Metabolism : బరువు తగ్గాలా.. అయితే వీటి వేగాన్ని పెంచండి

By manavaradhi.com

Published on:

Follow Us
Metabolism

మ‌న శ‌రీరంలో వ్యాధి నిరోధ‌క శ‌క్తి త‌గ్గ‌డం వ‌ల్ల‌నే అనేక ర‌కాల అనారోగ్యాల బారిన ప‌డ‌తామ‌ని అంద‌రికీ తెలిసిందే. కొంద‌రికి ఈ శ‌క్తి ఎక్కువ‌గా ఉంటుంది. మ‌రికొంద‌రికి వ్యాధి నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉంటుంది. దీంతో వారు త‌ర‌చూ అనారోగ్యాల బారినప‌డ‌తారు. అయితే కొన్ని రకాల చిట్కాలు పాటిస్తూ చక్కని ఆహారాలు తీసుకుంటే శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెర‌గడ‌మే కాదు, అనారోగ్యాలు రాకుండా జాగ్ర‌త్త ప‌డవ‌చ్చు.

జవకణంలో జరిగే అన్ని రసాయనిక చర్యలను కలిపి జీవక్రియగా పేర్కొనవచ్చు. జీవం మనుగడకు జీవ‌క్ర‌యలు అత్యావశ్యకమైనవి. జీవ కణాల్లో పెరుగుదల, అభివృద్ధి, నిర్మాణం, త‌దిత‌ర‌ అంశాలు మెటాబాలిజంలో చోటుచేసుకుంటాయి. మెటాబాలిజంను .. కెటబాలిక్ చర్యలు , ఎనబాలిక్ చర్యలు గా ఉంటాయి. జీవక్రియ యొక్క రసాయనిక చర్యలన్నీ మెటాబాలిజం పాథ్‌వేలలో అమర్చబడి ఉండి.. రసాయనిక పదార్ధం ఎంజైమ్‌ల‌ సహాయంతో మరొక రసాయనిక పదార్థంగా మార్పు చెందుతుంది. ఒక్క మాట‌లో చెప్పాలంటే శ‌రీరానికి శక్తిని ఇవ్వటానికి పిండిపదార్ధాలు,మాంసకృత్తులు మరియు కొవ్వులను బ్రేక్ చేసే ప్రక్రియనే జీవ‌క్రియ లేదా మెటాబాలిజంగా పేర్కొన‌వ‌చ్చు.

మ‌నం తింటునప్పుడు, వ్యాయామం చేస్తునప్పుడు ఎన్ని కేలరీలు ఖ‌ర్చు చేసారో గుర్తించడానికి, కండరాల మాస్ శక్తిని పెంచి బరువు పెరుగుటను జీవ‌క్రియ‌లు నివారిస్తాయి. కొవ్వు పెరిగి బ‌రువు రావ‌టం వ‌ల‌న‌ 30 నుంచి 40 ఏళ్ల‌ వయస్సుకు వచ్చే సరికి మ‌న‌ జీవక్రియ వేగం తగ్గటం ప్రారంభం అవుతుంది. దీన్ని నివారించేందుకు మ‌న జీవ‌న‌శైలిలో మార్పులు చేర్పుల‌తో పాటు పోష‌కాహారం తీసుకోవ‌డం చాలా ముఖ్య‌మ‌ని సెల‌విస్తున్నారు పోష‌కాహార నిపుణులు.

రోజువారిగా మ‌నం తీసుకొనే కేల‌రీల‌ను త‌గ్గించ‌డం ద్వారా జీవక్రియ‌లు స‌క్ర‌మంగా ప‌నిచేసేలా చేయ‌వ‌చ్చు. మూత్ర‌పిండాల స‌మ‌స్య‌లు లేనివారు నిత్యం తీసుకొనే డైట్‌లో ప్రొటీన్ శాతాన్ని పెంచుకోవాలి. ప్రోటీన్లు విచ్ఛిన్నం అయ్యి కేలరీలు బర్న్ అవటానికి కనీసం మూడు గంటల సమయం పడుతుంది. ఫ‌లితంగా జీవ‌క్రియ స‌క్ర‌మంగా ప‌నిచేస్తుంది. శరీరానికి ఆక‌లి వేయ‌కుండా ఉండేందుకు గంట‌కోమారు కొద్దికొద్దిగా ఆహారం తీసుకోవాలి. క‌నీసం రెండు సార్లైనా స్నాక్స్ తీసుకోవ‌డం చాలా మంచిది. ఫ‌లితంగా ఎక్కువ మొత్తంలో ఒకేసారి తీసుకోవ‌డం.. జీర్ణ‌కాక‌పోవ‌డం వంటి స‌మ‌స్య‌లు ఉత్ప‌న్నం కావు. నిద్ర‌లేవ‌గానే ఒక పండు తీసుకోవ‌డం అల‌వాటు చేసుకొన్న‌వారిలో జీవ‌క్రియ‌లు మెరుగుప‌డిన‌ట్టు ప‌రిశోధ‌కులు గుర్తించారు. ఆక‌లి భావ‌న క‌ల‌గ‌గానే స‌లాడ్లు, బాదాం, పిస్తా, కాజు వంటి న‌ట్స్ తీసుకోవ‌డం అల‌వాటుచేసుకోవాలి.

మారిన మ‌న జీవ‌న‌శైలి కార‌ణంగానే మెటాబాలిజంలో మార్పులు వ‌స్తున్నాయని నిపుణులు గుర్తించారు. ఫలితంగా జీవ‌క్రియ‌ల్లో మార్పులు చోటుచేసుకొని ఊబ‌కాయం రావ‌డానికి దాహ‌ద‌ప‌డుతున్న‌ది. డైటింగ్‌ పేరుతో పొట్ట మాడ్చుకోవడం వ‌ల్ల శరీరం తన అవసరాల కోసం కండర కణజాలంలో ఉండే శక్తిని వాడుకుంటుంది. ఫలితంగా మీరు మరింత బలహీనంగా మారతారు. జీవక్రియ రేటు మందగించడానికి ప్రధాన కారణాల్లో అల్పాహారం తీసుకోక‌పోవ‌డం ఒకటి. అల్పాహారం మానేసిన మహిళల్లో మిగతావారికన్నా త్వ‌ర‌గా ఊబకాయం వస్తుందని ఎన్నో పరిశోధనలు చెబుతున్నాయి. ఉదయం పూట కనీసం పాలూ, పెరుగూ, ఓట్‌మీల్‌ ఇలా ఏవైనా సరే అల్పాహారంగా తీసుకోవడానికే ప్రయత్నించాలి.

శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి జీవక్రియని వేగవంతం చేయడంలో మంచినీరు కీలకపాత్ర పోషిస్తుంది. అందుక‌ని రోజూ కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగడం అల‌వాటుచేసుకోవాలి. కొన్నిర‌కాల ఎన‌ర్జీ డ్రింక్స్ తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మెటాబాలిజం మెరుగుప‌డుతుంద‌ని కొన్ని ప‌రిశోధ‌న‌ల్లో తేలింది.

మన శరీరానికి కావాల్సిన రోగ నిరోధక శక్తి అందితేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే తరచుగా జలుబు, జ్వరం, అలసట, అలర్జీ లాంటివి బాధిస్తుంటాయి. కాబట్టి నిత్యం తినే ఆహారంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం ఉండేలా జాగ్రత్త పడాలి. మారుతున్న కాలానికి తగ్గట్టు సరైన పోషకాహారం తీసుకోవాలి.

Leave a Comment