Horoscope This week in Telugu: జనవరి 7 నుంచి 13 వరకు రాశిఫలాలు

By manavaradhi.com

Updated on:

Follow Us
ఈ వారం మేష రాశివారికి లక్ష్మీకటాక్షం లభించనుంది. మీకు ఉన్న రుణ సమస్యలు తగ్గనున్నాయి. ఈ వారం శ్రమకు తగిన ఫలితం లభించనుంది. ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి కొంచ వరకు తగ్గనుంది. మీలో ఉన్న ఆత్మవిశ్వాసం మీకు మరింత శక్తిని ఇచ్చే విధంగా ఉంటుంది. మీ పనిలో మీకు కొంచం ఇబ్బంది పెట్టి అడ్డుపడేవారు ఎక్కుగా ఉన్నారు.. కొంచం జాగ్రత్తగా ఉంటే మంచిది. మీరు ఏపని చేసినా ధైర్యంగా నిర్వర్తించండి. వ్యాపారస్తులు మీ లావాదేవిల్లో కొంత సమయస్ఫూర్తి అవసరం. ఏది ఏమైన ఈ వారం మేష రాశివారికి శుభఫలితాలే కనిపిస్తున్నాయి. ఇష్టదైవ ప్రార్థన వల్ల అనుకూల ప్రభావాన్ని చూపిస్తాయి.

వృషభ రాశి

ఈ వారం వృషభ రాశి వారు ఏపని చేసిన కొంచం ఆచితూచి అడుగులు వేయాలి.. ఏదైన నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించి తీసుకుంటే మంచిది. ఎందుకుంటే ఈ వారం వృషభ రాశి వారికి కొంత కలసిరాకపోవచ్చు. ఉద్యోగస్తులు తమ పనులను సకాలంలో పూర్తిచేసుకోవాలి. మీ వ్యతిరేకులకు అవకాశం ఇవ్వకండి. మీ మంచిని కోరుకునేవారి సలహాలు సూచనలు మీకు మేలు చేసే విధంగా ఉంటాయి. ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు తొలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారం వృషభ రాశి నవగ్రహధ్యానం శుభప్రదంగా ఉంటుంది.

ఈ వారం మిథున రాశి వారి మంచి ఫలితాలు గొచరిస్తున్నాయి. మంచి వ్యాపార యోగం ఉంది. అనేక రకాలుగా ఈ రాశి వారు అభివృద్ధిని సాధిస్తారు. మీరు తీసుకునే నిర్ణయాలు మీ లక్ష్యాలను చేరువచేసే విధంగా ఉంటాయి. అయితే ఈ వారం అనుకోని ఖర్చులు ఎదురైయే అవకాశం ఉంది. కొందరి ప్రవర్తన మీమ్మల్ని ఇబ్బందిపెట్టే విధంగా ఉంటాయి. వాటిని పట్టించుకోకుండా ఏకాగ్రతతో బాధ్యతలను పూర్తిచేయండి. సూర్యనారాయణ మూర్తిని స్మరించండి మీరుఅనుకున్న లక్ష్యం సిద్ధిస్తుంది.

కర్కాటక రాశి

ఈ వారం కర్కాటక రాశి వారికి ఉద్యోగం పరంగా చక్కగా ఉంటుంది. మీ ప్రత్నాలు సఫలం అవుతాయి. మీరు తీసుకోనే నిర్ణయాలు ఎటువంటి తడబాటు లేకుండా అమలు చేయండి మీకు మంచి ఫలితాలు వస్తాయి… అంతే కాదు మీ ఆశలు నేరువేరతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ వారం ఆర్థికంగా బలపడే అవకాశాలు ఉన్నాయి. మీ శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. అనుకోకుండా కొన్ని సమస్యలకు తగిన పరిష్కారం తప్పక లభిస్తుంది. కొంత మీర ఖర్చులు అదుపులోకి వస్తాయి. అదృష్టయోగం బలంగా ఉంది. ఇష్టదైవారాధన చేయండి… మీరు అనుకున్నాది సిద్ధిస్తుంది.

ఈ వారం సింహ రాశి వారి ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. అనుకున్న పనులు ప్రారంభించడానికి మంచి సమయం. వ్యాపారంలో లాభాలు రావచ్చు.. ఆచితూచి వ్యవహరించండి. మీ సన్నిహితుల నుంచి తగిన ప్రోత్సాహం లభిస్తుంది. మీరు కొత్తగా ఏమన్న ప్రయత్నాలు ప్రారంభిస్తే సఫలమవుతాయి. అంతే కాదు మీకు వచ్చే ఆదాయ మార్గాలు పెరిగే మార్గాలు మెండుగా ఉన్నాయి. మీరు అనుకున్న ఆలోచనలకు ఎటువంటి మార్పులు లేకుండా కార్యరూపమివ్వండి. ఈ వారం మధ్యలో అనుకోకుండా మీకు ఉన్న ఒక సమస్య తొలిగిపోతుంది. ఈవారం మీకు శివారాధన శుభప్రదంగా గోచరిస్తుంది.

