GREEN PEAS – పచ్చి బఠానీలు తినడం వల్ల ఈ ఆరోగ్య ప్రయోజనాలన్నీ పొందవచ్చు!

By manavaradhi.com

Published on:

Follow Us
GREEN PEAS

చలి కాలం వేళల్లో మనం తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. ఒక్కోసారి చల్లదనం కారణంగామనకు పెద్దగా తినాలనిపించదు. ఈ కాలంలో ఏ ఆహార పదార్థం తీసుకున్నా కాస్త వేడిగానే తీసుకోవాలి. కానీ ఇది అన్ని వేళలా సాధ్యం కాదు. చల్లగా ఉన్న పదార్థాలను ఎక్కువగా తీసుకోలేం. ఫలితంగా మన డైట్ లో చాలా మార్పులు వస్తాయి. దీంతో సమతుల ఆహారం లభించే అవకాశం తక్కువగా ఉంటుంది. అందుకే చలికాలంలో పచ్చి బఠానీ మనకు చాలా మేలు చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. పచ్చి బఠానీలో ఉంటే పోషకాలు .. మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

చలికాలంలో పచ్చి బఠానీ తింటే మంచిది. దీనికి ముఖ్యంగా ఐదు కారణాలున్నాయంటున్నారు పరిశోధకులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పచ్చి బఠానీ .. అనేది మార్కెట్లో చాలా తక్కువ ధరలో లభ్యమవుతుంది. ధరతో పోలిస్తే దీనిలో ఉన్న పోషకాలు వందల రెట్లు ఉన్నాయనే చెప్పాలి. ఎందుకంటే పచ్చి బఠానీ అనేది.. స్ట్రార్చ్ లాంటి పదార్థం. సంక్లిష్టమైన పిండి పదార్థం కిందకు వస్తుంది. దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. పీచు, ప్రోటీన్, విటమిన్ A, K అధికంగా ఉంటాయి.

పచ్చి బఠానీ.. కూరగాయల్లో భాగమని చాలా మంది అనుకుంటారు. కానీ .. పచ్చి బఠానీ అనేది.. చిరుధాన్యాలకు చెందిన పదార్థం. పీచు, ప్రోటీన్, విటమిన్ A, K లాంటి వాటితోపాటు మాంగనీస్, ఐరన్, ఫోలేట్, థయామిన్ కూడా పచ్చి బఠానీ నుంచి మనకు ఎక్కువగా లభిస్తాయి. పచ్చి బఠానీలో ఉండే హై ప్రోటీన్, లో కేలరీ వల్ల ఇది.. స్థూలకాయం తగ్గించుకోవాలనుకునే వారికి చక్కగా ఉపయోగపడుతుంది. కొంచెం తినగానే కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. జీర్ణక్రియ మెల్లగా అయ్యేలా చూస్తుంది. దీంతో త్వరగా ఆకలి వేయకుండా ఉంటుంది.

పచ్చి బఠానీలో మేగ్నీషియం, పొటాషిం,క్యాల్షియం లాంటి ఖనిజ లవణాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవి రక్తపోటు నియంత్రణలో ఉండేలా సహాయపడతాయి. రక్తపోటు నియంత్రణలో ఉండడం వల్ల మనకు హార్ట్ డిసీస్ లు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. పచ్చి బఠానీలో ఉండే పీచు పదార్థం కూడా చెడు కొలస్ట్రాల్ ను నియంత్రిస్తుంది. అంతే కాదు పచ్చి బఠానీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.


జీర్ణక్రియ సరిగ్గా జరగాలంటే పచ్చి బఠానీ బాగా ఉపయోగపడుతుందని తెలుసుకున్నాం కదా. ఇందులో ఉండే పీచు పదార్థాలు జీర్ణక్రియ వేగాన్ని నియంత్రిస్తాయి. అంతే కాకుండా పచ్చి బఠానీలో ఉండే మంచి బ్యాక్టీరియా ప్రేగులను ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి. ఫలితంగా మల విసర్జనలో ఇబ్బందులు తలెత్తే అవకాశం లేదు. ప్రేగులు సరిగ్గా ఉంటే విసర్జితాలు సాఫీగా బయటకు వెళ్లిపోతాయి.

మధుమేహం ఉన్న వారికి పచ్చి బఠానీ చాలా మంచిది. పచ్చి బఠానీ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర నిల్వలు నియంత్రణలో ఉంటాయి. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలామేలు చేస్తుంది. ఇంకా పచ్చి బఠానీలో ఉండే విటమిన్లు A, B,C, K మధుమేహం వల్ల వచ్చే రిస్క్ లను తగ్గిస్తాయి

పచ్చి బఠానీతో మరిన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయంటున్నారు పరిశోధకులు. ఇందులో ఫిటిక్ యాసిడ్, లెక్టిన్స్ లాంటి యాంటీన్యూట్రియంట్స్ ఎక్కువగా లభిస్తాయంటున్నారు. వీటి వల్ల శరీరంలో ఐరన్, జింక్, క్యాల్షియం, మెగ్నీషియం లాంటి ఖనిజ లవణాలు త్వరగా శోషితం చెందుతాయని చెబుతున్నారు. ఐతే లెక్టిన్స్ కారణంగా కొంత మేర గ్యాస్ట్రిక్ సమస్య ఏర్పడే అవకాశం ఉంది

Leave a Comment