ఈ ఆధునిక సమాజంలో చిన్నపాటి దూరాలకు కూడా చాలా మంది వాహనాలను ఉపయోగిస్తున్నారు. కానీ ఒకప్పుడు సైకిళ్లను ఎక్కువగా వాడేవారు. అందువల్ల వారు ఆరోగ్యంగా ఉండేవారు. అయితే సైకిల్ తొక్కడం వల్ల మన శరీరానికి అద్భుతమైన వ్యాయామం జరుగుతుంది. ఈ క్రమంలోనే రోజుకు కనీసం 30 నిమిషాల పాటు అయినా సైకిల్ తొక్కడం వల్ల అనేక లాభాలు కలుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
కసరత్తులు కష్టంగా కాకుండా… కాస్త సరదాగానూ ఉండాలని కోరుకుంటారు కొందరు. అలాంటివారికి సైక్లింగ్ చక్కటి సాధనం. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి సరదాగానూ చేసేయొచ్చు. దృఢంగా ఉండొచ్చు. ఒక వయసుకు వచ్చేసరికి మహిళల్లో ఎముకలు బలహీనంగా మారతాయి. దాంతో కీళ్ల నొప్పులూ ప్రారంభమవుతాయి. సైకిల్ తొక్కడం వల్ల మోకాళ్లు, మోచేతులు, ముంజేతుల దగ్గరి ఎముకలు చురుగ్గా, దృఢంగా మారతాయి. అంతేకాదు రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
సైకిల్ తొక్కడం వల్ల శరీరం మొత్తానికి రక్త ప్రసరణ సక్రమంగా సాగి శరీరంలోని అన్ని భాగాలకూ సరిపడినంత ఆక్సిజన్ అందుతుంది. మెనోపాజ్ ముందూ, తరువాత దశల్లో రొమ్ము క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది.ఎలాంటి ఒత్తిడికీ గురికాకుండా అధిక బరువును తగ్గించుకోవడానికీ సైక్లింగ్ తోడ్పడుతుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయులను నియంత్రిస్తుంది. అంతేకాదు శరీరమూ చురుగ్గా మారుతుంది.
సైకిళ్ళు అత్యంత సాధ్యమయ్యే పర్యావరణకు అనుకూలమైన రవాణా మార్గంగా. సైక్లింగ్ బరువు తగ్గడానికి సహాయపడటం నుంచి గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడం వరకు అనేక ఆరోగ్య ప్రయోజనాలతో ముడిపడి ఉన్నది. ముఖ్యంగా టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహిస్తుంది.
జిమ్‌కెళ్లి వ్యాయామాలు చేసేంత టైమ్ లేనివాళ్లు సైకిల్‌పై సవారీ చేస్తూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇంట్లోనే ఓ మూలన పెట్టుకుని తొక్కుతూ కూడా చెమటలు కక్కేలా వ్యాయామం చేయొచ్చు. సైకిల్ తొక్కుకుంటూ పని ప్రదేశానికి గానీ, పాఠశాలకు లేదా పార్కుకు వెళ్లడం ద్వారా మీ దినచర్యకు ఈ వ్యాయామం సరిపోతుంది. సైక్లింగ్ శారీరక, మానసిక శ్రేయస్సును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
సైక్లింగ్ చేయడం వల్ల వేగంగా బరువు తగ్గడంతో పాటు శరీరం ధృడంగా తయారవుతుంది. కొవ్వు, కండరాలు తగ్గి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే దీర్ఘ కాలికంగా వేధిస్తున్న నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. రోజులో కనీసం అర్ధగంట సేపైనా సైకిల్ తొక్కడం అలవాటుగా చేసుకోవాలి. ఉదయం నీరెండలో సైకిల్ తొక్కడం వలన అటు వ్యాయామంతో పాటు ఇటు డీ విటమిన్ శరీరానికి అంది శరీరం కాంతివంతంగా తయారవుతుంది.
గంటలు గంటలు వ్యాయామం చేసే కన్నా.. సరదాగా కాసేపు సైక్లింగ్ చేయడం ఎంతో బెటర్ అని చాలా మంది అంటుంటారు. రోజూ సెకిల్ తొక్కేవారు దాదాపు 45 శాతం క్యాన్సర్ వంటి పలు సమస్యల నుంచి బయటపడుతున్నట్లు స్టడీలు చెబుతున్నాయి. ఒబెసిటీ అనేది ప్రస్తుతం చాలా మంది ఎదుర్కుంటున్న సమస్య. అయితే వీరికి డాక్టర్లు ఎక్కువగా ఇస్తున్న సలహా సైకిల్ తొక్కడమే. సైక్లింగ్ శరీరానికి హాని చేసే కొవ్వును తగ్గించి.. మంచి కొవ్వు పెరిగేందుకు సహాయపడుతుందట.
సైకిల్ తొక్కడం వల్ల శారీరకంగానే కాక.. మానసికంగా కూడా చాలా రిలీఫ్ పొందవచ్చట. సరదాగా అలా సైక్లింగ్ చేయడం వల్ల సెరోటోనిన్, ఎండోర్ఫిన్ అనే హ్యాపీ కెమికల్స్ రిలీజ్ అయి మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. కండరాలు బలంగా,ఆరోగ్యంగా ఉంటేనే మనిషి కదలికలు సక్రమంగా ఉంటాయి. కండరాలను ఆరోగ్యంగా ఉంచటానికి సైక్లింగ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వయస్సు పెరిగే కొద్ది కండరాలు బలహీనం అవుతాయి. వీటిని బలోపేతం చేయటానికి సైక్లింగ్ మందుగా పనిచేస్తుంది.
బయట సైకిల్ తొక్కేవారు కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎగుడు దిగుడు దారిలో కాకుండా సాఫీగా ఉన్న దారిలో సైకిల్ తొక్కాలి. సైకిల్ తోక్కేతప్పుడు అనువైన బూట్లు మరియు దుస్తులు ధరించాలి. కాస్త విసుగ్గా ఉన్నప్పుడు సైక్లింగ్ చేస్తే.. క్షణాల్లో చిరాకు మాయమై మనసంతా హాయిగా ఉంటుంది. సైకిల్ తొక్కుతున్నప్పుడు మెదడులో విడుదలయ్యే డోపమైన్ అనే హార్మోన్ మనసుని ఉల్లాసంగా ఉంచుతుంది. శక్తినీ అందిస్తుంది.