కన్య రాశి

ఈ వారం కన్య రాశి కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరి ధనయోగం ఉంది. మీ నిర్ణయాలను అమలు చేయండి. ఉద్యోగస్తులకు ఈ వారం కలిసివస్తుంది. మీ పని పట్ల మీపై అధికారులు ప్రసన్నులవుతారు. మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. నిర్ణయాలు తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచించి తీసుకోండి.. ముఖ్యంగా వ్యాపారంలో తొందర పనికిరాదు. ఈవారం మీరు నవ గ్రహాలను స్మరించండి, ఇష్టకార్యం సిద్ధిస్తుంది.

ఈ వారం తుల రాశివారికి శుభఫలితాలు ఎక్కువగా గొచరిస్తున్నాయి. మీరు ప్రారంభించిన పనులు త్వరతిగతిన పూర్తివుతాయి. ఈ వారం మీకు అన్నివిధాలా అనుకూల సమయం. ఏపని చేసినా చక్కటి ప్రణాళిక బద్ధంగా చేస్తే లబ్ధి చేకూరుతుంది. ఈవారం అధికార యోగం పొందవచ్చు. అందరి ప్రశంశ్రలు పొందుతారు. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. మీరు అనుకున్న అభివృద్థిని సాధిస్తారు. మీ ఇష్ట దైవాని అలాగే లక్ష్మీదేవిని స్మరించండి, మేలు జరుగుతుంది.

వృశ్చిక రాశి

ఈవారం వృశ్చిక రాశి వారికి లక్ష్మీ కటాక్షముంది. మీరు గతంలో పెట్టిన కొన్ని పెట్టుబడులు లాభాలాను తెచ్చిపెడతాయి. మీ జీవితానికి సంభందిని ఏనిర్ణయం తీసుకున్నా సకాలంలో తీసుకోండి. మీ సన్నిహితుల దగ్గర అసలు మొహమాటాలకు పొవొద్దు … ఎందుకంటే వాటివల్ల నష్టం వచ్చే అవకాశం ఉంది. మీ ఆప్తుల సూచనలు పనిచేస్తాయి. ఇతరుల పై ఆధారపడి ఎక్కువగా ఉండకండి… ఎవరికి అపార్థాలకు అవకాశం ఇవ్వకండి. ఆవారం మీరు నవగ్రహాలను స్మరిస్తే మంచిది.

ధనస్సు రాశి వారు ఈ వారం కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో తప్పక విజయం సాదిస్తారు. మీ పనులను ఒక ప్రణాళిక ప్రకారం ప్రారంభిచండి.. అంతే ఉత్సాహంగా పూర్తిచేయండి. ఆ వారం మీకు అదృష్టయోగం సూచిస్తుంది. అనుకొని కొన్ని రకాల గందరగోళ స్థితి నుంచి బయట పడతారు. అందుకు మీ సొంత వారి నుంచి మీకు అండదండలు లభిస్తాయి. వారం మధ్యలో ఒక మేలు జరుగు తుంది. ఇంట్లోవారిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇష్టదైవాన్ని స్మరిస్తే మంచిది.

మకర రాశి

ఈ వారం మకర రాశి వారికి ఆర్థికంగా కలిసి వచ్చే కాలం. మీరు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాన్నిస్తాయి. వ్యాపారంలో మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వారం మీకు పెట్టుబడులు కలిసివస్తాయి. మీకు అన్నివిధాల సహాయ సహకారాలు లభిస్తాయి. మీ అనుకున్నవారితో విభేదించవద్దు. ఇష్టదైవాన్ని స్మరించండి ఈ వారం మీరు మంచి శుభవార్త వింటారు.

కుంభ రాశి వారి ఈ వారం వ్యాపారం, ఉద్యోగాది వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. మీపై అధికారుల ప్రశంసలు పొందుతారు. మీరు ఏపని చేసిన ధర్మమార్గంలోని పయనించండి.. మీకు తప్పక విజయం లభిస్తుంది. ఈ వారం మీకు స్నేహితుల నుంచి చక్కని సహాయ సహకారాలు అందుతాయి. మీరు ఏపని చేసిన మధ్యలో ఆపకండి… ఆపనిని ఖచ్చితంగా పూర్తిచేయండి. వ్యాపారంలో సకాలంలో స్పందించడం ద్వారా నష్టాలను నివారించవచ్చు. నవగ్రహాలను స్మరించండి, మనశ్శాంతి లభిస్తుంది.

మీన రాశి

ఈ వారం మీన రాశి వారికి మంచి ఫలితాలు గొచరిస్తున్నాయి. ఈ వారంలో మీరు ఒక ఆపద నుంచి బయటపడగలగుతారు. నాకు చెడు జరిగిద్దేమే అన్న ఆలోచనను మనస్సులోనికి అసలు రానివ్వకండి. మీరు చేసే వాటి ఏకాగ్ర చిత్తంతో చేయండి. మీ జీవితానికి సంబందించిన ఏ నిర్ణయం తీసుకున్నా సొంతంగా తీసుకోండి.. ఇతరులపై ఆదారడవద్దు… మీ అవసారాలకు సరపడా ధనం అందుతుంది. ఇష్టదేవతను స్మరించండి, శుభం జరుగుతుంది.

Leave a Comment