Foods for Good Sleep: నిద్ర పట్టడంలేదా? ఈ ఆహారంతో చక్కటి నిద్ర మీ సొంతం!

By manavaradhi.com

Published on:

Follow Us
Foods for Good Sleep

కొంతమందికి కళ్లు మూసుకోగానే నిద్ర పట్టేస్తుంది. ఇంకొంతమందికి ఎంత ప్రయత్నించినా కళ్లు మూతలు పడవు. ఏ సమస్య లేకుండా కంటి నిండా నిద్ర పట్టాలంటే కొన్ని ఆహార చిట్కాలు పాటించాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఎనిమిది గంటలు నిద్ర పోవాలి. సామాన్యంగా పిల్లలకు పెద్దలకంటే ఎక్కువగా నిద్ర అవసరం. ఇది వారి శారీరక పెరుగుదలకు మానసిక అభివృద్ధికి చాలా అవసరం.

చాలమంది నిద్ర పట్టక సతమవుతుంటారు. మంచంపై అటూఇటూ తిర‌గ‌డం, లేచికూర్చోవ‌డం, మ‌ళ్లీ ప‌డుకునేందుకు ప్ర‌య‌త్నించ‌డం చేస్తుంటారు. ఇలాటివారు క్రమబద్ధమైన అలవాట్లను పాటిస్తే.. మంచి నిద్ర సొంతమవుతుంది. సరైన నిద్రకు ఆహార నియమం కూడా ఎంతో అవసరం. రాత్రి సరిగా నిద్ర పట్టాలంటే తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. మాములుగా రాత్రి వేళల్లో ఆహారం ఎక్కువగా తెసుకుంటే నిద్ర పట్టదు అంటారు కానీ తక్కువ తిన్న కూడా నిద్ర కు అంతరాయం కలుగుతుంది ,అందుకే పోషకాలు నిండి ఉన్న హెల్తీ పుడ్ తీసుకోవడం వల్ల పొట్ట తేలికగా ఉండటంతో పాటు కంటినిండా నిద్ర పడుతుంది.

రాత్రిళ్లు నిద్ర సరిగా రాకపోవడానికి మనం తీసుకునే ఆహారపదార్థాలు కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. మంచి నిద్ర రావాలంటే మనం తీసుకోనే ఆహారం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మనం రోజు తీసుకునే డైట్‌లో పోషక పదార్ధాలు ఉండాలి. ఓట్స్‌ ప్రశాంతమైన నిద్ర పొవడానికి బాగా ఉపయోగపడుతాయి. ఇందులోని విటమిన్స్, మినరల్స్, అమినో యాసిడ్స్, మెలటోనిన్ మెదడుని ప్రశాంతంగా ఉంచి నిద్రాభంగం లేకుండా చేస్తాయి.

High-Antioxidant Foods
Foods for Good Sleep

అరటి పండ్లలో మెగ్నీషియం, సెరటోనీన్, మెలటోనిన్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. కావున వీటిని తినడం వల్ల మంచి నిద్రపడుతుందని ఎన్నో పరిశోధనల్లో తేలింది. బాదంలో ఉండే హెల్దీ ఫ్యాట్స్, మెగ్నీషియం మంచినిద్రకు దోహదం చేస్తాయి. కాబట్టి వీటిని కూడా మీ డైట్‌లో ఉండేలా చూసుకోవడం మంచిది. మెలటోనిన్ అనే పదార్థం వాల్ నట్స్ సమృద్దిగా ఉంటుంది. ఇవి హాయిగా నిద్రపోయేందుకు దోహదం పడుతాయి.

వాల్‌నట్స్‌లొ ఉన్నట్లే చెర్రీస్‌లో కూడా మెలటోనిన్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల చెర్రీలను తినడం అలవాటు చేసుకోండి. గుడ్లులోని అమైనో యాసిడ్స్ నిద్రపోయేందుకు దోహదం చేస్తుంది. రోజూ గుడ్డు తినడం వల్ల మంచి నిద్రతో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది. పెరుగు లేదా యోగర్ట్ లో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఏసిడోఫిలస్ అనే బ్యాక్టీరియా జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలను నివారిస్తుంది. కాబట్టి డిన్నర్ లో పెరుగు చేర్చుకోవడం మంచిది.

భోజనం తర్వాత కాస్త మగతగానూ, నిద్రపడుతున్నట్లుగానూ అనిపించడం చాలామందికి తెలిసిందే. కార్బోహైడ్రేట్ తీసుకున్న తర్వాత వాటి నుంచి శక్తిని తయారు చేసేందుకు నిద్ర వస్తుంటుంది. అందుకే భోజనం తర్వాత నిద్ర వస్తున్నట్లు అనిపిస్తుంది. పాలను సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు. అన్ని పోషకాలతో పాటు ఇందులో ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. దీని వల్ల మంచి నిద్ర వస్తుంది. ఆరోగ్యకరమైన నిద్ర కోసం మరీ వేడిగానూ, మరీ చల్లగానూ లేకుండా ఉండే గోరువెచ్చటి పాలను నిద్రకు ఉపక్రమించే ముందు తీసుకోవడం మేలు దీంతో పాటు, విటమిన్ సి పాళ్ళు ఎక్కువగా ఉండే బొప్పాయి, అనాస, నిమ్మజాతి పండ్లు సహజమైన రాత్రి నిద్రను కలగజేస్తాయి.

స్పైసీ ఫుడ్‌ , పిజ్జాలు తినకూడదు. రాత్రి పూట శరీరం విశ్రాంతి తీసుకుంటుంది. అందువల్ల మాంసాహారం లాంటివి తింటే తేలిగ్గా జీర్ణం కావు. కొందరికి నిద్రపోయే ముందు ఏదో ఒకటి తినే అలవాటు ఉంటుంది. చిరుతిళ్లు తింటారు లేదా కాఫీలు, టీలు తాగుతారు. నిద్రపోయే ముందు ఏమైనా తినడం మంచి అలవాటు కాదు. అది జీర్ణ వ్యవస్థకు ఇబ్బంది. అలాగే కాఫీలు, టీలలో ఉండే కెఫిన్‌ వల్ల నిద్ర సరిగా పట్టదు కాబట్టి వీటికి దూరంగా ఉంటే మంచిది.

Leave a Comment