Vegetarian – ఆహారంలో శాకాహారమే ఉత్తమం… ఎలా అంటే..?

By manavaradhi.com

Published on:

Follow Us
Vegetarian benefits

సమతుల, పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం. శరీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఉత్సాహంగా ఉండొచ్చు. అందుకే మాంసకృత్తులు, ప్రోటీన్లు సమపాళ్లలో ఉండే శాకాహారం తీసుకోవడం శ్రేయస్కరం. శాఖాహారం సర్వశ్రేష్టంగా భావించడం వ‌ల్ల చాలా మంది పూర్తి శాఖాహారులుగా మారిపోతున్నారు. అయితే కొంద‌రు వెగాన్‌గా మార‌డంతో కొన్నిర‌కాల పోష‌క‌ప‌దార్థాల‌ను శ‌రీరానికి అందివ్వ‌లేక‌పోతున్నారు.

మనిషి ఆరోగ్యానికి శాఖాహమే శ్రేష్ఠం. శాఖాహార పదార్థాల్లో అన్ని రకాల పోషక విలువలు లభ్యమవుతాయి. వెజిటేరియన్ డైట్ తో సాత్విక లక్షణాలు వస్తాయి. అంతే కాదు మనలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఆయువు పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆకుకూరలు, కాయగూరల్లో విటమిన్లు, మాంసకృత్తులు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

ప్రతి ఒక్కరూ శాఖాహారాన్ని తీసుకుంటే జీవనగమనం కూడా పెరుగుతుంది. కూర‌గాయ‌లైనా, మాంసం అయినా.. ఏది తిన్నా మ‌న శ‌రీరానికి కావ‌ల్సినంత మోతాదులో, కావల్సిన రీతిలో తీసుకోవ‌డం చాలా అవ‌స‌రం అని గుర్తించాలి. కూరగాయలు, ఆకుకూరలు, మొలకెత్తిన విత్తనాల్లో ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి.

సమపాళ్ళలో తీసుకునే శాఖాహారం శరీరానికి అన్ని రకాల పోషకాలను అందిస్తుంది. పండ్లు, కూరగాయలు, ఆకుకూరల్లో అత్యధికంగా విటమిన్లు ఉంటాయి. సిట్రస్ జాతికి చెందిన పండ్లలో సీ- విటమిన్ ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఆకుకూరలు, చిక్కుళ్లు వంటి వాటిలో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. పీచు పదార్థాల్లో సెల్యూలోజ్ అధికంగా ఉండి రక్తనాళాల్లో కొవ్వును కరిగించడం, మలబద్ద నివారణకు ఉపయోగపడుతుంది. క్యాల్షియం అంటానే డైరీ ప్రొడక్ట్స్ మీదకే వెళుతుంది. అయితే వెజిటేరియన్స్ కోసం బ్రొకోలీ, కేల వంటివి ఆహారాల్లో కూడా అధిక క్యాల్షియం ఉంటుంది.

శాకాహారులు ఐరన్ పుష్కలంగా ఉండే వెరైటీ ఆకుకూరలను ఎంపిక చేసుకోవాలి. శరీరంలో ఐరన్ వల్ల హీమోగ్లోబిన్ ను అవసరం అయినంత ఉత్పత్తి అవుతుంది. వీటితో పాటు, పండ్లు, సెరల్స్, ధాన్యాలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. శరీరంలో ఉండే కొవ్వులను శక్తివంతమైనవిగా ఉండేందుకు మరియు కొలెస్ట్రాల్ ను రెగ్యులేట్ చేయడానికి గుండె ఆరోగ్యానికి ఓమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ చాలా అవసరం. కాబట్టి వెజిటేరియన్స్ కు ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ను పుష్కలంగా అంధించే ఫ్లాక్ సీడ్స్ ను రెగ్యులర్ డైట్ లిస్ట్ లో చేర్చుకోవడం చాలా అవసరం.

పూర్తి శాఖాహారులుగా మారిన వారిలో కొన్ని పోష‌కాలు అంద‌వు. ఐర‌న్‌, బీ 12 వంటి వాటిని పొంద‌డం కోసం స‌ప్లిమెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రోటీన్ల‌ను బీన్స్‌, ర‌జ్మా, ప‌ప్పుధాన్యాలు, గింజ‌లు, క్వినోవా ద్వారా భ‌ర్తీ చేసుకోవ‌చ్చు. శాకాహారులైన స్త్రీ మరియు పురుషులకు 55-45గ్రాములు ప్రోటీనులు అవసరం అవుతుంది. కాబట్టి వెజిటేరియన్స్ ప్రోటీనుల పుష్కలంగా ఉండే బీన్స్, పప్పులు, బఠానీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. వెజిటేరియన్ ఆహారం తీసుకొనే వారికి బి12 సప్లిమెంట్ రెగ్యులర్ గా అందాలి. కాబట్టి మష్రుమ్ లో బి12పుష్కలంగా ఉంది. ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైన ఆహారం.

జింక్ పొంద‌డానికి సోయాబీన్స్‌, తృణ‌ధాన్యాలు, గింజ‌లు, పుట్ట‌గొడుగులు, బ‌ఠానీలు, గోధుమ‌ల‌ను తినాలి. శ‌రీరానికి అవ‌స‌ర‌మైన బ‌ల‌వ‌ర్ధ‌క ఆహారాలను తీసుకోవాలి. అన్నిర‌కాల మాంస‌కృత్తులు, ప్రొటీన్లు, విట‌మిన్లు అందుకోవ‌డానికి పూర్తిగా మాంసాహారాల‌ను కాకుండా కూర‌గాయ‌లు తీసుకోవ‌డంపై మాంసం ప్రియులు దృష్టిసారించాలి.

.. శాఖాహారం ఇది ఒక పోషకాల గని .. పుష్కలమైన విటమిన్లతో అనారోగ్యాన్ని దరి చేరనీయదు. మనలో రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. శ‌రీరానికి అవ‌స‌ర‌మైన మేర‌కు ఆహారాలు తీసుకోవాలి. అవి కూడా అన్నిర‌కాల పోష‌కాలు ఉండేలా చూసుకొంటే మ‌రీ మంచిదని సెల‌విస్తున్నారు పోష‌కాహార నిపుణులు.

Leave a Comment