అవకాడో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పండుగా చెప్పవచ్చు. ఇందులో మన శరీరానికి కావాల్సినంత పొటాషియం అవకాడోలో దొరుకుతుంది. చాలామంది పొటాషియం పుష్కలంగా ఉండేది అరటిపండు మాత్రమే అనుకుంటారు. కానీ అవకాడోలో పొటాషియంతో బాటు పోషకాలు అనేకం ఉన్నాయి. కళ్లను సంరక్షించుకోవడానికి అవకాడో బాగా పనిచేస్తుంది. అంధత్వ నివారణకు ఆవకాడోను మించిన ఔషధం లేదనే చెప్పాలి. అవకాడోలో లూటిన్, జీక్సాన్ తిన్లు ఉంటాయి. ఇవి కంటికి నష్టం కలిగించే కిరణాలను తాకకుండా కాపాడతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గడం కోసం అవకాడోను తినాలని వైద్యులు చెబుతున్నారు. అవకాడోలో శరీరానికి ఉపయోగపడే మంచి కొవ్వు ఉంటుంది. చెడు కొవ్వు దాదాపు ఉండదనే చెప్పాలి. పుట్టుకతో వచ్చే లోపాలు అధిగమించడానికి ఆవకాడో తినాలని అంటున్నారు. గర్భం దాల్చిన వెంటనే ఆవకాడోను తినడం ప్రారంభిస్తే మంచిదిని చెబుతున్నారు.
ఆకుపచ్చగా మెరిసిపోయే అవకాడోలో ఉండే నియాసిన్ ను తినడం వల్ల శరీరంలో ఉన్న వాపు తగ్గే అవకాశం ఉంటుంది. రక్తనాళాల్లో మంచి కొవ్వు పెరిగి చెడు కొవ్వును తగ్గించే శక్తి అవకాడోలో ఉంది. అవకాడోను తింటే విటమిన్ ఇ శరీరానికి చేరుతుంది. దీనివల్ల అల్జీమర్స్ వ్యాధి నుంచి కాపాడుకున్నట్టు అవుతుంది. అల్జీమర్స్ వ్యాధి వల్ల జ్ఞాపకశక్తి మందగిస్తుంది. ఆలోచనా సామర్ధ్యం తగ్గిపోతుంది. విటమిన్ ఇ వల్ల యాంటి ఆక్సిడెంట్ నిల్వలు పెరిగిపోతాయి. కాలుష్యం వల్ల మెదడులోని కణాలు దెబ్బతింటాయి. కాలుష్యంతో పాటు సూర్యుడి నుంచి వచ్చే రేడియేషన్ వల్ల కూడా అల్జిమర్స్ వ్యాధి వస్తుంది. సగటున చాలామంది ఒకసారి సగం మాత్రమే తింటారు. పెద్దల్లో 15శాతం మందికి ప్రతిరోజు విటమిన్ కె అవసరం ఉంది. ఈ పోషకం వల్ల ఎముక సాంద్రత పెరుగుతుంది. అంతేకాదు పగుళ్లను నిరోధిస్తుంది. అవకాడో ముక్కలను పాలకూరలో కలిపి తింటే లేదా సాల్మన్, తున చేప, గుడ్డుతో కలిపి తింటే ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
అవకాడోలో తక్కువ స్థాయిలో కార్బోహైడ్రేడ్స్, చక్కెర, ఆరోగ్యకర కొవ్వు, పీచు పెద్దమొత్తంలో ఉంటాయి. మధుమేహ రోగులకు మేలు చేసే పండు ఇది. చర్మ సౌందర్యానికి ఆవకాడోను మించినది లేదు. ఇందులో ఉండే విటమిన్ C వల్ల చర్మంలో నిగారింపు సాధ్యపడుతుంది. చర్మం కోమలంగా మారుతుంది. చర్మం మీద ముడతలు కనిపించవు. ఆల్ట్రావయొలెంట్ కిరణాల వల్ల చర్మం దెబ్బతినకుండా అవకాడో కాపాడుతుంది. దెబ్బలు తగిలినప్పుడు, సన్ బర్న్ సమయాల్లో వీటిని ఉపయోగిస్తారు. అవకాడోలో ఒలెయిక్ ఆసిడ్స్ ఉంటాయి. మోనోసాచురేటెడ్ ఫాటీ యాసిడ్ ఉంటుంది. దీనివల్ల రొమ్ము క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది. అనేక అధ్యయనాలు ఇదే విషయాన్ని తేటతెల్లం చేశాయి. దాదాపు నాలుగువేల మంది మహిళల మీద పరిశోధనలు చేశారు. అవకాడో .. లుకేమియా కణాలను దెబ్బతీస్తుందట. వాచిన ప్రొస్టేట్ కు అవకాడో మంచి ఔషధమని చెప్పొచ్చు. విటమిన్ ఎ, డి, ఇ, కె యాంటి ఆక్సిడెంట్ అయిన లైసొపెన్ ఉంటాయి. టొమాటోతో బాటు అవకాడోను కూరల్లో వేస్తే ఆ రుచే వేరు. ఆకుపచ్చ ద్రాక్ష, పుచ్చకాయ ముక్కల్లో ఆవకాడోను కలిపి తింటే టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది.