ఆశ్వయుజ శుద్ధ చవితి, బుధవారము, తేది. 18.10.2023 శ్రీకనకదుర్గమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవి గా దర్శనమిస్తారు.
నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే |
శంక చక్ర గదా హస్తే మహాలక్ష్మి నమోస్తుతే॥
శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీకనకదుర్గమ్మవారు శ్రీమహాలక్ష్మీ దేవి గా దర్శనమిస్తారు. మంగళప్రదమైన దేవత ఈ మహాలక్ష్మీదేవి. జగన్మాత మహాలక్ష్మీ స్వరూపంలో దుష్టరాక్షస సంహారాన్ని చేయటం ఒక అద్భుత ఘట్టం. మూడు శక్తుల్లో ఒక శకైన శ్రీమహాలక్ష్మి అమితమైన పరాక్రమాన్ని చూపించి హాలుడు అనే రాక్షసుడిని సంహరించింది. లోక స్థితికారిణిగా ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మి సమిష్టిరూపమైన అమృతస్వరూపిణిగా శ్రీదుర్గమ్మ ఈరోజు మహాలక్ష్మీదేవిగా భక్తులను అనుగ్రహిస్తారు. శ్రీమహాలక్ష్మీ దేవి అమ్మవారిని దర్శించడం వలన భక్తులందరికీ ఐశ్వర్యప్రాప్తి, విజయము లభిస్తుంది.
ఈరోజు అమ్మవారు గులాబీ రంగు చీరలో దర్శనం ఇస్తారు. అమ్మవారికి తెల్ల కలువలతో పూజ చేస్తే మంచిది. క్షీరాన్నం, పూర్ణం బూరెలు నైవేద్యంగా పెట్టాలి. ఈరోజు దక్షిణ దానం చేస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుంది. మహాలక్ష్మీ దేవిని పూజిస్తే ధన ధాన్యాలకు లోటుండదు. విద్యా, సంతానం వరాలుగా పొందుతారు.