ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ జ్యోతిర్లింగం, శక్తిపీఠమైన భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం శ్రీశైలంలో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. పౌర్ణమి సందర్భంగా సాయంత్రం ఆలయం ఎదుట గంగాధర మండపం వద్ద జ్వాలాతోరణోత్సవం నిర్వహించారు.
శ్రీశైలం : ప్రముఖ జ్యోతిర్లింగం, శక్తిపీఠమైన భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం శ్రీశైలంలో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. పౌర్ణమి సందర్భంగా సాయంత్రం ఆలయం ఎదుట గంగాధర మండపం వద్ద జ్వాలాతోరణోత్సవం నిర్వహించారు. అంతకు ముందు జ్వాలాతోరణానికి ఉపయోగించే వొత్తులను ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్వామిఅమ్మవార్లకు సమర్పించారు. నూలు పోగువొత్తులను ప్రకాశం జిల్లా వేటపాలం మండలం ఆమోదగిరిపట్నంకి చెందిన వసుందరరావు కుటుంబీకులతో వచ్చి ఆలయానికి అప్పగించడం సాంప్రదాయంగా వస్తుందని తెలిపారు. ఈ జ్వాలాతోరణోత్సవాన్ని తిలకించి భస్మాన్ని నుదుటిన ధరించడంతో సకల గ్రహపీడలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.
ఓ పక్క జ్వాలాతోరణం జరుగుతుండగా మరోపక్క గంగాధర మండపం వద్ద ఒత్తులు మంటలతో వెలుగుతుండగా మరో పక్క భక్తులు జ్వాలాతోరణం కిందనుంచి దాటుతూ తమ భక్తిని భక్తులు చాటుకున్నారు. జ్వాలతోరణం ఒత్తుల భస్మాన్ని దక్కించుకునేందుకు భక్తులు అధికసంఖ్యలో పోటీపడక.. అనంతరం ఆలయ పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం దశవిధా హారతుల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు








