zumba dance: జుంబా డాన్స్‌ చేస్తూ.. సులభంగా బరువు తగ్గేయండి..!

By manavaradhi.com

Updated on:

Follow Us
zumba benefits for health

ఇటీవలి కాలంలో జుంబా డ్యాన్స్ అంటే క్రేజ్ పెరుగుతోంది. ఎప్పుడూ ఒకే రకం వ్యాయామాలు చేసి బోర్ కొట్టినవారంతా.. ఇప్పుడు జుంబా డ్యాన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. శ్రమపడినట్టు తెలియకుండానే శరీరానికి అవసరమైనంత వ్యాయామం అందిస్తుందీ జుంబా డ్యాన్స్. పైగా ఆరోగ్యం మెరుగుపడేలా కూడా చేస్తుంది. అందుకే ఇటీవలి కాలంలో జుంబా డ్యాన్స్ పై ఆసక్తి చూపుతున్నవారు క్రమంగా ఎక్కువ అవుతున్నారు.

ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో యూత్‌ ప్రతీది వెరైటీగా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఫాస్ట్‌ బీట్‌ మ్యూజిక్‌ మధ్య హుషారుగా చేసే జుంబా నృత్యం పట్ల యూత్‌ ఎంతో ఆకర్షితులవుతున్నారు. జుంబా నృత్యం చేస్తే ఏరోబిక్స్‌ మాదిరిగా ఫ్యాట్‌ బాగా తగ్గుతుందని ఫిట్‌నెస్‌ నిపుణులు సెలవిస్తుండడం విశేషం. జుంబా డాన్స్ ఏరోబిక్స్ ను పోలిఉంటుంది… అదే విధంగా ఎరోబిక్స్ ఎక్సర్ సైజ్ లా, ఇది పూర్తి శ్వాస తీసుకోవడానికి బాగా సహాయపడుతుంది. అందువల్ల బరువు తగ్గుతారు. అంతే కాదు ఇది ఊపిరితిత్తుల పవర్ ను కూడా పెంచుతుంది.

జుంబా డ్యాన్స్ బరువు సులభంగా తగ్గించడమే కాదు, శరీరంలో అన్ని అవయవాలు కదిలేలా చేస్తాయి. కండరాలు బలంగా ఉండేలా సహాయపడుతాయి. రెగ్యులర్ గా ఈ డ్యాస్ చేయడం వల్ల వయస్సు మీద పడనియ్యకుండా కాపాడుతుంది. జుంబా డ్యాన్స్ వల్ల శరీరంలో ప్రతి పార్ట్ నుండి క్రొవ్వును కరిగిస్తాయి. ఈ డ్యాన్స్ నేర్చుకోవాలనుకొనే వారు, ట్రైనర్ వద్దకు ఒంటరిగా వెళ్ళడం కంటే చాలా మంది ఉన్నప్పు వెళ్ళడం మంచిది. ఎందుకంటే ఈ డ్యాన్స్ చాలా తమాషాగా ఉంటుంది కాబట్టి మీరు బాగా ఎంజాయ్ చేయవచ్చు.

జుంబాడ్యాన్స్ ను కనీసం 45నిముషాల తప్పనిసరిగా చేయాలి . అప్పుడు మంచి ఫలితం ఉంటుంది. జుంబాడ్యాన్స్ వ్యాయామం వంటిదే. కాబట్టి ఆరోగ్యపరంగా మీకేదైన సమస్య ఉన్నప్పుడు డ్యాన్స్ కు వెళ్ళడానికి ముందు డాక్టర్ ను సంప్రదించిన తర్వాత చేరండి.

బరువు తగ్గడానికి జిమ్‌కి వెళ్లి పెద్ద పెద్ద బరువులు ఎత్తి శరీరాన్ని శ్రమ పెట్టాల్సిన అవసరం లేకుండానే.. సరదాగా డ్యాన్స్ చేస్తూనే క్యాలరీలను కరిగించుకోవచ్చు. పైగా జుంబా డ్యాన్స్‌ను గ్రూప్‌తో కలసి చేస్తాం కాబట్టి.. అలసటే తెలియకుండా ఎంతసేపైనా డ్యాన్స్ చేయగలుగుతాం. రోజులో ఒక గంట డ్యాన్స్ చేయడం ద్వారా 500 నుంచి 1000 క్యాలరీల వరకు ఖర్చవుతాయి. జుంబా డ్యాన్స్ చేస్తున్నప్పుడు తల నుంచి పాదాల వరకు ప్రతి అవయవం కదులుతుంది. కాళ్లు, చేతులు, భుజాలు, నడుము, పాదాలు, తల, మెడ.. అసలు కదలని భాగం అంటూ ఉండదు.

