మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న చిత్రం మన శంకరవరప్రసాద్‌గారు (Mana Shankara Vara Prasad Garu Movie). ఈ మూవీతో బ్లాక్‌బస్టర్ కొట్టేందుకు అనిల్ రావిపూడి సిద్ధమైపోయాడు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్‌కు ఇంకా మూడు నెలల సమయం ఉన్నప్పటికీ ప్రమోషన్స్‌తో ఫుల్ స్వింగ్‌లో దూసుకెళ్తున్నారు.
‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu)లోని ‘మీసాల పిల్ల’ (Meesala Pilla) ఫుల్ సాంగ్ (లిరికల్ వీడియో) వచ్చేసింది. దసరా సందర్భంగా విడుదలైన ఈ సాంగ్ ప్రోమో విశేషంగా అలరించిన సంగతి తెలిసిందే. అందులోని చిరంజీవి స్టైలిష్ లుక్, ఆయన గ్రేస్, ఉదిత్ నారాయణ్ వాయిస్‌కు ఫిదా అయిన వారంతా పూర్తి పాట ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూశారు. చిత్ర బృందం తాజాగా ఆ సర్ప్రైజ్ను ఇచ్చింది. భాస్కర్లభట్ల రాసిన ఈ పాటకు భీమ్స్ సంగీతం అందించారు. చిరంజీవి (Chiranjeevi), నయనతార ప్రధాన పాత్రల్లో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ మూవీ 2026 సంక్రాంతికి విడుదల కానుంది.










