Shree Charani: శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం నజరానా.. రూ.2.5 కోట్ల నగదు పురస్కారం.. గ్రూప్ 1 జాబ్

By manavaradhi.com

Published on:

Follow Us
Sri Charani Rewarded with ₹2.5 Cr, Land & Job by AP Govt

Shree Charani: మహిళా క్రికెట్ వరల్డ్ కప్ విజేత, టీమిండియా సభ్యురాలైన తెలుగమ్మాయి శ్రీచరణికి ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు భారీ నజరానా ప్రకటించారు. శ్రీ చరణికి రూ.2.5 కోట్ల నగదు బహుమతి ఇవ్వాలని ముఖ్య మంత్రి చంద్రబాబు నిర్ణయించారు. దీంతో పాటు ఇల్లు నిర్మించుకునేం దుకు కడపలో 1000 చ.గ. స్థలం కేటాయిస్తున్నట్టు తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం లో గ్రూప్ 1 అధికారిగా ఉద్యోగం కూడా కల్పిస్తా మని చంద్రబాబు స్పష్టం చేశారు.

శుక్రవారం గుంటూరు జిల్లా ఉండ వల్లి లోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును, మంత్రి నారా లోకేష్‌ను క్రికెటర్ శ్రీ చరణి మర్యాద పూర్వకంగా కలిశా రు. ఉమెన్ వరల్డ్ కప్ గెలుచు కున్న ఆనందక్షణాలను ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌తో శ్రీ చరణి పంచుకున్నారు. తనకు మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞ తలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ శ్రీ చరణిని అభినందించారు. ఉమెన్ వరల్డ్ కప్ గెలుచుకోవడం ద్వారా భారత దేశ మహిళల సత్తా చాటారని, మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారనిముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు భారత జట్టుకు అందించాలని అభిలషించారు. ఈ సందర్భంగా శ్రీ చరణి మహిళా క్రికెటర్లు సంతకాలు చేసిన టీ షర్ట్ ను ముఖ్యమంత్రికి అందించారు. దానిని ఆప్యాయంగా స్వీకరించిన ముఖ్యమంత్రి శ్రీచరణి బృందం భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

శ్రీ చరణితో పాటు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా ఉన్నారు. అంతకుముందు గన్నవరం ఎయిర్ పోర్టులో శ్రీ చరణికి మంత్రులు అనిత, సవిత, సంధ్యారాణి, ఆంధ్రా క్రికెట్ అసోసి యేషన్ ప్రెసిడెంట్ కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీష్, శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు… ఆమెతో పాటు సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. క్యాంపు కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ శ్రీ చరణికి స్వాగతం పలికారు.

Leave a Comment