Cherry Benefits: చెర్రీ పండు తినడం ఇన్ని ప్రయోజనాల..!

By manavaradhi.com

Updated on:

Follow Us
Do Cherries Have Health Benefits

మన శరీర శ్రేయస్సుకు దోహదం చేసే రుచికరమైనవి ఆహారాలు ఎన్నో ఉన్నాయి. ఎర్రగా, ఎంతో అందంగా ఉండే చెర్రీ పండ్ల వల్ల కలిగే ప్రయోజనాలు కూడా ఎక్కువే. వీటిని తీసుకోవడం వల్ల అధిక బరువు, పొట్ట భాగంలోని కొవ్వు నుంచి విముక్తి పొందవచ్చు. మధుమేహం, మెదడుకు సంబంధించిన వ్యాధులను నియంత్రించడంలో చెర్రీ బాగా ఉపయోగపడుతుంది.

చెర్రీపండ్లు కేవలం రుచికి మాత్రమే కాదు, వీటిలో అనేక రకాలైన పోషకాలు కూడా మనకు విరిగా లభిస్తాయి. చెర్రీ పండ్లు మన ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా పలు అనారోగ్య సమస్యలను సులభంగా నయం చేసుకోవచ్చు. ఉబకాయం రాకుండా చెర్రీ పండ్లు ఎంతో దోహదపడుతాయి. చెర్రీ పండ్లు తినడం ద్వారా రక్తంలో కొలెస్ట్రాల్‌ పెరగకుండా నివారిస్తుంది.

చెర్రీ పండ్లలో అపారంగా ఉండే యాంటి ఆక్సిడెంట్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. చెర్రీ పండ్లలో సమృద్ధిగా ఉండే విటమిన్ సి శరీర రోగ నిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూస్తుంది. అలాగే చెర్రీ పండ్లలో ఉండే మెలటోనిన్ నొప్పులు, వాపులను తగ్గిస్తుంది.

చెర్రీ పండ్లలో ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. వయస్సు మీద పడడం కారణంగా వచ్చే మతిమరుపు, అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. చెర్రీ పండ్లలో ఆంథోసయనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటుంది. కనుక కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి.

చెర్రీ పండ్లలో పుష్కలంగా ఉండే మెలటోనిన్ మనకు ఉండే నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది. నిద్ర చక్కగా పట్టేలా చేస్తుంది. గుప్పెడు చెర్రీ పండ్లను తింటే నిద్ర సమస్యలు పోతాయి. చెర్రీ పండ్లలో ఫైటోస్టెరాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. దీంతో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. రక్త నాళాలు గట్టిపడకుండా ఉంటాయి.

చెర్రీ పండ్లలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అందుకే వీటికి చాలా ప్రాముఖ్యతనిస్తుంటారు వైద్యులు. అనేక రుగ్మతలను పారదోలడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. చెర్రీ పండ్లలో క్యాన్సర్ మహమ్మారిని రాకుండా చేసే యాంటీఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్ ఉన్నాయి. చెర్రీ పండ్లలో సమృద్ధిగా ఉండే పీచుపదార్థం జీర్ణ సమస్యలను పోగొడుతుంది. ముఖ్యంగా మలబద్దకం సమస్య రాకుండా చూస్తుంది.. చెర్రీ పండ్లను నేరుగా కాకున్నా .. ఇతర ఆహార పదార్థాలతో కలిపి కూడా తీసుకోవచ్చు.

ఎండ్ యాంకర్: చాశారుగా చెర్రీ పండ్లు తినడం వల్ల వృద్ధాప్యఛాయలు దరిచేరవు. గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచడంలో చెర్రీకి మించింది లేదు. కండరాల నొప్పుల నుంచి త్వరగా ఉపశమనం పొందాలంటే వీటిని తప్పకుండా తీసుకోవాల్సిందే…

Leave a Comment