించడాన్నే నిరోధిస్తుంది. యాంటీఆక్సిడెంట్లలో విటమిన్ ఎ కూడా ముఖ్యమైనదే.
విటమిన్ ఎ, బీటా కెరోటిన్ వంటి పోషకాలకు క్యారెట్లు ప్రధాన వనరులని చెప్పుకోవచ్చు. శరీరం విటమిన్ ఎ ను శోషించుకోవడానికి బీటా కెరోటిన్ అవసరం. పాలకూరను సూపర్ ఫుడ్ అంటారు. దీంట్లో కెరోటినాయిడ్లు ఎక్కువగా ఉంటాయి. వీటి నుంచి ఫోలేట్, ఐరన్, విటమిన్ సి వంటి ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి. ఈ ఆకుకూరతో పాటు లవంగాలు, ఉల్లిపాయ, మొలకలు, బ్రౌన్ రైస్, జీలకర్ర వంటివి క్రమం తప్పకుండా తీసుకుంటే విటమిన్ ఎ శరీరానికి అందుతుంది.
బొప్పాయి సలాడ్ ద్వారా తగినంత విటమిన్ ఎ శరీరానికి అందుతుంది. బొప్పాయిని నేరుగా తినడానికి ఇష్టపడని వారు సలాడ్ రూపంతో ఇతర పండ్లతో కలిపి తీసుకోవచ్చు. ఈ సలాడ్‌ను సులభంగా తయారు చేసుకోవచ్చు. చిలగడ దుంప నుంచి విటమిన్ ఎ, ఇతర పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. దీన్ని నేరుగా తినడానికి చాలామంది ఇష్టపడరు. దీన్ని ఉపయోగించి చాట్ తయారు చేసుకొని తీసుకోవచ్చు. ఈ దుంపలో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తాయి. బ్రకోలీ లో కూడా మన శరీరానికి అవసరమైనంత విటమిన్ ఎ మనకు లభిస్తుంది. అందువల్ల దీన్ని క్రమం తప్పకుండా మనం తీసుకోనే ఆహారంలో చేర్చుకోవాలి.
చిన్న పిల్లల నుండి వృధ్యాప్యం వయస్సు కలిగిన వారి వరకు విటమిన్-ఎ చాలా అవసర పడుతుంది. విటమిన్ ఎ ముఖ్యంగా కంటి చూపు మెరుగు పరచడానికి తీసుకోవాల్సి ఉంటుంది. విటమిన్ ఎ ముఖ్యంగా తల్లి పాలు, మామిడి పండ్లు, బొప్పాయి, క్యారెట్, వెన్న, గుడ్డు సొన వంటి ఆహార పదార్థాల్లో పుష్కలంగా లభిస్తుంది. అంతేకాకుండా క్యారెట్,ఆకుకూరలలో, విటమిన్ ఎ బేటా కెరోటిన్ రూపంలో లభిస్తుంది. ఆకుకూరలు మనం తీసుకున్న తర్వాత కాలేయం,పేగులు లో అది విటమిన్ ఎ గా మార్పు చెందుతుంది.
మన శరీర నిర్మాణానికి ముఖ్య కారణమైన కణజాలాలు ఉత్తేజంగా ఉండడానికి, పెరుగుదలకు విటమిన్ ఎ ఉపయోగపడుతుంది. కంటి నేత్ర పటలంలో రోడాప్సిస్ పునః సంశ్లేషణ కు ఇది అత్యవసరం. ఇక చర్మ కణాలు నిగనిగలాడడానికి, జుట్టు మృదువుగా ఉండేటట్టు చేసేందుకు విటమిన్ ఎ ఉపయోగపడుతుంది. రోజువారీ తీసుకునే ఆహారంలో విటమిన్ A 750 మి.గ్రా. పరిమాణంలో ఉండేలా చూసుకోవాలి. దీని లోపం వల్ల రేచీకటే కాకుండా వర్ణాంధత్వం కూడా సంభవిస్తుంది. మానవ శరీరం 6 నెలల పాటు విటమిన్ Aను నిల్వ ఉంచుకోగలదు.జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) ప్రతి 6 నెలలకు ఒకసారి పాఠశాల పిల్లలకు విటమిన్ Aను అందించడం ద్వారా అంధత్వాన్ని నివారించవచ్చని సిఫార్సు చేసింది.
పోషకవిలువలు సమృద్ధిగా ఉండే విటమిన్ ఎ… వ్యాధులను దరిచేరనివ్వదు. కణాల అభివృద్ధి, వ్యాధినిరోధక శక్తిని పెంచే గుణం దీనికి ఉంటుంది. కంటిచూపు మందగించకుండా చూస్తుంది. విటమిన్-ఎ ఆరోగ్యకరమైన పద్దతిలో పొందాలనుకుంటే, తాజా క్యారెట్ తోపాటు ఆకుకూరలను పుష్కలంగా తీసుకోవాలి.