Heart Health: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ 6 పాటిస్తే చాలు

By manavaradhi.com

Published on:

Follow Us
heart health tips

మన శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో గుండె ఒకటి. ఇది శరీరంలోని అవయవాలకు రక్తాన్ని పంప్ చేస్తుంది. దీంతో అవయవాలు సరిగ్గా పనిచేస్తాయి. అయితే ప్రస్తుత తరుణంలో అస్తవ్యస్తమైన మన జీవన విధానంతోపాటు పలు ఇతర కారణాల వల్ల మనకు గుండె జబ్బులు వస్తున్నాయి. చాలా మంది హార్ట్ ఎటాక్‌ల బారిన పడి చనిపోతున్నారు. అయితే గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే.. మన జీవన విధానాన్ని పూర్తిగా మార్చుకోవాలి.

నిత్యం వ్యాయామం చేయడం, సరైన పౌష్టికాహారం తీసుకోవడం చేయాలి. కేవలం 30 నిమిషాల పాటూ, ఎరోబిక్స్ వ్యాయామాలను చేయటం వలన లేదా 10 నుండి 15 నిమిషాలు సైకిల్ తొక్కటం వలన పూర్తి ఆరోగ్యంతో పాటూ, గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మన చిన్న గుండెకు మేలు చేసే సులువైన మరియు మంచి ప్రభావితమైన వ్యాయామంగా వాకింగ్ ను పేర్కొనవచ్చు. ఈ సులువైన వ్యాయామం వలన గుండె ఆరోగ్యమే కాకుండా, పూర్తి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

గుండె గనుక ఏదైనా వ్యాధి భారినపడితే అటువంటి సమయంలో శరీరంలోని మిగతా భాగాలకు అందవలసిన రక్తప్రసరణపై ప్రభావం చూపుతుంది. దీంతో వివిధరకాల అవయవాలు పనితనం మందగించి చతికిలపడతాయి. కాబట్టి గుండె జబ్బుల బారినపడకుండా నివారించుకోవటమే ఆరోగ్యం.

ఛాతీలో బరువుగా, మంటగానూ ఉండటం, ఊపిరి ఆడనట్లు అనిపించడం, చెమటలు పట్టడం, కళ్ళు తిరగడం, మాట తడబడటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే వైద్యుడ్ని సంప్రదించాలి. అధిక బరువు గుండె ఆరోగ్యానికి మంచిది కాదు. గుండె మరింత కష్టపడాల్సి వస్తుంది. కనుక ఆహార, వ్యాయామంతో బరువు పెరగకుండా చూసుకోవాలి.

 నూనెలు, కొవ్వులు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల గుండెకు ఎన్నో ఇబ్బందులు ఎదురౌతాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి. అలాగే తగినంత విశ్రాంతి తీసుకోవడం, ఎక్కువ ఒత్తిడి లేకుండా చూసుకోవడం లాంటి వాటి వల్ల గుండెకు హాని చేసే పరిస్థితులు మనకు దూరంగా పారిపోతాయి. అన్నింటికీ మించి ఎప్పటికప్పుడు వైద్యుల్ని సంప్రదిస్తూ, పూర్తి పరీక్షలు చేయించుకోవాలి.

గుండె ఆరోగ్యం కోసం ఎటువంటి అలవాట్లను మానుకోవాలి ?

  • గుండె జబ్బులు తలెత్తేందుకు ఒత్తిడి అనేది ప్రధాన కారణంగా వ్యవహరిస్తుందని ప్రపంచవ్యాప్తంగా కార్డియాలజిస్ట్ లు స్పష్టం చేస్తున్నారు. ఆరోగ్యకరమైన లైఫ్ స్టయిల్ ను పాటించే వాళ్ళలో కూడా ఒత్తిడి వలన గుండె జబ్బుల సమస్య కనిపించే అవకాశం ఉందని వెల్లడిస్తున్నారు. కాబట్టి, ఒత్తిడిని మేనేజ్ చేసుకునే విధానాలను తెలుసుకోవాలి.
  • యోగా లేదా మెడిటేషన్ ను సాధన చేయాలి. తద్వారా, ప్రాణాంతకమైన గుండె జబ్బుల నుంచి రక్షణ పొందవచ్చు. రోజులో కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చెయ్యాలి. ఇది గుండె జబ్బులను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు శరీర బరువు కూడా అదుపులో ఉంటుంది. పెరిగే బరువు గుండె మీద భారాన్ని పెంచుతుందనే విషయాన్ని మరిచిపోవద్దు.
  • కార్డియాలజిస్ట్ లు స్మోకింగ్ కు దూరంగా ఉండమని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే, స్మోకింగ్ వలన ఆరోగ్యం దెబ్బతింటుంది. గుండె జబ్బులు పెరుగుతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుంది. కాబట్టి, ఈ అలవాటుకు దూరంగా ఉండటం మంచిది.
  • వంశపారంపర్యంగా గుండె జబ్బులు ఉంటే ఇంకాస్త అప్రమత్తంగా ఉండాలి. 30 ఏళ్ళు దాటినప్పటి నుంచి రెండేళ్ళకోసారి హెల్త్ చెకప్ చేయించుకోవాలి

Leave a Comment