Healthy Breakfast : బ్రేక్ ఫాస్ట్ మంచి ఆరోగ్యానికి నాంది

By manavaradhi.com

Published on:

Follow Us
Healthy Breakfast Foods

రోజూ ఉదయం అల్పాహారం తీసుకొనే అలవాటు ప్రతి ఒక్కరికీ ఉండాలి. పోషకాహార నిపుణులు కూడా ఉదయం తప్పనిసరిగా అల్పాహారం తీసుకోమని సలహాలిస్తుంటారు. అది రోజంతా మనకు కావల్సిన శక్తిని అందిస్తుంది. ఉదయం తీసుకొనే ఆహారంతోనే శరీరానికి అవసరమయ్యే పోషకాలు, న్యూట్రీషియంట్స్, ప్రోటీన్లు అందుతాయని చెబుతుంటారు. బిజీ బిజీ జీవనశైలితో ఉండటం వల్ల చాలా మంది ఏదో ఒకటి కడుపులోకి తోసేస్తే చాలు అనుకుంటారు. అనారోగ్యకరమైన ఆహారాలను వారికి తెలియకుండానే తీసుకుంటున్నారు. సమయం లేదని ఏది త్వరగా, సులభంగా తయారవుతుందో వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనివల్ల అనేక ఇబ్బందులు తప్పవు.

ఉదయం నిద్ర లేవగానే రక్తంలో షుగర్‌ లెవెల్స్‌ తక్కువ స్థాయిలో ఉంటాయి. వీటిని క్రమబద్ధీకరించడానికి బ్రేక్‌ఫాస్ట్‌ చాలా ముఖ్యం. మెటబాలిజం తిరిగి గాడిలో పడటానికి అల్పాహారం శరీరానికి ఇంధనంలా పని చేస్తుంది. ఉదయాన్నే నీరసంగా ఉన్నట్లు ఫీలయితే వర్క్‌పైన ఫోకస్‌ తగ్గుతుంది.

పనిపైన తగిన శ్రద్ధ పెట్టాలంటే అల్పహారం తీసుకోవాల్సిందే. అంతే కాదు హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌ బరువు నియంత్రణకు ఉపయోగపడుతుంది. ఎక్కువసేపు పొట్ట నిండి ఉన్న ఫీలింగ్‌ని అందిస్తుంది. స్నాక్స్‌ వంటి వాటి జోలికిపోకుండా చేస్తుంది. అందుకే ప్రోటీన్ అధికంగా లభించే బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకోవడం మరింత మంచిది. హెల్దీ బ్రేక్ ఫాస్ట్ కోసం గ్రీక్ యోగర్ట్, సబ్జ గింజలతో చేసిన పుడ్డింగ్, గుడ్లు, సాల్మన్ చేపలు, పన్నీరు లాంటి పదార్థాలు తీసుకోవాలి. గ్రీక్ యోగర్ట్ ద్వారా మనకు 23 గ్రాముల వరకు ప్రొటీన్ లభించే అవకాశం ఉంది. సబ్జ గింజలు ఉదయాన్నే 2 టేబుల్ స్పూన్లు తీసుకుంటే మనకు 5 నుంచి 10 గ్రాముల వరకు ప్రొటీన్ లు అందుతాయి.

సబ్జ గింజల్ని పాలు లేదా పండ్లతోపాటు కూడా తీసుకోవచ్చు. గుడ్లలోనూ మనకు ప్రొటీన్లు అధికంగా లభిస్తాయి. ఉదయాన్నే ఉడికించిన గుడ్లు తీసుకుంటే రోజంతా నిస్సత్తువ దరి చేరదు. ప్రొటీన్లు అధికంగా లభించే మరో ఆహారం సాల్మన్ చేపలు. ఒక్క సర్వింగ్ ద్వారా 16 గ్రాముల వరకు ప్రొటీన్లు అందుతాయి. ఉదయాన్నే శాండ్ విచ్ లో సాల్మన్ చేపలు తీసుకుంటే మంచిది.

హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకోవడం ద్వారా మంచి జీవనవిధానం అలవడుతుంది. ముఖ్యంగా పిల్లలకు పోషకాహారం పెట్టడం ద్వారా వారి జీవనవిదానం బాగుంటుంది. అల్పహారాన్ని తరచుగా వదిలేసే వారిలో టైప్‌ 2 డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది.

ఉదయం అల్పాహారం తీసుకుంటే రోజంతా ఉత్సాహంగా ఉంటారు. శక్తి అధికంగా లభిస్తుంది. ప్రొటీన్ ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల పొట్ట నిండిన ఫీలింగ్ కలుగుతుంది. దీంతో ఎక్కువగా తినాలనిపించదు. ఫలితంగా బరువు నియంత్రణలో ఉంటుంది. అందుకే ప్రోటీన్లు లభించే ఆహార పదార్థాలను బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

Leave a Comment