KGF, KGF 2 సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు యశ్. ఇవి రెండూ తెలుగులోనూ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాయి. అందుకే ఇప్పుడు ‘టాక్సిక్’ మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే థియేట్రికల్ హక్కులకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమా తెలుగు రైట్స్ సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
యశ్ నుంచి రానున్న కొత్త చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’. గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర తెలుగు థియేట్రికల్ హక్కుల్ని నిర్మాత దిల్‌రాజు రూ.120కోట్లకు సొంతం చేసుకున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కేజీఎఫ్’ సినిమాల తర్వాత యశ్ మార్కెట్ చాలా పెరిగింది. నాలుగేళ్ల తర్వాత ఆయన నుంచి రానున్న ఈ ‘టాక్సిక్’ కోసం ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడిలాంటి సినిమాని మా ఎస్వీసీ బ్యానర్ ద్వారా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో విడుదల చేయనుండటం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు. ఇదొక పీరియాడిక్ యాక్షన్ డ్రామా సినిమా. కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో అనువాదమవుతోంది. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతమందిస్తుండగా.. రాజీవ్ రవి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.
ఈ సినిమా స్టోరీ 1940ల నుంచి 70ల మధ్య ఉంటుందని టాక్. ఈ చిత్రం కన్నడ, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మలయాళం సహా అనేక భాషల్లో రిలీజ్ అవుతోంది. ఇందులో హీరోయిన్స్‌గా కియారా అద్వానీ, నయనతార, హుమా కురేషీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్‌లు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం రవి బస్రూర్ అందిస్తు్న్నారు. ఈ చిత్రం మార్చి 19, 2026న బాక్సాఫీస్ ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ఏపీ-తెలంగాణ థియేట్రికల్ రైట్స్‌ను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కళ్లు చెదిరే ధరలకు దక్కించుకోవడం ఆసక్తికరంగా మారింది.









