మొటిమెలు ఇవి స్వేధ గ్రంధులకు సంబందించిన చర్మ వ్యాధి. ఇవి ముఖం పైనే కాకుండా మెడ, భుజము, ఛాతీ పైన కూడా వస్తాయి. ఇవి 70% నుడి 80% వరకు యువతలో కనిపిస్తాయి. యుక్త వయసులో హార్మోనులు ఆడవారిలో ఈస్ట్రోజన్ ప్రోజిస్ట్రాన్ మగవారిలో టెస్టో స్టిరాన్ లలో సమతుల్యం లోపించడం వలన వస్తాయి. చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం వలన వీటిని కొంతవరకైనా నివారించవచ్చు.
మొటిమెలు చిన్నవి పెద్దవి అని రెండు రకాలుగా ఉంటాయి. చిన్నవిగా ఏర్పడే మొటిమెలు యవ్వనంలో కొంతకాలంపాటు కనిపిస్తాయి. వీటివలన ఎలాంటి బాధ ఉండదు. వీటి వలన వచ్చిన మచ్చలు కూడా ఏమి కనిపించవు. కానీ పెద్దగా ఏర్పడే మొటిమేలే చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. ఇవి నొప్పి దురదతో కూడి ఉంటాయి. వీటి వలన నల్లని మచ్చలు ఏర్పడతాయి. ముఖంపైన ఉండే నూనె గ్రంథులు చర్మంలోని వెంట్రుకల కుదుళ్లలో ఉండి యుక్త వయస్సులో ఇవి ఎక్కువ జిడ్డును తయారు చేస్తాయి. ఈ వెంట్రుకల కుదుల్ల రంద్రాలు మూసుకుపోవడం వలన వాతావరణంలో ఉండే సూక్ష్మ జీవుల వలన ఇన్ఫెక్షన్ కు గురై పుండుగా మారతాయి. ఈ మొటిమెలను చీదపడం, గోకడం వలన గోళ్ళనుండి ఇన్ఫెక్షన్ అయి ఎక్కువగా బాదపెడతాయి.
మొటిమెలు కౌమార దశలోకి ప్రవేశించే అమ్మాయిలను, అబ్బాయిలను వేధిస్తుంటాయి.ఇవి రావడానికి చాలా కారణాలున్నాయి.
- హార్మోన్లలో చోటుచేసుకునే మార్పులు
- చర్మంలో నూనె గ్రంథుల పనితీరు
- బాక్టీరియల్ ఇన్ఫెక్షన్
- PCOD (పాలిసొస్టిక్ ఓవరీస్) సమస్య
- గర్భనిరోధక మాత్రలు
- క్షయకు వాడే మందులు మొదలైన వాటి వలన మొటిమేలు వస్తాయి.
- ఇంకా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారిలో , అయిలీ స్కిన్ ఉన్నవారిలో కూడా ఇవి వస్తాయి.
మొటిమేలు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు వీటిని గిల్లడం , గట్టిగా తుడవడం చేయకూడదు. తాజాగా ఉన్న ఆకుకూరలు , పండ్లను తీసుకోవాలి. నిలువ ఉంచిన ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి. మార్కేట్లో లభించే రకరకాల ఫేస్ క్రీములను, లోషన్ లను వైధ్యుల సలహా లేకుండా వాడకూడదు. తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి
మొటిమలు త్వరగా నయం కావడానికి కొన్ని రకాల పిల్స్ లేజర్స్ ఇపుడు అందుబాటులోకి వచ్చాయి. మొటిమలు మానిన తర్వాత వాటి స్థానంలో గుంటలు ఏర్పడతాయి. వీటిని నివారించడానికి లేజర్, డెర్మరోలర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇలా ఏర్పడిన గుంటల్ని పూర్తిగా నివారించాలంటే ముందుగా పింపుల్స్ ని పూర్తిగా నివారించాలి. వీటిని తగ్గించడానికి రెండు-మూడు రకాల లేజర్ చికిత్సలు ప్రక్షానల్ సి 2, ఆర్బియమ్ గ్లాస్, ఎన్డ్యాగ్, ఐ పి ఎల్ లాంటివి అందుబాటులో ఉన్నాయి. ఈ చికిత్సను నెలకు ఒక్కసారి 3 లేదా 4 విడతల్లో చేస్తారు.
చూడడానికి మొటిమలు చిన్నగానే ఉంటాయి కానీ, యుక్త వయస్సు పిల్లలను తెగ ఇబ్బంది పెడతాయి.
సౌందర్యపరంగానే కాదు..ఇవి మానసికంగానూ వేధిస్తుంటాయి. అందుకే ముఖంపైన ఒక్క మొటిమ ఉన్న వెంటనే చాలామంది గిల్లేస్తుంటారు కానీ అలా గిల్లడం వలన సమస్య మరింత పెద్దది అవుతుంది. అలా కాకుండా ముఖం పై పింపుల్స్ వచ్చిన వెంటనే కొన్ని జాగ్రత్తలు పాటించడం అలవాటు చేసుకోవాలి. ముఖం పై నూనె లేదా జిడ్డుగా ఉండే ఎలాంటి పదార్థాలను రాయకూడదు. అలాంటి వాటిని రాసినప్పుడు అవి చర్మంలోని నూనె గ్రంథులు మూసుకుపోయేలా చేసి మొటిమెలను ఎక్కువగా ఉన్న వారిలో నూనె గ్రంథులున్న మార్గంలో అధికంగా నూనె పేరుకుపోవడం వలన పసుపు రంగులో గాని, నల్లగా గాని ముఖంపై చిన్న బుడిపెలు (బ్లాక్ హెడ్స్) ఏర్పడతాయి. వీటిని గిల్లితే మొటిమెల సమస్య ఇంకా ఎక్కువగా బాధిస్తుంది.
చాలామంది పింపుల్స్ తగ్గడానికి మందులను వేసుకుంటారు కానీ, వాటిని మధ్యలోనే ఆపేస్తుంటారు. ఇలా చేయడం మంచి పద్దతి కాదు. డాక్టర్ గారి సలహా మేరకు మందులను క్రమం తప్పకుండా వేసుకుంటె మంచి ఫలితం ఉంటుంది. ఇంకా తినే ఆహార పదార్థాలపైన కూడా శ్రద్ధ వహించాలి. పింపుల్స్ తో బాధపడేవారు కాఫీ, టీ లకు దూరంగా ఉండాలి. ముఖాన్ని ఎప్పటికప్పుడు శుభ్రపర్చుకుంటుండాలి. చాలామంది పింపుల్స్ ను సూదు, పిన్నులతో పొడుస్తుంటారు. ఇలా చెయ్యడం వలన వాటిలో ఉన్న బాక్టీరియా ఇతర ప్రాంతాలకు విస్తరించే ప్రమాదం ఉంది. అందుకే అలాంటి వాటికి దూరంగా ఉండాలి.