మైదానంలో బ్యాటుతో రికార్డులు బద్దలు కొట్టే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ‘మాక్ చికెన్ టిక్కా’ అని పోస్టు పెట్టడంతో నెట్టింట వైరల్‌గా మారిపోయింది.
విరాట్ కోహ్లీ.. ఎన్నో రికార్డులు, మరెన్నో ఘనతలు. ఆధునిక క్రికెట్ ను తన బ్యాట్ తో మకుటం లేని మహారాజుగా ఏలుతున్నాడు. అంలాంటి విరాట్ ఫిట్‌నెస్‌కు మారుపేరు. డైట్ విషయంలో కోహ్లీ పక్కగా పాటిస్తాడు. తన డైట్‌లో భాగంగా గతంలో విరాట్ కోహ్లీ వెజిటేరియన్‌గా మారిపోయాడు. అయితే.. అతడు ‘మాక్ చికెన్ టిక్కా’ తింటున్న ఫొటోను తాజాగా షేర్ చేయడంతో అది కాస్తా నెట్టింట్లో వైరల్‌గా మారింది. విరాట్ ఏంటీ.. ఇలా చేశాడని పలువురు కామెంట్లు కూడా పెట్టారు. అయితే..‘మాక్ చికెన్ టిక్కా’ను అభిమానులు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడమే ఇందుకు కారణం అంటున్నారు కొంతమంది. చాలామంది అయితే మాక్ చికెన్ టిక్కా అంటే ఏంటో అని గూగుల్లో తెగవెతికేస్తున్నారంట..!
కోహ్లీ నాన్ వెజ్ ని అస్సలు తినడు. కేవలం, పాక్షిక శాకాహారం మాత్రమే తీసుకుంటాడు. గతంలో కోహ్లీ ఓ ఆరోగ్య సమస్యను ఎదుర్కొన్నాడట. అప్పటి నుంచి మాంసాహారం తినడం మానేశాడు. అప్పటి నుంచి కేవలం ప్యూర్ వెజ్ తీసుకోవడం మాత్రమే అలవాటు చేసుకున్నాడు. ఇప్పటికీ దానినే ఫాలో అవుతూ ఉంటాడు. కానీ, సోషల్ మీడియా వేదికగా ఓ ఫొటో షేర్ చేస్తూ ‘‘ఈ మాక్ చికెన్ టిక్కాను తప్పక ఇష్టపడతారు’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో అభిమానులు ఒక్కసారిగా తమ కామెంట్లకు పని చెప్పారు. అదేంటి విరాట్ వెజిటేరియన్ అని అన్నట్లు గుర్తు.. ఇప్పుడు ఇలా ఏంటి? అని కామెంట్లు పెట్టారు.
అసలు ఇంటకీ ఏంటీ మాక్ చికెన్ టిక్కా?
చికెన్ టిక్కా మాదిరిగానే ఉంటుంది ఈ ‘మాక్ చికెన్ టిక్కా’ కాని నిజానికి ఇది నాన్‌వెజ్ వంటకం కాదు. దీన్ని చికెన్‌తో తయారు చేయరు. ఇది పూర్తి శాకాహార వంటకం.. దీన్ని తయారుచేయడానికి సోయాను వాడతారు. ఇది వెజిటేరియన్ల ‘నాన్‌వెజ్’ వెర్షన్ వర్షన్ గా చెప్పవచ్చు. ఎందుకంటే ఇది వెజ్ అయినప్పటికి రుచిపరంగా సాధారణ చికెన్ టిక్కాకు, సోయాతో తయారు చేసిన టిక్కాకు పెద్దగా తేడా ఉండదు. చికెన్ తిన్న భావనే కలుగుతుంది. అందుకే మాంసాహారం ‘మాక్’ వెర్షన్‌ను ఎక్కువగా సోయాతోనే తయారు చేస్తుంటారు. ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా నాన్‌వెజ్‌ను మానేసిన తర్వాత సోయాతో తయారు చేసిన ‘మాక్ చికెన్’నే అప్పుడప్పుడు తింటుంటాడు.