Expiry Tablets : ఎక్స్పైర్ అయిన మందులు వాడటం వల్ల వచ్చే సమస్యలు ఏంటి…?

By manavaradhi.com

Published on:

Follow Us

ఆలస్యం అమృతం విషం అంటూ ఉంటాం. ఏ ఔషధమైనా సరే ఆలస్యం అయితే కచ్చితంగా విషంగా మారుతుంది. అందుకే ఔషధాన్ని వాడే ముందు కచ్చితంగా సమయం ఉందా లేదా అనే విషయాన్ని చూసి తీసుకోవాలి. ఇలా సమయం అయిపోయిన ఔషధాలు వాడడం వల్ల అప్పటికప్పుడు వచ్చే సమస్యల విషయం పక్కన పెడితే, భవిష్యత్ లోనూ ఎన్నో సమస్యలు ఎదురౌతాయి. వీటిలో ప్రధానం చెప్పుకోవలసింది అలర్జీ సమస్యల గురించే. గడువు తీరిన మందులు వాడడం వల్ల మొదట ఎదురయ్యే సమస్య ఇదే. ఆ తర్వాత జీర్ణాశయం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ రెండూ కలిసి అనేక సమస్యలు సృష్టిస్తాయి. శరీరం మీద దురదలు రావడం, కడుపులో మంటగా ఉండడం, వాంతులు కావడం, విరేచనాలు కావడం లాంటి ఇబ్బందులు ఎదురౌతాయి. ఆ తర్వాత వీటి ప్రభావం లివర్ మరియు మూత్ర పిండాల మొదలౌతుంది. ప్రధానంగా ఆయా మందులు చేయాల్సిన పని చేయకుండా వ్యతిరేకంగా పని చేయడం ప్రారంభిస్తాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే అన్ని రకాల మందులు తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయనే నియమేం లేదు. ఒక్కో రకమైన మందులు ఒక్కో రకమైన ప్రభావాన్ని కలిగి ఉంటాయి. వీటిలో కొన్ని చిన్న పాటి సమస్యలే తప్ప పెద్దగా ఇబ్బంది కలిగించవు. మరికొన్ని మాత్రం ప్రాణాల మీదకు తీసుకొచ్చే ప్రమాదం ఉంది. అందుకే మందులను ఎంచుకుని వాడడం అత్యంత అవసరం.

  • కాలం చెల్లిన కొన్ని రకాల మందులు తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి. ఇలాంటి వాటిలో ప్రధానంగా చెప్పుకోవలసింది ఇన్సులిన్ గురించే. డయాబెటిక్ కు ఉపయోగించే ఈ ఔషధ రోగులకు ఓ విధంగా అమృతమనే చెప్పుకోవాలి. ఇది సమయం దాటితే అధోకరణకు గురై, వ్యతిరేక ప్రభావాన్ని చూపించడం మొదలు పెడుతుంది. ఇది తీవ్రమైన ప్రతికూల అనారోగ్య కారణాలకు దారి తీస్తుంది. అలాగే ఛాతీ నొప్పి లాంటి వాటి కోసం వాడే కొన్ని రకాల మందులు త్వరగా శక్తిని కోల్పోవడానికి కారణం అవుతాయి. టీకాలు వంటి జీవ సంబంధమైన ఉత్పత్తులు చాలా సమయాల్లో క్షీణతకు గురి చేస్తాయి. ప్రతి కూలమైన ప్రభావాన్ని మొదలు పెట్టి, ప్రాణాల మీదకు తీసుకురావడానికి కూడా ఆస్కారం ఉంటుంది.
  • టెట్రా సైక్లైన మరింత విష పూరితంగా మారే ప్రమాదం ఉంది. అయితే ఈ విషయంలో పరిశోధకుల మధ్య వివాదాలు ఉన్నాయి. కొందరు ఈ సమస్య తీవ్రత మరింత ఎక్కువ అని చెబుతుంటే మరి కొందరు మాత్రం అంత సమస్యాత్మకమైనవి కావని చెబుతున్నారు. మరికొంత మంది పాత మందులు బూజు పట్టినప్పుడు వాటిని ఎండలో పెట్ట, సమయం అయిపోలేదు కదా అని వాడుతూ ఉంటారు. ఇది కూడా ప్రమాదకరమే ఎండలో పెట్టిన ఔషధాలను, మరీ ముఖ్యంగా లేపనాల వంటివి అస్సలు వాడకూడదు. వీటిల్లో ఫంగస్ కారణంగా అవి శరీరం మీద తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపెడతాయి. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విధమైన మందులను వాడడం మంచిది కాదు.
  • దీంతో పాటు మాత్రలను వాడే ముందు కనీస జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. వాటికి చేతులు గానీ, ఇతర అంశాలు తగలకుండా చూసుకోవాలి. అదే విధంగా మాత్రలను ఆరుబయటే ఎక్కువ సేపు ఉంచడం మంచిది కాదు.

కాలం చెల్లిన మందులను పారేయడం తప్ప వేరే పరిష్కార మార్గం లేదు. అదే విధంగా ఔషధాలను నిల్వ చేసే విషయంలోనూ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. వేడి మరియు తేమ ఉండే ప్రదేసాలు మందులు నిల్వ చేయడానికి తగిన స్థలాలు కాదు. అదే విధంగా మందులు మరీ వేడిగా ఉండే కార్లలో గానీ, ఘనీభవన వాతావరణంలో గానీ ఎట్టి పరిస్థితుల్లో ఉంచరాదు. మందుల సీసా లేదా అట్ట మీద చూపిన విధంగా వాటిని దాచాలి. ఎప్పుడూ పిల్లలు మరియు పెంపుడు జంతువులకు దూరంగా ఉంచాలి. ముఖ్యంగా కాలం చెల్లిన ఔషధాలను దూరంగా పారేయాలే తప్ప, వాటిని కాల్చడం లేదా జనాల మధ్య పడేయడం మంచిది కాదు. మందులను తీసుకున్న తర్వాత ఒకటికి నాలుగు మార్లు వాటిని ఎంత వరకూ వాడాలనే విషయాన్ని చూడాలి. అదే విధంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నిపుణులైన వైద్యులు సూచించిన మందులనే తీసుకోవాలి. అదే విధంగా గుర్తించబడిన మందుల షాపుల్లో తప్ప, వేరే దగ్గర మందులను కొనుగోలు చేయరాదు. ఒక సమస్యకు మందులను కొంత కాలం వాడిన తర్వాత, అవి మిగిలి పోతే మళ్ళీ అదే మందులను వాడడం అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదు. అప్పటి పరిస్థితిని బట్టి వైద్యుని సూచన మేరకు సరైన మందులు వాడడం అత్యంత అవసరం. ప్రతి మందుకూ కొంత నిర్దిష్టమైన ఎక్స్‌పైరీ డేట్‌ ఉంటుంది. వాటిని ఆ తేదీ లోపే వాడుకోవాలి. అయితే కొన్నిసార్లు పొరపాటున గడువు తీరిన మందులనూ వేసుకుంటుంటారు. దీనికి పెద్దగా గాబరా పడాల్సిన పనేమీ లేదు. గడువు తీరిన మందులు అంత సమర్థంగా పనిచేయకపోవచ్చు గానీ ఇతరత్రా నష్టమేమీ ఉండదు.

Leave a Comment