Pallavi Prashanth : పరారీలో బిగ్‌బాస్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్

By manavaradhi.com

Updated on:

Follow Us

బిగ్‌బాస్-7 విన్నర్ గా నిలిచిన తర్వాత జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 5లోని అన్నపూర్ణ స్టూడియో వద్దకు ఆదివారం రాత్రి పల్లవి ప్రశాంత్‌, అమర్‌దీప్‌ అభిమానులు దాడులు జరిగిన విషయం మనకు తెలిసిందే. అయితే ఆ దాడులకు సంబంధించి పల్లవి ప్రశాంత్‌ కారణమని తేల్చారు పోలీసులు. జూబ్లీహిల్స్‌లో వాహనాల ధ్వంసం, దాడి ఘటనలో బిగ్‌బాస్‌ విజేత పల్లవి ప్రశాంత్‌ను జూబ్లీహిల్స్‌ పోలీసులు ప్రధాన నిందితుడిగా కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఎ-1గా పల్లవి ప్రశాంత్‌ను చేర్చగా, ఎ-2గా అతని సోదరుడు మనోహర్‌ను, ఎ-3గా అతని స్నేహితుడు వినయ్‌ను చేర్చారు. ఎ-4గా ఉన్న ఉప్పల్‌ మేడిపల్లికి చెంది లాంగ్‌ డ్రైవ్‌ కార్స్‌లో డ్రైవర్లుగా పనిచేస్తున్న సాయికిరణ్‌(25)ను, అంకిరావుపల్లి రాజు(23)ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్‌ చేశారు.

బిగ్బాస్ 7 ఫ్యాన్స్ వీరంగం కేసులో ఇప్పటికే జూబ్లిహిల్స్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు .. వాళ్ళు కూడా ప్రశాంత్ స్నేహితులు కావడం విశేషం. అంతేకాదు ఇప్పటికే పోలీసులు రంగంలోకి దిగి మూడు ప్రత్యేక బృందాలగా ప్రశాంత్ కోసం గాలిస్తున్నారు. అయితే బిగ్ బాస్ విన్నర్ ప్రశాంత్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ ఎక్కడున్నా వెతికి పట్టుకోవడం కోసం పోలీసులు అన్ని చోట్ల ఆరా తీసున్నారు. పోలీసుల అనుమానం ప్రకారం సిద్ధిపేట జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో ఉన్నట్లు సమాచారం తెలుసుకుని..పోలీసులు అక్కడికెళ్లినట్లు తెలుస్తోంది. ఏ తప్పు చేయకపోతే ప్రశాంత్ దాక్కోవడం ఏంటనీ కొందరు నెటిజన్స్ ప్రశాంత్పై ఫైర్ అవుతున్నారు. ఇది ఎంత వరకు నిజం అన్న విషయం తెలియదు.

బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ ప్రకటన తర్వాత డిసెంబర్ 17 అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద పల్లవి ప్రశాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రన్నరప్ అమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అభిమానుల మధ్య గొడవ జరిగింది. ఇరువర్గాలు రెచ్చిపోయి టిఎస్ ఆర్ టీసీ సిటీ బస్సులపై దాడిచేసి అద్దాలు పగులగొట్టారు. బందోబస్తు కోసం వచ్చిన పంజాగుట్ట పోలీస్ వెహికల్ తో పాటు బెటాలియన్ బస్సు అద్దాలను కూడా ధ్వంసం చేశారు. అంతే కాకుండా జూబ్లీహిల్స్ చెక్​పోస్టు వద్ద హంగామా సృష్టించారు. ఇరు వర్గాల రాళ్ల దాడిలో పలు కార్ల అద్దాలు పగిలిపోయాయి. రన్నరప్​గా నిలిచిన అమర్ దీప్ కారుపై కూడా కొందరు దాడి చేశారు. పలువురు జర్నలిస్టులు గాయపడ్డారు. బిగ్​బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్​పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది.

రైతు బిడ్డగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి ప్రశాంత్ సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ సంపాదించుకొన్నాడు. రైతు బిడ్డ అనే సానుభూతితో ఏకంగా విన్నర్ గా నిలిచాడు .. కానీ ప్రస్తుతం తన అభిమానుతో పాటు తానుకూడా ఇలా ప్రవర్తించడం ద్వారా తనకు వచ్చిన ఇమేజ్ పూర్తిగా పోయేలా చేసుకున్నట్లు నెటిజన్స్ అనుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఈ కేసుకు సంభందించి ప్రశాంత్‌ తరుపు లాయర్‌ జూబ్లీహిల్స్‌ పీఎస్‌కు వచ్చి కేసు వివరాలు సేకరించనున్నారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు స్పందించకపోతే డీజీపీ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రశాంత్ లాయర్ రాజ్‌కుమార్‌ సిద్దమయ్యారు. ఇందుకు సంబంధించిన పూర్తి కేసుల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. బిగ్‌బాస్‌ విజేత పల్లవి ప్రశాంత్‌ తప్పు చేస్తే పోలీసులు ఆధారాలతో సహా కేసు నమోదు చేయాలని ఆయన తరఫు న్యాయవాది రాజేష్‌ కుమార్‌ అన్నారు.

Leave a Comment