పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు తొమ్మిదోవ రోజు చేరుకున్నాయి. శ్రీభ్రమరాంబికాదేవి సిద్ధిధాయిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.. ముందుగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై సిద్ధిధాయిని అలంకారంలో ఉన్న అమ్మవారికి పలురకాల పూలతో అలంకరించి.. బిల్వాదళాలతో శాస్త్రోక్తంగా అర్చకులు వేదపండితులు వేదమంత్రాలతో మంగళవాయిద్యాల నడుమ సుగంధ ద్రవ్యాలతో ధూపదీప నైవేద్యాలతో పూజించి మంగళ హారతులిచ్చారు.
శ్రీ భ్రమరాంబికాదేవి సిద్ధిధాయిని అలంకారంలో అలానే మల్లికార్జునస్వామి అమ్మవారు కైలాసవాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు చేసి కర్పూరహారతులిచ్చారు. అనంతరం వైభవంగా గ్రామోత్సవానికి బయలుదేరగా ఉత్సవమూర్తుల ముందు కోలాటాలు,కేరళ చండీ మేళం, సాంప్రదాయ నృత్య విలక్కు, స్వాగత నృత్యం, కేరళ సాంప్రదాయ డ్రమ్స్, వివిధ రకాల గిరిజన నృత్యాలు వివిద రకాల విన్యాసాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆలయం లోపలి నుంచి బాజా బజంత్రీలు బ్యాండ్ వాయిద్యాల నడుమ శ్రీస్వామి అమ్మవార్లు గ్రామోత్సవంగా విహారించగా గ్రామోత్సవం కదలివస్తున్న శ్రీస్వామి అమ్మవారిని భక్తులు దర్శించుకుని కర్పూర నీరాజనాలర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాస రావు దంపతులు, అర్చకులు అధికారులు,భక్తులు పాల్గొన్నారు.








