Chiranjeevi – చిరంజీవి సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ తీయనున్న స్టార్ డైరెక్టర్

By manavaradhi.com

Updated on:

Follow Us

ప్రస్తుతం టాలీవుడ్‌ లో పవర్ ఫుల్ డైలాగ్స్ రాసి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న అగ్ర దర్శకులలో త్రివిక్రమ్ శ్రీనివాస్‌ (Trivikram Srinivas)ఒకరు. తన పంచ్‌ డైలాగులతో విమర్శకులతోపాటు అనేక మంది ప్రశంసలు కూడా పొందాయి. అలాంటి త్రివిక్రమ్ తన నటన, డ్యాన్స్ లతో ప్రేక్షకులను ఉర్రూతలూగించే మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్‌లో సినిమా వస్తే.. ఇంకేముంది సినీ ప్రియులకు అది ఓ పెద్ద పండగే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ వార్త టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది. ఈ వార్త విన్న అభిమానులైతే తెగసంబరపడిపోతున్నారు. గతంలో కూడా వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా వచ్చింది … అదేలేండి చిరంజీవి నటించిన ‘జై చిరంజీవ’ సినిమాకు త్రివిక్రమ్‌ మాటలు రాశారు. ఆ తర్వాత మళ్లీ వీళ్లిద్దరూ కలిసి పనిచేయలేదు. కానీ ఇప్పుడు ఆయనదర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేయనున్నారట. అదికూడా వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ఓ సీక్వెల్‌ సినిమా రానుందని నెట్టింట తెగ హల్ చెల్ చేస్తుంది.

అది కూడా మామూలు సినిమాకాదండోయో… అప్పట్లో చిరంజీవి సినీ కెరీర్‌ను మలుపు తిప్పిన ‘ఖైదీ’ సినిమా సీక్వెల్‌ కోసం వీళ్లిద్దరూ కలిసి వర్క్‌ చేయనున్నారట. ‘పగ తీర్చుకోవడం కోసం ఈ జన్మ ఎత్తాను. ప్రేమ కోసం మరోజన్మ ఎత్తుతాను. అప్పుడు కలుసుకుందాం’ అనే డైలాగుతో ‘ఖైదీ’ సినిమా ముగుస్తుంది. ఇప్పుడు ఇదే లైన్‌ను స్టోరీగా తీసుకుని ఒక సినిమా ప్లాన్‌ చేయనున్నారట. దీని సీక్వెల్‌కు చిరంజీవి కూడా ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. ఇటీవలే ఈ విషయంపై చిరు, త్రివిక్రమ్‌ కలిశారట. ‘ఖైదీ’ సీక్వెల్‌ బాధ్యతను త్రివిక్రమ్‌కు అప్పజెప్పారట మెగాస్టార్‌. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే వార్త వైరల్ అవుతోంది.

ప్రస్తుతం త్రివిక్రమ్ ‘గుంటూరు కారం’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత అల్లు అర్జున్‌తో ఒక సినిమా లైన్‌లో ఉంది. అయితే అల్లు అర్జున్ అట్లీతో సినిమా చేస్తున్నాడు అందుకే త్రివిక్రమ్ ఆ ఖాళీ గ్యాప్‌లో చిరంజీవితో వర్కౌట్ చేయాలని చూస్తున్నాడు. ఇక మెగాస్టార్‌ విషయానికొస్తే ప్రస్తుతం రెండు ప్రాజెక్టులకు సైన్‌ చేశారు. ‘బింబిసార’ దర్శకుడు వశిష్ఠతో ఒక సినిమా చేయనున్నారు. ఫాంటసీ చిత్రంగా ఇది రూపొందనుంది. అలాగే ‘గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ పతాకంపై మరో సినిమా చేయనున్నారు. దీనికి కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. మరి వీరిద్దరి కాంబినేషన్ ఎంతవరకు ట్రాక్ ఎక్కుతుందో చూడాలి. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో చిరంజీవిని చూడాలని అభిమానులు కూడా తెగ ఆశపడుతున్నారు.

Leave a Comment