జపింగ్, స్క్వాటింగ్, స్లైడింగ్.. లాంటివి చేస్తుంటాం కాబట్టి పూర్తి శరీరానికి వ్యాయామం అందుతుంది. పైగా దీనిలో డ్యాన్స్‌తో పాటు ఏరోబిక్స్ కూడా కలిసి ఉంటాయి. దీని వల్ల శరీరం చాలా ఫ్లెక్సిబుల్‌గా తయారవుతుంది. కొన్ని రోజులు జుంబా డ్యాన్స్ కంటిన్యూ చేస్తే ప్రొఫెషనల్ డ్యాన్సర్ అయిపోవడం ఖాయం.

ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా అందరిలోనూ ఒత్తిడి భారం అధికమవుతోంది. జుంబా డ్యాన్స్ చేయడం ద్వారా ఒత్తిడిని సులభంగా అధిగమించవచ్చు. ఎందుకంటే ఇది ఫిజికల్ ఎక్సర్సైజ్ మాత్రమే కాదు. మెదడుకి కూడా ప్రశాంతతను అందిస్తుంది. సంగీతం, డ్యాన్స్ రెండూ మనలోని ఒత్తిడిని తగ్గిస్తాయి. జుంబాలో సంగీతం, డ్యాన్స్ రెండూ ఉంటాయి. కాబట్టి ఒత్తిడి చిటికేసినట్టుగా మాయమవుతుంది. అంటే మానసికంగా మన ఆరోగ్యం మెరుగుపడుతుంది.

జుంబా డ్యాన్స్ తో మెదడు షార్ప్‌గా తయారవుతుంది. వినడానికి విడ్డూరంగానే ఉన్నా ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే ట్రైనర్‌ని చూస్తూ స్టెప్పులేయడంతో పాటు వాటిని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది మేధో వికాసాన్ని పెంచుతుందట. ఈ విషయం కొన్ని అధ్యయనాల్లో సైతం రుజువైంది. రోజూ క్రమం తప్పకుండా జుంబా చేసే వారిలో జ్ఞాప‌క‌శ‌క్తి మెరుగు పడటంతో పాటు నిర్ణయం తీసుకొనే సామర్థ్యం సైతం మెరుగుపడిందని తేలింది.

జుంబా డ్యాన్స్ చేయడం వల్ల బరువు మాత్రమే తగ్గుతామనుకొంటే పొరపాటే. ఎందుకంటే ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జుంబా డ్యాన్స్‌లో భాగంగా మీరు చేసే మూవ్స్ కార్డియో ఎక్సర్సైజెస్ మాదిరిగా పనిచేస్తాయి. వీటి వల్ల గుండె కండరాలు ఆరోగ్యంగా తయారవుతాయి.

జుంబా డ్యాన్స్ చేస్తున్నప్పుడు శరీరం మొత్తం కదలుతుంది. ఇలా వేగంగా కదలడం వల్ల బాడీ టోనింగ్ అవడం మాత్రమే కాకుండా.. కండరాలన్నీ దృఢంగా తయారవుతాయి. ముఖ్యంగా పొట్ట కండరాలు, తొడ కండరాలు, చేతి కండరాలు బలంగా తయారవుతాయి.

జుంబా డ్యాన్స్ చేయడం వల్ల చెమట అధికంగా పడుతుంది. దీని వల్ల నీరు ఎక్కువగా తాగాల్సిన అవసరం ఏర్పడుతుంది. నీరు తాగడం వల్ల మొటిమలు, ర్యాషెస్ వంటివి రావడానికి కారణమైన టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి. కాబట్టి మొటిమలు రావు. రోజులో 30 నిమిషాలు జుంబా డ్యాన్స్ చేయడం ద్వారా చర్మంలో వచ్చే మార్పును కచ్చితంగా మీరు గుర్తిస్తారు.

జుంబా డ్యాన్స్ చేయడం వల్ల శరీరంలోని ప్రతి భాగానికి రక్తం సరఫరా అవుతుంది. దీని వల్ల శారరీక ఆరోగ్యంతో పాటు వ్యాధి నిరోధక శక్తి సైతం పెరుగుతుంది. జుంబా చేయడం ద్వారా అధిక రక్తపోటుతో పాటు ఇతర లైఫ్ స్టయిల్ డిసీజెస్ సైతం తగ్గుముఖం పడతాయి.

జుంబా డ్యాన్స్ వల్ల శరీరంలో ప్రతి భాగంలో కదలికలు ఉంటాయి. ఫాస్ట్ బీట్ డ్యాన్సింగ్ వల్ల ..ఫన్నీ యాక్టివిటీ వల్ల బాడీ ఫిట్ గా మరియు స్ట్రెస్ ఫ్రీగా ఉండగలుగుతారు. జుంబాడ్యాన్స్ వ్యాయామం వంటిదే. కాబట్టి ఆరోగ్యపరంగా మీకేదైన సమస్య ఉన్నప్పుడు డ్యాన్స్ కు వెళ్ళడానికి ముందు డాక్టర్ ను సంప్రదించిన తర్వాత చేరండి.

Leave a Comment