మోనోపాజ్ దశ మొదలైందంటే స్త్రీలకు ఎన్నో సమస్యలు మొదలౌతాయి. నిజానికి ఈ దశలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం ద్వారానే మహిళలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. సరైన ఆహారాన్ని సరైన విధంగా తీసుకోవడం ద్వారా ఏ విధమైన సమస్యలు దరిచేరవనేది వైద్యుల మాట. మోనోపాజ్ దశలో తీసుకోవలసిన ఆహారం ఏమిటో తెలుసుకుందామా.
మహిళ యొక్క రుతుక్రమ ప్రక్రియ ఆగిపోయే దశను మెనోపాజ్ అంటారు. ఇది సాధారణంగా 40-50 ఏళ్ల వయసులో సంభవిస్తుంది. ఎటువంటి అవాంతరాలు లేకుండా గర్భధారణ చేయగలిగే సామర్ధ్యం మహిళల్లో నిలిచిపోవడాన్ని సూచించే సహజ ప్రక్రియ ఇది. మహిళల బీజకోశాల నుంచి ప్రాజెస్టెరోన్, ఈస్ట్రోజెన్ విడుదల నిలిచిపోయినప్పుడు మెనోపాజ్ సంభవిస్తుంది. హార్మోన్లు తగ్గడం వల్ల మహిళల శరీరంలో చాలా మార్పులు వస్తాయి. ఈదశలో మహిళలు ఆహారం విషయంలో ఏమాత్రం శ్రద్ధ చూపరనేది వాస్తవం. ఫలితంగా దేశంలో 80 శాతం మహిళలు అనేక రోగాల బారిన పడుతున్నారు. పోషకాహార లేమితో బాధ పడుతున్నారు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ రోజు ఇంట్లో ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఎక్కువ న్యూట్రీషియన్స్ ఉన్న ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎప్పుడూ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మెనోపాజ్ దశలో ఇరిటేషన్ పెరుగుతుంది. చికాకు పడుతుంటారు. కొంతమందిలో డిప్రెషన్‌కు లోనవుతారు. మతిమరుపు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. సాధ్యమైనంత ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించినా అన్ని వేళలా సాధ్యం కాకపోవచ్చు. ఇటువంటి సందర్భంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి.
మోనోపాజ్ దశలో తీసుకోవలసిన సూపర్ ఫుడ్స్‌లో ముఖ్యమైనవి పెరుగు, కొవ్వులుండే చేపలు, బీన్స్, టమాట, విటమిన్ డి బలహీనమైన తక్కువ కొవ్వు ఉండే పాలు. ప్రతి రోజూ తినే ఆహారాల్లో పెరుగు తప్పనిసరి. పెరుగులో ప్రోబయోటిక్స్, ల్యాక్టిక్ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణశక్తిని , ఇమ్యూనిటి పవర్ ను పెంచుతాయి. ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కలుగజేసే పరిపుష్టికరమైన ఆహార పదార్థాలలో చేపలు ఒకటి. చేపలలో ముఖ్యంగా ప్రోటీన్, విటమిన్-డి, కాల్షియం, ఫాస్పరస్ వంటి అవసరమైన పోషకాలతో పూర్తిగా నిండి ఉన్నాయి. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాల వంటి ముఖ్యమైన పోషక పదార్ధాలను కలిగి ఉన్న వాటిలో చేపలు కూడా ఒకటి. సన్నని శరీరంతో ఉండటానికి, శరీరం వృద్ధి చెందుటలో సహాయం చెయ్యటానికి అలాగే జ్ఞానశక్తి పనితీరును మరింతగా మెరుగుపరచడానికి కూడా దోహదపడుతుంది. టమాటాలు చాలా రకాల యాంటీ-ఆక్సిడెంట్’లను, మినరల్’లను కలిగి ఉంటాయి. టమాటలో ఉండే ‘లైకోపీన్’ అనే ఎరుపు రంగు వర్ణద్రవ్యం క్యాన్సర్ అభివృద్ధిని తగ్గిస్తుంది. టమాటాలు అనేక రకాల క్యాన్సర్’లను ప్రభావితం చేసే కారకాలకు వ్యతిరేకంగా పని చేస్తాయి.
విటమిన్ D కొవ్వుని కరిగిస్తుంది . మంచి ఆరోగ్యం, పెరుగుదల మరియు బలమైన ఎముకలకు విటమిన్ D ముఖ్యం. ఆహారంలో క్యాల్షియం జీర్ణం అవడానికి విటమిన్ D సహాయపడుతుంది. విటమిన్ D అనేది ఎక్కువగా సూర్య కాంతి లో ఉండటం వలన చర్మంలో ఉత్పత్తి అవుతుంది. విటమిన్ D లోపం సర్వసాధారణమైంది. సాల్మన్ చేపల్లో కూడా విటమిన్ డి లభిస్తుంది. మెనోపాజ్ మహిళలకు బీన్స్ చక్కటి ఆహారం. ఇది మూత్ర పిండాల పనితీరును మెరుగు పరుస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే వీటిలో ఉండే ప్రోటీన్స్ , ఫైబర్ గుండెపోటు రాకుండా అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా అడ్డుకోవడం చాలా ప్రముఖపాత్ర పోషిస్తాయి. అదేవిధంగా మెనోపాజ్ లక్షణాలను తగ్గించడంలో ఉపయోగపడతాయి. రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. బీన్స్‌ను వారానికి రెండురోజులు తీసుకుంటే మధుమేహం దరిచేరదు. బీన్స్‌లో పీచు, విటమిన్ ఎ, బి, కె, ఫోలేట్, మెగ్నీషియం వంటివి ఉండటం వలన రక్తంలోని కొలెస్ట్రాల్ తగ్గుతుంది. విటమిన్ ఎ కంటిచూపును మెరుగుపరుస్తుంది. ఇక బెర్రీల విషయానికి వస్తే మనకు మార్కెట్లో బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, రాస్ప్బెర్రీస్, బ్లాక్బెర్రీస్ అని రకరకాల బెర్రీలు అందుబాటులో ఉన్నాయి. వీటిలోయాంటీఆక్సిడెంట్లు, విటమిన్స్, తగినంత ఫైబర్ లభిస్తుంది. రోజూ అరకప్పు నుంచి ఒక కప్పు బె ర్రీస్ తీసుకోవాలి. ముఖ్యంగా క్యాన్సర్ కణాలతో పోరాడేందుకు బ్లాక్ బెర్రీస్ , బ్లూ బెర్రీ ఎంతగానో పాటుపడతాయి.