ఏపి రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తే 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సీఎం కావడం ఖాయం కనిపిస్తుంది. 2024 ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కావాలని, సీఎం కావాలని అయనను అభిమానించే ప్రతిఒక్క అభిమాని మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. టీడీపి అధ్యక్షుడు చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాష్ట్రంలో రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. తెలుగు దేశం – జనసేన పార్టీలు కూటమిగా 2024 ఎన్నికల్లో విజయమే లక్షంగా ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో అధికార పార్టీపై ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారు.. నాలుగు సంవత్సరాల జగన్ పాలనలో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు… స్వంత పార్టీ ఎమ్మేల్యేల్లో సైతం ఇదే భావనలో ఉన్నారు. తెలుగు దేశం – జనసేన కూటమిగా పోటీ చేస్తే అధికారంలోకి రావడం పక్కగా కనిపిస్తుంది. దీంతో అధికార పార్టీ నేతల్లో గుబులు మొదలైంది అని చెప్పాలి. అందుకే సింహాం సింగిల్ గా వస్తుంది.. దంమ్ముంటే మీరు అలాగేరాండి…. అంటూ హాడావిడి చేస్తున్నారు.
2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడం వల్లనే టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆ విషయం అందరికీ తెలుసు. అయితే.. టీడీపీ అధికారంలోకి రావడం వల్ల పవన్ కళ్యాణ్ కు జరిగిన మేలు ఏమిలేదు. తానుకూడా ఏపదవి ఆశించకుండా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం తన భవిష్యత్ కూడా పణంగా పెట్టారు. తెలుగు దేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు చేసిన తప్పును తప్పుగానే ఖండించారు. ఆవిధంగానే వారి మీద పోరాటం చేశారు. 2019 ఎన్నికల్లో జనసేన సొంతంగా పోటీ చేసింది. అయినప్పటికీ అటు టీడీపీ, ఇటు జనసేన రెండూ ఓడిపోయాయి. వైసీపీ గెలిచింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాదిరిగా ఎప్పుడు జనసేనాని కుల రాజకీయాలు చేయలేదు. అందుకే విభిన్న కులాలు, మతాల నుంచి జనసేన సభ్యులను తీసుకున్నారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా నిలదొక్కుకోవడమే గొప్ప విషయం.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి 8 ఏళ్లు పూర్తయ్యాయి. తాను రాజకీయాల్లోకి వచ్చింది అధికారం కోసం కాదు.. పాతికేళ్లపాటు ప్రజల పక్షాన నిలబడి పోరాడటానికి అంటూ ఆయన జనసేనతో ప్రజా జీవితాన్ని ప్రారంభించారు. జనసేనాని పవన్ కళ్యాణ్ తాను అనుకున్న విలువలను రాజకీయం గా పాటించడంతో ఆయనకు గ్రౌండ్ లెవెల్ లో అనేక వ్యతిరేక ఫలితాలు కనిపించాయి. అయినా ఆయన ఎక్కడా నిరుత్సాహ పడలేదు. తాను గొప్పగా చెప్పిన జీరో బడ్జెట్ పాలిటిక్స్ వల్ల కనీసం తాను కూడా గెలవలేదు అయిన ఎక్కడా వేనకడుగు వేయలేదు జనసేనాని. పవన్ ఇంతవరకు పరిపాలన చేయలేదు కాబట్టి ప్రజలు కూడా ఆయన సీఎం కావాలని ఆశిస్తున్నారు.
Jai janasen… Jai Pawan Kalyan
Jai janasena