Sri Gayatri Devi – శ్రీ గాయత్రీ దేవి అలంకారం

By manavaradhi.com

Published on:

Follow Us
Sri Gayatri Devi

‘‘ఓం బ్రహ్మస్త్రకుండికాస్తాం
శుద్ధ జ్యోతి స్వరూపిణీం
సర్వతత్త్వమయీం వందే
గాయత్రీం వేదమాతరం’’

Navratri 2025 Day 2: దసరా ఉత్సవాల్లో రెండవ రోజున కనక దుర్గమ్మ శ్రీ గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. సకల వేద స్వరూపం గాయత్రీ దేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి ఆ మాత. ముక్త, విద్రుమ, హేమ, నీల ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో, శంఖం, చక్రం, గద, అంకుశం, ధరించి దర్శనమిస్తుంది. గాయత్రీ ఉపాసానతో మంత్రసిద్ధి, బ్రహ్మ జ్ఞానం కలుగుతాయి. గాయత్రీ మంత్ర జపంతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుంది. ఆది శంకరులు గాయత్రీ దేవిని అనంతశక్తి స్వరూపంగా అర్చించారు. ప్రాతఃకాలంలో గాయత్రీ గానూ, మధ్యాహ్న కాలంలో సావిత్రిగా, సాయంసంధ్యలో సరస్వతిగానూ ఉపాసకులతో పరమేశ్వరి ఆరాధనలు అందుకుంటుంది.. గాయత్రీమాత ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి.

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో రెండో రోజు జగన్మాత దుర్గమ్మను వేదమాత గాయత్రీదేవిగా అలంకరిస్తారు. పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్ఠాన దేవతగా అమ్మవారిని కొలుస్తారు. కొబ్బరిఅన్నాన్ని నివేదనగా సమర్పిస్తారు. సకల మంత్రాలకు, వేదాలకు మూలమైన దేవతగా గాయత్రీదేవి ప్రసిద్ధి. మహత్తర శక్తిగల జగన్మాత ఐదు ముఖాలతో వరదాభయ హస్తాలు ధరించి కమలాసనాసీనురాలిగా నేడు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

Leave a Comment