Jr Ntr : జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ టీడీపీ రాజకీయం …!

By manavaradhi.com

Updated on:

Follow Us

మరి కొద్ది నెలల్లో ఏపిలో ఎన్నికలు జరగునున్నాయి .. ఇలాంటి తరుణంలో తెలుగు దేశం పార్టీకి ఊహించని కష్టలు వచ్చిపడుతున్నాయి. పార్టీలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎవరు ఊహించని విధంగా స్కిల్‌డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో అరెస్ట్‌ కావడం ఆవెను వెంటనే జైలుపాలు కావడంతో పార్టీలో గందరగోళం ఏర్పడింది. ఆయన అరెస్ట్‌ దాదాపు నెల రోజులు కావస్తుంది.. ఇప్పటికి ఎప్పుడు బయటకు వస్తారనే దానిపై క్లారిటీ లేకపోవడంతో టీడీపీని లీడ్ చేసేదేవరు అనే చర్చ జనాల్లో జోరుగా సాగుతోంది. పార్టీని చూసుకోవడానికి లోకేష్ ఉన్నాడుగా అంటే… ఆయన చుట్టూ కూడా స్కామ్ ల బెడద అలుముకుంటోంది. ఆయనను కూడా ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.

ప్రస్తుతం టీడీపి ఉన్న పరిస్థితుల్లో నారా బ్రహ్మణిని బరిలోకి దించితే మేలు అని పార్టీలో చర్చ జరుగుతుంది. అందుకు అనుగుణంగానే ఆ పార్టీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు కూడా అదే విషయాన్ని ఇటీవల స్పష్టం చేశారు. లోకేశ్ కూడా అరెస్ట్ అయితే నారా బ్రహ్మణి పార్టీని ముందుండి నడిపిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. అంతే కాదు తెలుగు దేశం పార్టీలోని సీనియర్ నేతలంతా కూడా నారా బ్రహ్మణి నాయకత్వానికే జై కొడుతున్నాంరంట. అయితే అందుకు భిన్నంగా మరి కొన్ని వాదనలు కూడా పార్టీలో వినిపిస్తున్నాయి. ఒక వర్గం మాత్రం జూ.ఎన్టీఆర్ పార్టీ బాద్యతలు స్వీకరించాలని గట్టిగా కోరుకుంటున్నారు. ఎందుకంటే తెలుగు దేశం పార్టీకి కష్టకాలంలో తన మద్దతు ఎప్పుడు ఉంటుందని ఎన్టీఆర్ (Jr Ntr ) గతంలో చాలసార్లు స్పష్టం చేశారు. ఇప్పుడు ఆవిషయాన్ని తెలుగు తమ్ముళ్ళు గుర్తుచేసుకుంటున్నారు.

ప్రస్తుతం టీడీపీ (TDP) పరిస్థితి దయనీయంగా మారింది. వైసీపీ అధినేత జగన్ వేసిన వ్యూహానికి టీడీపీ అధినేత చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఒక్కసారిగా పత్తాలేకుండా పోయింది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పార్టీ రాష్ట్రంలో మళ్ళీ బతకాలన్న, క్యాడర్ లో కొత్త ఉత్సాహం రావాలన్నా .. యువ నాయకులు కావాలంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఇప్పటికే 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ (Jr Ntr ) విస్తృత ప్రచారం చేశారు. ప్రచారానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు… టీడీపీ లోని ఓవర్గం నేతలు పార్టీలోకి రావడానికి ఇదే మంచి తరుణంగా భావిస్తున్నారు. ఏపి లో టిడిపి నీబతికించాలన్న తిరిగి పూర్వ వైభం తీసుకురావలన్నా అది ఒక్క జూనియర్ ఎన్టీఆర్ వల్లే సాధ్యం అని భావిస్తూ ఉన్నారు.

ఎన్టీఆర్ (Jr Ntr ) రాకను కొంతమంది సీనియర్ నేతలు బహిరంగంగానే వ్యతిరేకీస్తున్నట్లు తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ కూడా అంత సుముఖంగా ఉన్నట్లు కనిపించడంలేదు. దీంతో ఎన్టీఆర్ పార్టీలోకి రావడాన్ని సీనియర్ నేతలే అడ్డుకుంటున్నారనేది కొందరి అభిప్రాయం. ఆ కారణాల చేతనే ఎన్టీఆర్ చంద్రబాబు అరెస్ట్ పై ఇంతవరకు స్పందించలేదు అని చెబుతున్నారు. ఏది ఏమైనా ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీలోకి తిరిగి వస్తేనే పార్టీ బాగుపడుతుందని చాలా మంది ఆశిస్తున్నారు.

2 thoughts on “Jr Ntr : జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ టీడీపీ రాజకీయం …!”

Leave a Comment