Shikar Dhawan : ధావన్ తన కొడుకు జొరావర్ కోసం చేసిన ఓ పోస్ట్ అందర్నీ కంటతడి పెట్టిస్తుంది

By manavaradhi.com

Updated on:

Follow Us

క్రికెటర్ శిఖర్​ ధావన్ (Shikar Dhawan) గురించి ప్రత్యేకంగా చెప్పనకర్ల .. అతడు మైదానంలో ఎంత చురుగా ఉంటాడో బయటకూడా అలాగే ఉంటాడు. అయితే ప్రస్తుతం శిఖర్ ధావన్ కు బ్యాడ్ టైం నడుస్తుందని చెప్పాలి. ఎందుకంటే గత కొన్నాళ్లుగా అటు కెరీర్ తో పాటు ఇటు వ్యక్తగత జీవింతలోనూ శిఖర్ ధావన్ కు ఏది కలిసిరావడంలేదు.. ప్రేమించి పెళ్ళి చేసుకున్న ధావన్ ధావన్‌ దంపతులకు కోర్టు విడాకులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. భార్య అయేషా ముఖర్జీ నుంచి విడిపోవడంతో తన కుమారుడు జొరావర్‌ను గబ్బర్‌ కలుసుకోలేకపోతున్నాడు. తాజాగా కుమారుడి పుట్టినరోజు సందర్భంగా తన ఇన్‌స్టా పేజీలో ధావన్‌ భావోద్వేగభరిత పోస్ట్‌ పెట్టాడు. ‘నిన్ను చూసి ఏడాదవుతోంది’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఆ పోస్ట్ చూసిన ప్రతి ఒక్క ధావన్ అభిమాని గుండె చమక్క్ మంటుంది. ధావన్ తన కొడుకు జొరావర్ కోసం చేసిన ఓ పోస్ట్ అందర్నీ కంటతడి పెట్టిస్తుంది.

కుమారుని పుట్టిన రోజు సందర్భంగా శిఖర్ ధావన్ … కొన్ని నెలల క్రితం తన కుమారుడితో వీడియోకాల్‌లో మాట్లాడినప్పటి ఫొటోను తాజాగా షేర్‌ చేసి ‘‘నిన్ను నేరుగా చూసి ఏడాది దాటింది. నాకు నిన్ను పూర్తిగా దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గత మూడు నెలలుగా నీతో మాట్లాడనివ్వకుండా అన్ని విధాలుగా నన్ను బ్లాక్‌ చేస్తున్నారు. కానీ, నీతో నేరుగా మాట్లాడకపోయినప్పటికీ.. ఫొన్ ద్వారా ఎప్పటికీ నీ మనసుకు దగ్గరగానే ఉంటాను. నువ్వు ఉన్నతంగా ఎదుగుతావని నాకు తెలుసు. ఈ పాపా ఎప్పుడూ నిన్ను మిస్‌ అవుతూనే ఉంటాడు. నీ నవ్వు కోసం ఎదురుచూస్తూనే ఉంటాడు. దేవుడి దయ వల్ల మళ్లీ మనం కలుస్తామని ఆశిస్తున్నా. ధైర్యంగా ఉండు. దయ, వినయం, సహనంతో మెలుగు’’ఇన్​స్టాగ్రామ్​ లో ధావన్​ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.

తన కంటూ వయసులో పది సంవత్సరాలు పెద్దది అయిన కిక్ బాక్సర్ అయేషాను శిఖర్ ధావన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కామన్ ఫ్రెండ్ ద్వారా పేస్ బుక్‌లో పరిచయం అయిన ఆయేషాకు థానే ముందుగా ప్రపోస్ చేశానని ధావన్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. 2009లో వీరికి ఎంగేజ్‌మెంట్ జరగ్గా 2012లో పెళ్లి చేసుకున్నారు. అయితే ఆయేషాకు ఇది రెండో పెళ్లి కాగా ధావన్ కు మాత్రం మొదటి వివాహం. అయేషాకు మొదటి భర్త ద్వారా కలిగిన ఇద్దరు అమ్మాయిలను కూడా ధావన్ దత్తత తీసుకున్నాడు. వారిని కూడా చాలా చక్కగా చూసుకుంటాడు. అయేషా, ధావన్ దంపతులకు 2013 సంవత్సరంలో కొడుకు జొరావర్ జన్మించాడు.

తనను ఆయేషా మానసికంగా వేధిస్తోందని విడాకులు మంజూరు చేయాలని ధావన్ కోర్టు మెట్లెక్కాడు. విచారణ జరిపిన న్యాయస్థానం వారికి విడాకులు మంజూరు చేసింది. అయితే తన కుమారుడి శాశ్వత కస్టడీని కోరిన ధావన్ అభ్యర్థనను మాత్రం న్యాయస్థానం తిరస్కరించింది. కానీ ఫోన్‌లో మాట్లాడొచ్చని, స్కూల్ సెలవుల సమయంలో తన కుమారుడితో భారత్‌లో కలిసి ఉండవచ్చని చెప్పింది. దానికి తగ్గట్టుగా అయేషా సహకరించాలని తెలిపింది.

Leave a Comment