Lower back Pain : నడుము నొప్పితో బాధపడుతున్నారా..ఇలా విముక్తి పొందండి

By manavaradhi.com

Updated on:

Follow Us
Ways to Relieve Back Pain

నడుము నొప్పి ప్రతి ఒక్కరిని తరచూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ నొప్పి నుండి ఉపశమనం కోసం పెయిన్ కిల్లర్స్ ను వాడుతూ ఉంటారు. ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వాడడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎక్కువ సేపు కూర్చోవడం, దూర ప్రయాణాలు చేసినప్పుడు సహజంగా నడుము నొప్పి వస్తుంది. కానీ కొన్నిసార్లు నడుమునొప్పి అనేక కారణాలతో కూడా వస్తాయి.

ప్రతి మనిషి జీవిత కాలంలో ఏదో ఒక టైమ్ లో బ్యాక్ పెయిన్ కు గురైయ్యే ఉంటారు. ప్రస్తుత జీవన శైలిలో నడుము నొప్పి లేని వారు చాలా తక్కువ మందే ఉంటారు. దీనికి కారణం మారిన జీవన శైలే ముఖ్య కారణం. ఒకప్పుడు వయసైపోయిన వారిలో కనిపించే బ్యాక్ పెయిన్, నేటి ఆధునిక యుగంలో యుక్త వస్కులను సైతం బాధింస్తుంది. సాదారణంగా ప్రతి మనిషికి శరీరం యొక్క వివిధ ప్రాంతాల్లో నొప్పులు వస్తూ ఉంటాయి. అలా రావటానికి చాలా కారణాలు ఉండవచ్చు. అది వెన్నునొప్పికి కారణంగా కూడా మారవచ్చు. వెన్నునొప్పికి ముఖ్యమైన కారణాలలో ఒత్తిడి ఒకటి. ఇంకా సరిగ్గా లేని భంగిమ,చెడు ఎర్గోనోమిక్స్ మరియు నిద్ర అలవాట్లు వంటి ఇతర కారణాలు వెన్నునొప్పికి కారణం కావచ్చు.

నొప్పిని నయం చేయటం కోసం మంచి జాగ్రత్తలు తీసుకోవటం అత్యవసరం. వయస్సు మీదపడిన కారణంగా కణజాలం చీరుకుపోయి వెన్నునొప్పికి కారణం కావచ్చు. వెన్నునొప్పిని సాధారణ పనుల ద్వారా నివారించవచ్చు. రోజు రోజుకూ మారుతున్న జీవన శైలీ, పోషకాహారం తీసుకోకపోవడం, శారీరక శ్రమ లోపించడం, గంటల తరబడి కదలకుండా కూర్చోవడం.. లేదా నిల్చోవడం… అన్నీ కలిపి వెన్నునొప్పికి దారితీస్తుంది. దాంతో ఏ పనులూ చేయలేని పరిస్థితి. మాత్రలు అప్పటికప్పుడు ఉపశమనాన్ని కలిగిస్తాయే తప్ప పూర్తిగా నొప్పిని తగ్గించవు. అంతేకాదు వీటిని అదేపనిగా వాడుతుంటే దుష్ప్రభావాలూ తప్పవు.

వెన్నునొప్పి మనం కూర్చొనే విధానం మీదే ఆధారపడి ఉంటుంది. ఈ వెన్ను నొప్పికి సరైన సమయంలో సరైన జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల ముందు ముందు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. శారీరకంగా వెన్నునొప్పి, మెడనొప్పి ఎక్కువగా బాధిస్తుంది. కాబట్టి కూర్చొనే విధానంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ వెన్ను నొప్పిని తగ్గించుకోవచ్చు. తీసుకునే అహారంలో క్యాల్షియం, విటమిన్లు లోపించటం. వెన్ను ఆరోగ్యంగా ఉండాలంటే బలమైన ఆహారాన్ని ప్రోటీనులు, న్యూట్రీషియన్స్ అధికంగా కలిగిన ఆహారాలను అధికంగా తీసుకోవాలి.

క్యాల్షియం ఉన్న ఆహారాలు అధికంగా తీసుకోవడం వల్ల ఎముకలు, కండరాలు బలంగా ఉండి ఎటువంటి నొప్పిని కలుగజేయదు.ఇంట్లో పెద్దవాళ్ళకు ఇటువంటి వెన్ను నొప్పి సమస్య ఉంటే కనుక వంశపారం పర్యంగాను వెన్నునొప్పి వచ్చే అవకాశం ఉంది. అందుకు బ్యాక్ పెయిన్ నివారణ కోసం ప్రతి రోజూ వ్యాయామం, యోగా వంటివి బాగా ఉపయోగపడుతాయి. శారీరక బరువు ఎక్కువున్నా వెన్నెముక మీద అదనపు ఒత్తిడి, భారం పడుతుంది. కాబట్టి, బరువు నియంత్రణలో ఉంచుకోవాలి.

కండరాలు బలహీనంగా ఉండటం, కూర్చోటం, నిలబడటం సరైనజీవన శైలీ మరియు ఎగుడు దిగుడు చెప్పులు వాడినప్పుడు తదితర కారణాల వల్ల నడుము నొప్పి సమస్య తలెత్తుతుంది. పని టెన్షన్‌ వల్ల నడుం కండరాలు సంకోచిస్తాయి. రక్త సరఫరా తగ్గవచ్చు. వీటన్నింటి వల్ల నడుం నొప్పి వస్తుంది. ఒకే పొజిషన్‌లో అరగంట కంటే ఎక్కువ సేపు కూర్చోవడం చేయకండి. మధ్య మధ్యలో కాసేపు లేచి నడవండి. కంప్యూటర్‌పై పనిచేసేటప్పుడు కుర్చీ తగినంత ఎత్తులో ఉండేలా చూసుకోండి.

సరైన నిద్ర లేకపోవడం వలన బ్యాక్ పెయిన్ సంభవిస్తుంది. ఒక ప్రశాంతమైన నిద్ర దెబ్బతిన్న కండరాల రిపేరు మరియు వాచిన కీళ్లను నయం చేస్తుంది. ఒక మంచి మంచం మీద నిద్రించేలా జాగ్రత్తలు తీసుకోండి. హార్డ్ మంచం మీద పడుకోవటం వలన మీ శరీరంలో నొప్పి కి కారణం కావచ్చు. ఒక వంపు తిరిగిన వెన్నెముకతో నిద్రించడానికి ప్రయత్నించకూడదు. విటమిన్ B గణనీయమైన పరిమాణంలో తీసుకోవటం వలన బ్యాక్ పెయిన్ ఉపశమనం కలుగుతుంది. విటమిన్ B కేంద్ర నాడీ వ్యవస్థ మరియు శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. అంతేకాక వెన్నునొప్పి ఉపశమనానికి రోజువారి ఆహారంలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉండేలా చూసుకోవాలి.

బ్యాక్ పెయిన్ నయం చెయ్యడానికి ఉత్తమ మార్గాలలో ఫిట్ నెస్ కీలకం అని చెప్పవచ్చు. వ్యాయామాలు కండరాలను వదులు మరియు చాలా వరకూ విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడతాయి. ఒక చిన్న నడక లేదా ఏరోబిక్స్ చేయడం ద్వారా కొన్ని నిమిషాలు గడపటం వలన నడుము నొప్పికి ఉపశమనం కలుగుతుంది. నొప్పి ఉపశమనానికి స్మోకింగ్ అలవాటును వదలివేయాలి. సిగరెట్లలో ఉండే నికోటిన్ అనే పదార్దం నొప్పిని పెంచటానికి దోహదం చేస్తుంది. అందువల్ల నొప్పి ఉపశమనానికి స్మోకింగ్ అలవాటును వదలివేయడం అనేది ఉత్తమం. దీని పట్ల అవగాహనతో కనీసం జాగ్రత్తలు పాటిద్దాం. ధ్యానం, దీర్ఘ శ్వాస, యోగా వంటివి మనసును ప్రశాంతపరుస్తాయి. వెన్నునొప్పిని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి, మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది.

Leave a Comment