శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి: బ.త్రయోదశి రా.11.43 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం: ఆశ్లేష ఉ.8.52 వరకు, తదుపరి మఖ,వర్జ్యం: రా.9.01 నుండి 10.38 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.17 నుండి 9.05 వరకు, తదుపరి ప.12.19 నుండి 1.07 వరకు,
అమృత ఘడియలు: ఉ.7.14 నుండి 8.50 వరకు.
సూర్యోదయం : 5.52
సూర్యాస్తమయం : 5.58
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుండి 4.30 వరకు
మేషం
తోటివారి సూచనలను పాటించడం ఉత్తమం. మీ మీ రంగాల్లో మీ పరిధిని మించిన విషయాల్లో తలదూర్చకండి. వ్యాపారంలో మీరు చేసే ఆలోచనల్ని ఎదుటివారితో పంచుకోవడం ద్వారా సాధ్యసాధ్యాలను అంచనా వేయవచ్చు. శ్రీవేంకటేశ్వరస్వామి సందర్శనం శుభప్రదం.
వృషభం
మీ మీ రంగాల్లో శుభఫలితాలు ఉన్నాయి. ముఖ్యమైన విషయాల్లో సొంత నిర్ణయాలు పనిచేస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్ని అందిస్తాయి. విష్ణు సందర్శనం శుభప్రదం.
మిథునం
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోకండి. తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు. దుర్గా స్తోత్రం చదవండి.
కర్కాటకం
ప్రారంభించబోయే పనుల్లో కాలానుగుణంగా ముందుకు సాగండి, మంచి జరుగుతుంది. నూతన వస్తువులను సేకరిస్తారు. అనవసర ఖర్చులను అదుపులో ఉంచండి. హనుమత్ ఆరాధన శుభప్రదం.
సింహం
వృత్తి, ఉద్యోగాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. కీలక వ్యవహారాల్లో వెనకడుగు వేయకండి. ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు సాగండి. స్థిర నిర్ణయాలు విజయాన్ని చేకూరుస్తాయి. గోవింద నామాలు చదవడం మంచిది.
కన్య
అనుకూల సమయం. తోటివారి నుంచి సహాయసహకారాలు అందుతాయి. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను పొందుతారు. ప్రయాణాలు ఫలిస్తాయి. గణపతి ఆరాధన శుభప్రదం.
తుల
ప్రారంభించబోయే పనుల్లో గొప్పఫలితాలు సాధిస్తారు. మనః సంతోషాన్ని పొందుతారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది.
వృశ్చికం
ఉత్సాహంగా పనిచేయాలి. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతీ విషయాన్ని కుటుంబంతో చర్చించి ప్రారంభించాలి. శ్రీలక్ష్మీ సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది.
ధనుస్సు
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ మనోబలంతో ముందుకు సాగండి, అనుకూల ఫలితాలు వస్తాయి. శ్రమ పెరుగుతుంది. ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది.
మకరం
ధర్మచింతనతో వ్యవహరిస్తారు. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. నలుగురికీ ఆదర్శంగా నిలుస్తారు. దైవబలం సంపూర్ణంగా రక్షిస్తోంది.సూర్యనారాయణ మూర్తి ఆరాధన శుభదాయకం.
కుంభం
మానసికంగా దృఢంగా ఉంటారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అధికారుల నుంచి సహాయసహకారాలు అందుతాయి. దుర్గాదేవి దర్శనం శుభకరం.
మీనం
తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలు వస్తాయి. అనవసర విషయాల గురించి సమయాన్ని వృథా చేయకండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. శ్రీరామ నామాన్ని జపించడం ఉత్తమం.