మన రాష్ట్రంలో అంత్యంత ప్రాముఖ్యమై దేవాలయాలు చాలానే ఉన్నాయి. అయితే ప్రతి దేవాలయానికి ఒక చరిత్ర ఉంటుంది. ఇలాంటి ఆలయాల్లో కాణిపాకం వినాయకుడి దేవాలయం ఒకటి.. ఈ ఆలయం యొక్క చరిత్ర, వాటివిశేషాలు ఏంటి? ఈ వినాయకుడి ఆలయాన్ని ఎవరు నిర్మించారు…? ఇక్కడ జరిగే నిత్యేపూజలు ఏంటి..? తదితర మరిన్ని విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం…
ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో వెలసిన ఆలయం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కాణిపాకం దేవాలయం. కాణిపాకం వద్ద బహుదా నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న భక్తులు వినాయకుడి గుడి అంటే ముందు గుర్తు వచ్చేది ముందుగా కాణిపాకం. కాణిపాకం క్షేత్రంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి స్వయంభూగా వెలశాడు. ఇక్కడ కొలువైన వినయకున్ని ఎవరు ప్రతిష్టించలేదు… అందుచేత ఈ ఆయలం స్వయంభూగా ప్రసిద్ధి చెందింది. తిరుమలకు వెళ్లే భక్తులు తప్పకుండా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని సందర్శించి తరిస్తారు.
కాణిపాకం క్షేత్ర స్థలపురాణం…
మనకు తెలిసిన చారిత్రక ఆధారాల ప్రకారం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయాన్ని సుమారు 1000 సంవత్సరాల క్రితం నిర్మించారు. విహారపురి అనే గ్రామంలో ధర్మాచరణ పరాయణులైన ముగ్గురు గుడ్డి, మూగ, చెవిటి వాళ్లుగా జన్మించారు. వారు తమకు ఉన్న కొద్ది పొలాన్ని వ్యవసాయం చేసుకుంటూ ఉండేవారు. అయితే ఒకసారి కరవు కాటకాలు వచ్చి.. ఎవ్వరికి తాగేందుకు మంచి నీళ్లు కూడ దొరకని పరిస్థితి దాపరించింది. అప్పుడు ఆ ముగ్గురు అన్నతమ్ములు తమ పొలం ఉన్న భావిని ఇంకాలోతుకు తవ్వి నీటిని తొడాలనుకున్నారు. అనుకున్నదే తడువుగా భావిన తవ్వుతుండగా ఓ పెద్ద బండరాయి అడ్డుపడింది. దాన్ని తొలగించే యత్నంలో పార రాయికి తగిలి రాయి నుంచి రక్తం వచ్చింది. రక్తం అంగవైకల్యంతో భాదపడుతున్న ఆ సోదరులను తాకగానే వాళ్ల వైకల్యం తొలగి వాళ్ళు మాములుగా అయిపోయారు. ఆ సోదలకు జరిగిన ఈ విచిత్రాన్ని తెలుసుకున్న గ్రామ ప్రజలు ఆ బావిని పూర్తిగా తవ్వి పరిశీలించారు. బావిలో ‘గణనాథుని’ రూపం దర్శనమిచ్చింది. గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో దాన్ని పూజించి స్వామివారికి కొబ్బరికాయలు సమర్పించారు. స్వామికి గ్రామస్థులు సమర్పించిన కొబ్బరికాయల నీరు ‘కాణి’భూమి( కాణి అంటే ఎకరం పొలం అని అర్థం) మేర పారింది. అప్పట్నుంచి విహారపురి గ్రామానికి ‘కాణిపారకరమ్’ అన్న పేరు వచ్చింది. కాలక్రమంలో అదే ‘కాణిపాకం’గా మారిందని చరిత్ర మనకు చెబుతుంది.
ఇక్కడకు వచ్చే భక్తులు వాటిని కూడా దర్శించుకుంటారు. కాణిపాకం వరసిద్ధి వినాయకుడు సత్య ప్రమాణాల దేవుడిగానూ పిలుచుకుంటారు. ఎందుకంటే ఇక్కడ స్వామివారి దగ్గరకు వచ్చి ఆయన ఎదుట ఎవరైనా తప్పుడు ప్రమాణం చేస్తే.. వారిని స్వయంగా ఆ గణనాథుడే శిక్షిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
కాణిపాకం ఆలయానికి ఉన్న మరొక విశిష్థత ఏంటి అంటే ఈ దేవాలయం శివ-వైష్ణవ క్షేత్రంగా విరాజిల్లుతుంది. ఇక్కడ ఉన్న ఆ గణనాథుని ప్రధాన ఆలయం నుంచి ప్రతి అనుబంధ ఆలయనిర్మాణంకు విశిష్ట పురాణ ప్రాధాన్యం ఉంది. కాణిపాకం ఆలయ ప్రాగణంలోనే వరసిద్ధి వినాయకస్వామి ఆలయం, మణికంఠేశ్వర, వరదరాజులు, వీరాంజనేయ స్వామి వారి ఆలయాలున్నాయి. వాటికి చారిత్రక ఆధారాలున్నాయి… వినాయకస్వామి గుడికి వాయువ్య దిశగా ఉన్న మణికంఠేశ్వరస్వామి ఆలయం ప్రధాన ఆలయానికి అనుబంధ నిలయం. దీన్ని 11 వ శతాబ్దంలో చోళరాజు కుళొత్తుంగ మహారాజు నిర్మించారు. బ్రహ్మహత్యా పాతక నివృత్తి కోసం శివుడి ఆజ్ఞ మేరకు ఈ ఆలయం నిర్మించారని చరిత్ర మనకు చెబుతుంది. అలాగే ఇక్కడ మహాగణపతి, దక్షిణామూర్తి, సూర్యుడు, షణ్ముఖుడు, దుర్గాదేవి విగ్రహాలు ప్రతిష్ఠించారు. లోపల మరగదాంబిక అమ్మవారి గుడి ఉంది. ఇక్కడ సర్పదోష నివారణ పూజలు చేస్తారు.