Phone Habit : అధికంగా సెల్ ఫోన్ వాడకాన్ని తగ్గించుకునే మార్గాలు ..?

By manavaradhi.com

Published on:

Follow Us
Tips to reduce your Sleep problems

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. అది లేనిది ఎవరికీ రోజు గడవడం లేదు. స్మార్ట్ ఫోన్‌తోనే అనేక పనులను ఇంటి నుండే చేసేస్తున్నాం. అందరూ దీనికి బాగా అడిక్ట్ అయిపోయారు. అయితే స్మార్ట్ ఫోన్ వలన ఎన్ని ఉపయోగాలున్నా, దానిని అధికంగా వాడితే అనారోగ్యాలు తప్పవు. కొంత మందికి సెల్‌ఫోన్ చేతిలో లేకపోతే ఏదో కోల్పోయినట్లు ఫీలవుతారు. ఉదయం కళ్లు తెరిచింది మొదలు.. నిద్రపోయే వరకు మొబైల్ లేకుండా క్షణం కూడా ఉండలేకపోతున్నాం. కాని సెల్ ఫోన్ వాడకాన్ని తగ్గించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

రోజుల పాటు మొబైల్ ఫోన్‌ను దూరం పెట్టేవారిలో మంచి అల‌వాట్లు అల‌వ‌డుతాయ‌ని ఇటీవ‌లి ప‌రిశోధ‌న‌లో తేలింది. అవ‌స‌రం ఉన్నంత మేర‌కే కాల్ చేయ‌డం, మెసేజ్ చేయ‌డం అల‌వ‌ర్చుకోవాలి. ఎంత స‌మ‌యం వాడాలో నిర్దేశించేలా యాప్‌ల‌ను సిద్ధం చేసుకోవాలి.

ఒకప్పుడు సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు మాత్రమే పరిమితమైన ఫోన్లు ఆధునిక సాంకేతికత పుణ్యమా సర్వస్వంగా మారాయి. ఆటలు, పాటలు, మెసేజ్‌లు, మూవీస్‌, న్యూస్‌, విజ్ఞానం, వినోదం అన్నీ ఒక్క సెల్‌ఫోన్‌ లోనే లభిస్తుండడంతో పొద్దస్తమానం వాటితోనే కాలక్షేపం చేస్తున్నారు. ప‌్ర‌స్తుత రోజుల్లో ప్ర‌తీ ఒక్క‌రి చేతిలో మొబైల్ ఫోన్ సాధార‌ణ‌మైపోయింది.

ఫేస్‌బుక్, వాట్స‌ప్‌, ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోష‌ల్ మీడియాలు ఎక్కువ‌గా యువ‌త‌పై ప్ర‌భావం చూపుతూ ఎక్కువ గంట‌లు మొబైల్ ఫోన్ల‌పై ఉండేలా చేస్తున్నాయి. ఫ‌లితంగా క‌ళ్ల స‌మ‌స్య‌లు మొద‌లుకొని మెద‌డు స‌మ‌స్య‌ల వ‌ర‌కు ఎంద‌రో ఆరోగ్యాన్ని పాడుచేసుకొంటున్నారు. మొబైల్ ఫోన్ల వినియోగం త‌గ్గించుకొనేందుకు వీలుగా మొబైల్‌పై ర‌బ్బ‌ర్ బ్యాండ్ వేసుకోవాలి. రాత్రి వేళ చార్జింగ్‌ను బెడ్రూంలో కాకుండా వేరే గ‌దిలో పెట్టాలి.

మూడు ఇంట్లో మొబైల్ ఫ్రీ జోన్‌ను ఏర్పాటుచేసుకోవాలి… అంటే భోజనం చేసేటప్పుడు డైనింగ్ టేబ్ దగ్గరకు ఫోన్ తీసుకుని వెళ్ళకూడదు. మొబైల్ ఫోన్ల‌కు బ‌దులుగా లైబ్ర‌రీకి వెళ్లి పుస్త‌కాలు చ‌దువ‌డం అల‌వాటు చేసుకోవాలి. స్నేహితుల‌తో గ‌డుప‌డానికి స‌మ‌యం వెచ్చించాలి. మొబైల్ యాక్సెంట్ నుంచి బ‌య‌ట‌కు రావాలంటే ఏదో ఒక వ్యాపకం పెట్టుకొవాలి. ఆర్ట్‌, ఆటలు ఆడటం, క్విజ్‌, పాట‌లు పాడ‌టం వంటి ప‌నులతో బిజీ కావాలి. స్నేహితులు, బంధువుల‌తో తరుచుగా మాట్లాడ‌టం అల‌వ‌ర్చుకోవాలి. మ‌రీ ఎక్కువ‌గా అడిక్ట్ అయితే సోష‌ల్ మీడియా యాప్స్ తొల‌గించుకోవాలి.

మొబైల్ ఫోన్ల వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలను ఎక్కువగా ఎందుకు వాడకూడదనుకుంటున్నామో ముందుగా కారణాలను వ్రాసుకోవాలి. ఫోన్‌ వాడకూడని సమయాలను ముందుగా నిర్ణయించుకోవాలి. మొబైల్‌లో వున్న రకరకాల మాధ్యమాల నోటిఫికేషన్స్‌ను తీసివేయాలి. సోషల్‌ మీడియాకు సంబంధించిన యాప్స్‌ వుంటే వాటిని తీసివేయండి. గ్రూప్‌ ఛాట్స్‌వల్ల ప్రయోజనం వుందా లేదా బేరీజు వేసుకొని వీలయినంత వరకు తీసివేయండి, లేదా వాటిని మ్యూట్‌లో పెట్టండి.

ఫోన్‌ను ఎలా వాడాలో కొన్ని నియమాలు వ్రాసుకోండి. టెక్ట్స్‌ మెసేజెస్‌ రోజులో ఒక్కసారి లేదా రెండుసార్లు నిర్ణీత సమయంలోనే ఇవ్వ‌డం అల‌వాటు చేసుకోవాలి. పడుకునే ముందు, చదువుకునే ముందు, ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చెయ్యాలి. అత్య‌వ‌స‌ర అంశాల‌కు త‌ప్ప మిగ‌తావాటికి నోటిఫికేష‌న్లు పెట్ట‌డం మానుకోవాలి. అలారంకోసం మామూలు గడియారాన్ని ఉపయోగించండి. ఇలా కొన్ని రోజులు చేసి చూస్తే సెల్‌ఫోన్‌ను ఇంకా తక్కువగా ఉపయోగించడం అలవాటుగా మారుతుంది. అవసరం ఉన్న‌ప‌క్షంలోనే సెల్‌ఫోన్‌ను వినియోగించాలి.సెల్ ఫోన్ ని అసలు వాడకుండా ఉండలేరు కాబట్టి,.. కాస్త జాగ్రత్తగా, తక్కువగా, అవసరమున్నంత వరకే వాడటం వల్ల ఎలాంటి దుష్ర్పభావం ఉండదు.

ఉపయోగంలో లేని సమయంలో ఫోన్ ను వీలైనంత దూరంలో ఉంచండి. రోజు రోజుకు సెల్ ఫోన్ లో మాట్లాడే వ్యవధి మరియు వాడుకను పరిమితం చేసుకుంటూ రండి, దీని వలన భారీ వ్యత్యాసం కనపడుతుంది. మీరు ఎక్కువ సమయం పాటు మాట్లాడవలసి వస్తే, ల్యాండ్ ఫోన్లను వినియోగించండి.

Leave a Comment