సందీప్ వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor)హీరోగా భారీ హంగులతో తెరకెక్కిన చిత్రం ‘యానిమల్’. ఈ సినిమా కోసం రణ్‌బీర్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఇందులో రణ్‌బీర్ లుక్‌పై ట్రైనర్ పోస్ట్ పెట్టారు.
బాలీవుడ్ కథానాయకుడు రణ్‌బీర్ కపూర్ నటించిన తాజా చిత్రం ‘యానిమల్’ (Animal). ఈ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యానిమల్ సినిమాలో తన లుక్ కోసం రణ్‌బీర్ కపూర్ పడిన కష్టాన్ని తన ట్రైనర్ వెల్లడించారు. ఎంతోమంది అగ్ర హీరోలు, సెలబ్రిటీలకు వ్యక్తిగత జిమ్ ట్రైనర్ శివోహం పనిచేసారు. అయితే యానిమల్ సినిమాకోసం రణ్‌బీర్ ఎంతో కఠోర శ్రమ చేసినట్లు రాసుకొచ్చారు. మరోలక్ష్యం నెరవేరింది. మరో మైలురాయిని సాధించారు. పనిపట్ల మీ కృషి, అంకితభావం మాటల్లో చెప్పలేనివి. అలాగే మీ నటనతో ఎప్పటికీ ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు. మీ ఫిట్నెస్ కోచ్‌గా ఉండడం నాకెంతో ఆనందానిస్తుంది అంటూ ‘యానిమల్’ టీమ్‌కు జిమ్ ట్రైనర్ శివోహం అభినందనలు తెలిపారు. ఇక రణ్‌బీర్ గత చిత్రాన్ని తాజా లుక్‌తో పోలుస్తూ ఒక ఫొటోను షేర్ చేశారు. ఇది చూసినవారంతా వావ్ అంటున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
యానిమల్ సినిమాలో విలన్ గా నటించిన నటుడు బాబీ దేవోల్ (Bobby Deol) కూడా ఎంతో కష్టపడి రణ్‌బీర్‌కు మించి కనిపించారు. ఈ లుక్ కోసం బాబీ దేవోల్ నాలుగు నెలల పాటు స్వీట్స్ తినకుండా కచ్చితమైన డైట్ ఫాలో అయినట్లు తెలిపారు. వీళ్ళు పడిన కష్టం చూస్తుంటే ‘యానిమల్’ సినిమా కోసం టీమ్ ఎంత కష్టపడ్డారో అర్థమవుతోంది. మన తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి బాలీవుడ్ లో ‘కబీర్ సింగ్’ తర్వాత తెరకెక్కించిన చిత్రమిదే. తండ్రీకోడుకుల సెంటిమెంట్‌తో అలరించడానికి సిద్ధమైంది. ఒక వ్యక్తి తన కుటుంబం కోసం ఎంత దూరం వెళ్తాడు..? అనే అంశాన్ని ఈసినిమాలో చూపించనున్నారు. కథానాయికగా రష్మిక నటించగా.. అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తికపూర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. పోస్టర్లతోనే అంచనాలను కలిగించిన చిత్రబృందం ట్రైలర్‌తో వాటిని రెట్టింపు చేసింది. ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని విధంగా ఇందులో రణ్‌బీర్ పాత్ర ఉండనున్నట్లు తెలుస్తోంది. రణ్‌బీర్ కపూర్ ఇండియాలో ది బెస్ట్ యాక్టర్ అని మహేష్ బాబు మెచ్చుకున్నాడు. బాబీ డియోల్, అనిల్ కపూర్ నటనలను చూస్తే రోమాలు నిక్కబొడుచుకున్నాయని తెగపొగిడేసాడు మహేష్ బాబు.