10 సంవత్సరాల తర్వాత పవన్‌ ఇంటికి చంద్రబాబు

By manavaradhi.com

Updated on:

Follow Us

ఇంకా కొద్ది నెలల్లో ఎన్నికలు రానున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్‌ ఉంటుందని.. కొద్ది రోజులు ముందుగానే రావచ్చు అంటూ ఏపి సీఎం వైఎస్ జగన్ చెప్పడంతో రాజకీయ పార్టీలు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. అందుకు అనుగుణంగానే వైసీపీ టికెట్ల ఖరారు చేయడం ప్రారంభించింది. ఏదిఏమైనా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను పిలిచి నిర్మొహమాటంగా చెప్పడం రాజకీయాల్లో సంచలనం కలిగిస్తోంది. మరో పక్క ప్రతిపక్ష పార్టీలు అయిన జనసేన – తెలుగుదేశం పొత్తులు ఇగోలతో కత్తులు దూసుకుంటున్నారు అని తమ సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నవారి గట్టి కౌంటర్ ఇచ్చారు చంద్రబాబు – పవన్. పోత్తు జరిగే అంశం కాదులే అని ప్రత్యర్థులు ప్రచారాలు చేస్తూ ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తుండగా తాజాగా బాబు – పవన భేటితో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి.

జైలు నుంచి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇంటికి జనసేనాని పవన్ కళ్యాణ్ వెళ్లి బాబును పరామర్శించగా .. తాజాగే ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పవన్‌ ఇంటికి వెళ్లడం విశేషం. 2014 తర్వాత అంటే సుమారు 10 సంవత్సరాల తర్వాత జనసేనాని ఇంటికి చంద్రబాబు వెళ్లారు. ప్రతిపక్ష కూటమి టీడీపీ, జనసేనలు పొత్తుల్లో భాగంగా చంద్రబాబు, పవన్‌లు యుద్ధానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగా చర్చలు ప్రారంభించారు. వీరి మధ్య సుమారు మూడు గంటలకు పైగా చర్చలు జరిగాయి. ఏపీలో రాజకీయ పరిస్థితులు, ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహం, రెండు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో విడుదల కార్యక్రమంపై సమీక్షించారు. చంద్రబాబు, పవన్‌ ఫొటోలతో ముద్రించిన ఉమ్మడి మేనిఫెస్టోను రూపొందించనున్నట్లు సమాచారం. ఎప్పుడు దీనిని విడుదల చేస్తారో త్వరలోనే తేదీని ఖరారు చేయనున్నారు.

గతంలొ సూపర్‌ సిక్స్‌ పేరుతో మహానాడులో టీడీపీ మినీ మేనిఫెస్టో ప్రకటించిన సంగతి తెలిసిందే.
చంద్రబాబు, పవన్‌ భేటీలో జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ కూడా పాల్గొన్నారు. సమావేశ వివరాలను ఆయన మీడియాకు వెల్లడిరచారు. ‘అధినేతల భేటీ చాలా సంతృప్తికరంగా సాగింది. అనేక అంశాలపై చర్చలు సుహృద్భావంగా జరిగాయి. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌ సాధనే ఉమ్మడి ధ్యేయంగా వచ్చే ఎన్నికల్లో సమష్టిగా ఎలా ముందుకెళ్లాలి. రెండు పార్టీల కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో ఎలా ముందుకు సాగాలో సమష్టి కార్యాచరణ తీసుకున్నాం అన్నారు. కాగా అందరూ ఎదురు చూస్తున్నట్టు ఎవరికి ఎన్ని సీట్లు.. ఎవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలి అన్న విషయాలు బహిర్గతం కాలేదు. బహుశా 20న జరగనున్న యువగళం ముగింపు సభ అనంతరం మరోసారి జరిగే భేటీలో సీట్లు పంపిణీపై చర్చిందే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

జగన్మోహన్ రెడ్డి…బీసీలకు ప్రాధాన్యం అంటూ నియోజకవర్గ ఇన్చార్జిలు, ఎమ్మెల్యేల మార్పు, అంటూ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ఎమ్మెల్యేలను పిలిచి నీకు ఈసారి టికెట్‌ లేదు.. పార్టీ విజయానికి పనిచేయి.. తర్వాత మంచి భవిష్యత్‌ ఉంటుంది.. తర్వాత మీ ఇష్టం అని చెప్పడంతో ఎమ్మెల్యేలు ఖంగుతింటున్నారు. ఈ ప్రక్రియ వైసీపీలో శరవేగంగా జరిగిపోతుంది. ప్రస్తుత పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేసి జగన్ వ్యూహాలకు ప్రతివ్యూహాలు ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఎలా ప్రభావితం చేయాలన్న అంశాలపై ప్రత్యేకంగా చర్చించారు. ఏదీఏమైనా వైసీసీ పాలనకు ముగింపు పలికే విధంగా తమ పణాళికలు ఉంటాయన్న సంకేతాలు పార్టీ శ్రేణులకు పంపించడంలో చంద్రబాబు – పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు. అందుకు అనుగుణంగానే ఇరు పార్టీల నేతల ధ్యేయంగా చర్చలు సాగాయనడంలో సందేహం లేదు. సీట్లు పంపిణ విషయమై మరో భేటీలో కొలిక్కి రావచ్చని టీడీపీ నేతలు చెబుతున్నారు.

Leave a Comment