తెలంగాణలో ఎన్నికల షెడ్యూలు విడుదలైన సంగతి తెలిసిందే.. మరో నెలరోజులలో ఎన్నికలు జరగనున్నా నెపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల ప్రచార ఖర్చులను కచ్చితంగా లెక్కించేందుకు ఎన్నికల సంఘం రెడిఅయింది.
తెలంగాణలో ఎన్నికల షెడ్యూలు విడుదలైన సంగతి తెలిసిందే.. మరో నెలరోజులలో ఎన్నికలు జరగనున్నా నెపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల ప్రచార ఖర్చులను కచ్చితంగా లెక్కించేందుకు ఎన్నికల సంఘం రెడిఅయింది. ఎన్నికల ప్రచారంలో పోటిలో నిలబడ్డ అభ్యర్థులు సభలు, సమావేశాలు ఏర్పాటుకు అయ్యే ఖర్చులు అలాగే పార్టీ కార్యకర్తలకు కాఫీ, టీ, టిఫిన్, బిర్యానీల కోసం చేసే ఖర్చును అభ్యర్థులు ఇప్పటివరకు చాలా తక్కువగా చూపించేవారు. ప్రస్తుత ఎన్నికల్ల అలాంటివానికి వీటు లేకుండా ఈసారి ఎన్నికల అధికారులు ధరల జాబితాను విడుదల చేసారు. ఇప్పుడు వీటి ఆధారంగానే అభ్యర్థుల ఖర్చులను లెక్కించనున్నారు. నాయకులు పంచే నీళ్ల ప్యాకెట్ నుంచి మొదలుకుని, సభలు, సమావేశాల్లో ఏర్పాటు చేసే భారీ బెలూన్లు, ఎల్‌ఈడీ తెరలకు సైతం ధరలను నిర్ణయించారు.
అభ్యర్థులు గాలిలో ఎగరువేసే ఒక్కో బెలూన్‌కు రూ.4 వేలు అలాగే తమ ప్రచారం కోసం వినియోగించే ఎల్‌ఈడీ తెరకు రూ.15 వేలను రోజు అద్దెగా పరిగణిస్తారు. ఎక్కడన్న ఫంక్షన్ హాల్‌లో సమావేశం నిర్వహిస్తే పట్టణ ప్రాంతాల్లోనైతే రోజుకు రూ.15 వేలు, గ్రామీణ ప్రాంతంలో రూ.12 వేలు అభ్యర్థి తన ఖర్చులో నమోదు చేయాలి. డీసీఎం వ్యాన్ పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.3వేలు, గ్రామీణ ప్రాంతాల్లోనూ రూ.3వేల అలాగే మినీ బస్సుకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రూ.3500, ఇన్నోవా కారుకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రూ.4000, పెద్ద బస్సు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రూ.6000, బెలూన్ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రూ.4000, డ్రోన్ కెమెరా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రూ.5000 గా నిర్ణయించారు. ఎన్నికల సంఘానికి అభ్యర్థి సమర్పించే ఎన్నికల వ్యయంలో కుర్చీలు, టేబుళ్లు, వాహనాల కిరాయి, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే కళాకారుల పారితోషికం వివరాలూ ఉండాలని స్పష్టం చేశారు.
అంతే కాదండోయో తిండికూడా ప్రత్యేంగా ధరలు నిర్ణయించారు. వాలి లెక్కలు కూడా పరిగణలోకి తీసుకోవాలి. వెజిటబుల్ బిర్యాని పట్టణ ప్రాంతంలో రూ.80, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 70, చికెన్ బిర్యాని పట్టణ ప్రాంతంలో రూ.140, గ్రామీణ ప్రాంతాల్లో రూ.100 , మటన్ బిర్యానీ పట్టణ ప్రాంతంలో రూ.180, గ్రామీణ ప్రాంతాల్లో రూ.150గా నిర్ణయించారు.టిఫిన్ పట్టణ రూ.35 గ్రామీణ ప్రాంతాల్లో రూ.30, పెద్ద సమోసా ఒకటి. రూ.10, లీటరు, మంచి నీళ్ల సీసా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రూ.20, పులిహోర పట్టణ ప్రాంతంలో రూ.35, గ్రామీణ ప్రాంతాల్లో రూ.30 గా ఉన్నికల్లో పోటి చేసే అభ్యర్థులు తమ లెక్కల్లో ఎన్నికల సంఘనికి సర్పించాలి.
ఇప్పటి వరకు చాలా మంది బడా నాయకులు ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నా.. అత్యధిక మంది ఎన్నికల సంఘం నిర్ణయించిన పరిమితి లోపే లెక్కలు చూపిస్తున్నారు. ఈ పరిమితిని పెంచితే కొంతైనా అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని భావించిన కేంద్ర ఎన్నికల సంఘం అభ్యర్థుల వ్యయాన్ని 2022లో పెంచింది. 2014లో ఎంపీ అభ్యర్థి పరిమితి గరిష్ఠంగా రూ.75 లక్షలు ఉండగా, 2022లో ఆ మొత్తాన్ని రూ.90 లక్షలకు పెంచింది. ఎమ్మెల్యే అభ్యర్థుల వ్యయాన్ని రూ.28 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంచింది. ఎనిమిదేళ్ల వ్యవధిలో పెరిగిన ఓటర్ల సంఖ్య, ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని వ్యయ పరిమితిని పెంచింది. ఎన్నిల సంఘం ఖర్చు పరిమితి పెంచిన అభ్యర్థుల తమ లెక్కలు సరిగా చూపుతారో లేదో చూడాలి.