cold and flu : జలుబు, జ్వరం నుండి త్వరగా విముక్తి పొందే మార్గాలు

By manavaradhi.com

Updated on:

Follow Us

వాతావరణ మార్పుల వల్ల విజృంభిస్తున్న రకరకాల వైరస్‌లు చాలాచోట్ల ఇంటిల్లిపాదిని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. జలుబు, ఫ్లూ రెండు వైరల్ ఇన్ఫెక్షన్ లే. గొంతు నొప్పి, ముక్కు కారటం, దగ్గు, అలసట, వంటివి రెండింటిలోనూ కనిపించే సాధారణ లక్షణాలు. నిజానికి సాధారణ జలుబు, ఫ్లూ జ్వరాలకు పెద్దపెద్ద వైద్యాలూ, చికిత్సలేం అవసరం లేదు. అలాగని మలేరియా, డెంగీ వంటి జ్వరాలను నిర్లక్ష్యం చెయ్యటానికి లేదు. సాధారణంగా జలుబు ఒక వారం పాటు బాధిస్తుంది, తర్వాత చాలా వరకూ దానంతట అదే తగ్గిపోతుంది. కాకపోతే ఉపశమనం కోసం ఆవిరి పట్టటం ముఖ్యం. దీనివల్ల తెమడ పల్చబడి తేలికగా బయటకు వచ్చేస్తుంది. అలాగే తరచుగా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు తప్పనిసరిగా నోటికి చేతి రుమాలు లేదా టిష్యూ పేపర్‌ అడ్డం పెట్టుకోవాలి. సాధ్యమైనంత ఎక్కువ సేపు విశ్రాంతి తీసుకోవాలి.

జలుబు మరియు ఫ్లూ నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని ఆహారాలను తీసుకోవాలి. అల్లంలో క్రిమినాశక తత్వాలు అధికంగా ఉంటాయి, ముఖ్యంగా కఫాన్ని తగ్గించే లక్షణాలను అధికంగా కలిగి ఉంటాయి. మరియు రోగ నిరోధక శక్తితత్వాలను అధికంగా కలిగి ఉండి, శ్వాసకోశ నాళాల ట్రాక్ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో మరియు శ్లేష్మం తగ్గించుటలో సహాయం చేస్తుంది. అలాగే తేనెలో క్రిమిసoహారక తత్వాలు, మరియు రోగ నిరోధక శక్తి తత్వాలు అధికంగా ఉంటాయి. నిమ్మకాయతో కలిపి తేనెను తీసుకోవడం అన్నీ విధాలుగా మేలును చేకూరుస్తుంది. మరియు శ్వాసకోశ నాళాల ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పట్టడంలో కీలకపాత్ర పోషిస్తుంది. తేనె కఫానికి మంచి విరుగుడుగా పని చేస్తుంది.

విటమిన్-సి లో అనేక రకాల ఆరోగ్య లక్షణాలు ఉనాయి. విటమిన్ సి ఉండే ఆహార పదార్ధాలను అధికంగా తీసుకునే వారు సాధారణంగానే రోగాలకు దూరంగా ఉండవచ్చు. వేడినీళ్లలో ఉప్పు కలిపి పుక్కిలించి ఉమ్మివేయడం ద్వారా జలుబు, ఫ్లూ సమయాల్లో ఉపశమనంగా ఉంటుంది. ఇది శ్లేష్మ స్థరాన్ని శుభ్రపరిచే దిశగా పనిచేస్తుంది. నెమ్మదిగా గొంతునొప్పి, ముక్కు దిబ్బడ తగ్గించడం లో కీలకపాత్ర పోషిస్తుంది.

జలుబు మరియు ఫ్లూ ల నుండి ఉపశమనం పొందుటకు ఎంత ప్రయత్నించినా, విశ్రాంతి లేనిదే ఫలితం పొందలేరు. రోజులో 6 నుండి 8 గంటల సమయం పాటూ పడుకోవటం వలన మంచి ఫలితాలను పొందవచ్చు. అంత సమయం పాటూ పడుకోవటం వలన శరీరం స్వతహాగా జలుబు మరియు ఫ్లూలను తగ్గించుకుంటుంది. వివిధ రకాల సమస్యలకు కూడా విశ్రాంతి ద్వారా ఉపశమనం పొందవచ్చు. ఫ్లూ జ్వరాలు రకరకాల ఫ్లూ వైరస్‌ల కారణంగా వస్తాయి. సాధారణంగా ఈ జ్వరాలు వాటంతట అవే తగ్గిపోతాయి. వీటికంటూ ప్రత్యేకించి చికిత్స అవసరం లేదు.

ఫ్లూ జ్వరంలో గొంతు నొప్పి ఉంటే ఉండొచ్చు. జ్వరం మాత్రం 101 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటుంది. ఒళ్లు నొప్పులు విపరీతంగా బాధిస్తాయి. చాలామందిలో ఈ లక్షణాలు రెండు మూడు రోజులు బాధించి, అవే తగ్గిపోతాయి. కాబట్టి మొదటి 2, 3 రోజులూ పెద్ద చికిత్సలేం అక్కర్లేదు. ప్యారాసెటమాల్‌ వంటివి తీసుకుంటే సరిపోతుంది. అయితే మూడు రోజుల తర్వాత కూడా బాధలు తగ్గకుండా వేధిస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

జలుబు, ఫ్లూ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వీటికంటూ …వీటికి ప్రత్యేకించి చికిత్స అవసరం లేదు. ఈ రెండూ చాలావరకూ వాటంతట అవే తగ్గిపోయేవే అయినా కొద్దిమందిలో ఫ్లూ సమస్యాత్మకంగా మారొచ్చు. అందుకని తేడా తెలుసుకుని, అవసరాన్ని బట్టి వైద్యులను సంప్రదించటం అవసరం.

Leave a Comment