OG Review: పవన్‌కల్యాణ్ ఓజీ ఎలా ఉంది?

By manavaradhi.com

Published on:

Follow Us
OG Review

OG Movie Review – పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ఓ.జి. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద డివివి దానయ్య నిర్మాతగా ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. పవన్ కళ్యాణ్ కెరియర్‌లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా, నిజానికి అనౌన్స్ చేసిన నాటి నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి.

OG Movie Story || 1980లలో సత్య దాదా(ప్రకాష్ రాజు) బొంబాయిలో ఒక పోర్టు నడుపుతూ ఉంటాడు. అయితే, ఆ పోర్టులో ఒక ఆర్డిఎక్స్ కంటైనర్ మిస్ అయిందన్న నేపథ్యంలో, ఒకప్పటి సత్య దాదా పార్ట్నర్ కొడుకు ఓమి(ఇమ్రాన్ హష్మీ), రంగంలోకి దిగి సత్య కుమారుడిని చంపిస్తాడు . అయితే, అప్పటికే సత్య దాదాకి దూరమై, అజ్ఞాతంలో తన భార్య కన్మణి(ప్రియాంక మోహన్‌)తో, ఓజస్ గంభీర(పవన్ కళ్యాణ్) రహస్య జీవితం గడుపుతూ ఉంటాడు. అయితే, సత్య దాదా కుటుంబానికి ఓజస్ గంభీర ఎందుకు దూరమయ్యాడు? సత్య దాదా కుటుంబానికి ఆపద ఎదురైన నేపథ్యంలో, తిరిగి వస్తానన్న ఓజి తిరిగి వచ్చాడా? ఓమి కంటైనర్‌లో అసలేముంది? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

తాము ఆరాధించే కథానాయకుడి సినిమాలోని ప్రతి సన్నివేశం ఓ క్లైమాక్స్‌లా ఉండాలని ఆశపడతారు మెజార్టీ అభిమానులు. పవన్‌కల్యాణ్‌కి వీరాభిమాని అయిన సుజీత్ (OG Movie Director) కూడా అవే ఆలోచనలతో ‘ఓజీ’ తీసినట్టు అనిపిస్తుంది. అచ్చంగా సినిమా నిండా ఫ్యాన్ బాయ్ మూమెంట్సే. పవన్‌ ఇమేజ్‌కి, ఆయన స్వాగ్‌కి తగ్గట్టుగా ఆయుధాలు చేతికందించి… మరింత స్టైలిష్‌గా ఆయన్ని తెరపై ఆవిష్కరిస్తూ… అడుగడుగునా క్లైమాక్స్‌ని మించిపోయే ఎలివేషన్స్‌తో తెరపై అగ్ని తుఫాన్‌ని ఆవిష్కరించారు సుజీత్. ఆయనికి తమన్‌ (OG Movie Music Director) తోడవడం ఇంకా కలిసొచ్చింది. విజువల్స్ కూడా కట్టిపడేస్తాయి. మొత్తంగా అభిమానులు సంతృప్తి చెందే సినిమా ఇది.

పవన్ కళ్యాణ్ ప్యూర్ వన్ మ్యాన్ షో. ఫ్యాన్స్ కోసం సుజిత్ చెప్పినట్టు చేస్తూ, వారికి ఫుల్ మీల్స్ కాదు, అంతకుమించి అనేలా పవన్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ప్రియాంక మోహన్ పాత్ర చిన్నదే, ఉన్నంతలో మెప్పించింది. శ్రియా రెడ్డి, అర్జున్‌దాస్ పవర్‌ఫుల్ క్యారెక్టర్స్ పోషించారు. ఇమ్రాన్ హష్మీ కూడా పవన్‌కి ధీటుగా నిలబడే ప్రయత్నం చేసి, కొంతవరకు సక్సెస్ అయ్యాడు. మిగతా నటీనటుల గురించి చెప్పాలంటే, ఆ లిస్టు చాలా పెద్దది. అందరూ ఉన్నంతలో పర్వాలేదనిపించారు. ఇక ఈ సినిమా టెక్నికల్ విషయాల గురించి మాట్లాడాలంటే, ఈ సినిమా కథ, కథనం విషయంలో కాస్త వీక్ అనే ఫీలింగ్ కలిగినా, టెక్నికల్ విషయాలు మాత్రం టాప్ నాట్చ్‌గా ఉన్నాయి. ఎక్కువగా ఎలివేషన్స్ మీదే ఫోకస్ చేసిన క్రమంలో, తమన్ గట్టిగానే డ్యూటీ చేశాడు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. నిజానికి, ఈ సినిమాకి చాలా విఎఫ్ఎక్స్ వర్క్ ఉంది. కానీ, అది ప్రేక్షకులకు విఎఫ్ఎక్స్ అని అనిపించకుండా ఫైన్ ట్యూన్ చేయడంలో సుజిత్ అండ్ టీం పడిన కష్టం కనిపిస్తుంది. కథ అంతా 80లలో జరుగుతుంది కాబట్టి, ఆర్ట్ డిపార్ట్‌మెంట్ కష్టం కూడా దాదాపు చాలా ఫ్రేమ్స్‌లో కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కాస్ట్యూమ్స్ కూడా చాలా సెట్ అయ్యేలా ఉన్నాయి. నిర్మాణ విలువలు మాత్రం అత్యద్భుతం. దానయ్య ఖర్చు పెట్టిన కోట్లన్నీ తెరమీద అద్భుతంగా కనిపించాయి.

Leave a Comment