తులసి మొక్కకు హిందువుల ఇండ్లలో చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఉదయాన్నే తులసి మొక్క చుట్టూ ప్రదిక్షణలు చేసి ఒక ఆకును తీసుకోవడం చూసే ఉంటాం. నిత్యం ఒక తులసి ఆకు తినడం వల్ల మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుందని కూడా పలు పరిశోధనల్లో తేలింది.
తులసి తీర్థం లేదా తులసి రసం భారతీయ సాంప్రదాయంలో ప్రముఖ స్థానాన్ని కలి ఉంది. దీన్ని సర్వరోగ నివారణిగా భావిస్తారు. వాతావరణ కాలుష్యాన్ని నివారించి, ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో గొప్పగా పనిచేస్తుంది. తులసి మొక్కలు 5 జాతులు ఉన్నప్పటికీ ప్రధానంగా కృష్ణ తులసి, రామతులసీ నే ఎక్కువగా వాడుతుంటారు. ల్యూకోడెర్లాలో ప్రకృతి వైద్యులు తులసికి మొదటి ప్రాధాన్యతనిస్తారు. చరక సంహితంలోనూ, అంతకంటే పురాతనమైన ఋగ్వేదంలోనూ కూడా తులసి ప్రస్తావన ఉంది.
తులసిని ఇంకా చాలా గృహ వైద్యంచిట్కాలలో కూడా వాడుతారు. దీని ఔషధీగుణంపై మరింత పరిశోధనలు జరుగుతున్నాయి. అనేక ఆధునిక ఔషధాలలో కూడా తులసిని ప్రస్తుతం వినియోగిస్తున్నారు. శరీరంలో వివిధ ప్రక్రియలను సమతుల్యం చేసే ప్రభావం ఉన్న అడాప్టోజెన్గా తులసిని గుర్తించారు. అందుకని మానసిక వత్తిడిని తగ్గించే ప్రభావం, ఆయుర్వృద్ధి కలిగించే ప్రభావం తులసిలో ఉన్నాయంటున్నారు ఆయుర్వేద వైద్యనిపుణులు.
తులసిలో అనేక పోషకాలు, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఇందులో దాగున్నాయి. గర్భిణీ స్త్రీలకు ఇది మరింత శ్రేయస్కరం.ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే క్రిమీ కీటకాలను నాశనం చేసే పవర్ తులసిలో ఉంది. తులసి ఆకులు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు కలిగి ఉన్నందున అనేక రకాల వ్యాధులు నయం చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. తులసి లో ఉండే డిటాక్సిఫైయింగ్ లక్షణాలు.. గుండె, ఊపిరితిత్తులను విషపూరిత పదార్థాల నుంచి రక్షిస్తుంది. టిష్యులను క్లీన్ చేస్తుంది.
తులసి ఆకులతో చేసిన టీ తాగడం వలన కెఫిన్ శరీరంలోకి చేరదు. ఈ టీలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల గర్భధారణ సమయంలో ఎలాంటి వ్యాధులు, ఇన్ఫెక్షన్స్ సోకకుండా నివారిస్తాయి. ఫ్రీరాడికల్స్ ను న్యూట్రలైజ్ చేస్తాయి. దాంతో ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉంటుంది.
గర్భధారణ సమయంలో గర్భిణీలో అనేక సమస్యలుంటాయి. ముఖ్యంగా జాయింట్ పెయిన్, మజిల్ పెయిన్స్ , బాడీ పెయిన్స్ చాలా బాధిస్తాయి. వీటిని నివారించడంలో తులసి టీ గొప్పగా సహాయపడుతుంది . తులసి టీని నిత్యం తీసుకోవడం వల్ల వీక్ బోన్స్, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. అలాగే గర్భిణీల్లో హ్యాపీ హార్మోన్స్ విడుదల చేసి ఒత్తిడి లేకుండా చేయడంలో గొప్పగా ఉపయోగపడుతుంది. తులసిలోని ఇమ్యునోమోడ్యులేటరి గుణాలు రోగ నిరోధకశక్తిని తిరిగి పొందడంలో తోడ్పడతాయి. జీర్ణశక్తిని పెంచడంలో, దగ్గు, కఫం తగ్గించడంలో, ఉబ్బసం సమస్య తీవ్రతరాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
తులసి .. హిందూ కుటుంబాలకు మాత్రమే పవిత్ర మొక్క కాదు. ఈ వనమూలిక మొక్క ప్రతి ఇంటిలో కలిగి ఉంటే ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరమైనట్టే అని సెలవిస్తున్నారు నిపుణులు. సో.. నిత్యం తులసి ఆకు తినండి.. ఆరోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా జీవించండి.